Latest Updates
-
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది! -
నోట్లో ఇట్టే కరిగిపోయే జ్యూసీ మటన్ తహరీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.! -
ఇతరుల సీక్రెట్స్ తెలుసుకోవడంలో ఈ 3 రాశుల వారే కింగ్స్..వాళ్లవి మాత్రం ముక్క కూడా చెప్పరు! -
చాణక్య నీతి: ఈ నాలుగు పనులు చేసిన తర్వాత స్నానం చేయడం తప్పనిసరి.. లేదంటే.! -
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి!
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.!
రాఖీ పౌర్ణమి సందర్భంగా మార్కెట్లో స్వీట్స్‌కి భలే గిరాకీ ఉంటుంది. కానీ బయట ఎన్ని రకాల స్వీట్స్ కొన్నా.. ఇంట్లో చేసుకున్న స్వీట్స్‌కి క్రేజ్ ఎక్కువ. అలా అని అదే పనిగా గంటల తరబడి కిచెన్‌లో కూర్చుని స్వీట్స్ ఐటమ్స్ చేయడం కుదరని పని. రాఖీ పండుగను సంతోషంగా జరుపుకొంటూనే ఇంట్లో ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ ఒకటుంది. అదే కొకొనట్ బర్ఫీ.. పచ్చి కొబ్బరితో నిమిషాల్లోనే ఈ స్వీట్‌ను తయారుచేసుకోవచ్చు. నోట్లో వేస్తే కరిగిపోయేలా స్వీట్ షాప్ స్టైల్‌ను మించిన టేస్ట్‌తో కొకొనట్ బర్ఫీని ఎలా తయారుచేయాలో చూద్దాం..

కొకొనట్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు
పచ్చి కొబ్బరి ముక్కలు- రెండు కప్పులు
నీళ్లు- రెండు కప్పులు
నెయ్యి- రెండు టేబుల్ స్పూన్లు
పంచదార- కప్పు
కాచి చల్లార్చిన పాలు- కప్పు
ఏలకుల పొడి- అర టీస్పూన్
కొకొనట్ బర్ఫీ తయారీ విధానం
ముందుగా కొబ్బరి కాయ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలకు వెనుకవైపు ఉండే భాగాన్ని తీసేసి కేవలం కొబ్బరిని మాత్రమే తీసుకోవాలి.
ఈ పచ్చి కొబ్బరి ముక్కలను మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రెండు కప్పుల నీళ్లు తీసుకుని వీలైనంత మెత్తగా రుబ్బుకోవాలి.
తయారైన పచ్చికొబ్బరి జ్యూస్ మిశ్రమాన్ని జల్లెడ, పల్చటి క్లాత్ సాయంతో వడగట్టుకుని పాలను, కొబ్బరి తురుమును వేరు చేయాలి.
ఒకేసారి ఇడ్లీ, రైస్‌లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.!
ఇప్పుడు పాలు తీసేయగా మిగిలిన కొబ్బరి తురుమును స్టవ్‌పైన పాన్ పెట్టి అందులో నెయ్యి వేసి కరిగాక వేసుకోవాలి. కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి. కాస్త రంగు మారుతుంది.
ఇప్పుడు అందులో పంచదార, పాలు పోసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని చిన్న మంటపైన ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం అంతా అడుగంటకుండా దగ్గరికి అయ్యేవరకు కలుపుతూ ఉండాలి. ఏలకుల పొడి వేసి మరికాసేపు కలపాలి.

మిశ్రమం గట్టి పడి స్టిక్కీగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక వెడల్పాటి ప్లేట్‌పైన నెయ్యి రాసి దీనిని ప్లేట్‌పైన మందంగా పరుచుకోవాలి.
స్పాచులాతో బర్ఫీ మాదిరిగా ఒత్తుకోవాలి. గార్నిషింగ్ కోసం పైనుంచి సిల్వర్ పేపర్‌ను అప్లై చేయండి. తర్వాత పిస్తా పప్పులను పైన కొంచెం చల్లండి.
ఈ బర్ఫీ పూర్తిగా చల్లారిన తర్వాత చాకు తీసుకుని మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవచ్చు. అంతే రుచికరమైన కొకొనట్ బర్ఫీ రెడీ. ఈ బర్ఫీలను వారం నుంచి పది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు.
కొబ్బరి పాలతో జున్ను
ఇక బర్ఫీలు చేసేటప్పుడు మిగిలిన కొబ్బరి పాలను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా.. దీంతో కమ్మనైన జున్ను తయారుచేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్..

ఇందుకోసం ఒక బౌల్లో పావు కప్పు నీళ్లు తీసుకుని అందులో అరకప్పు కార్న్‌ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా బాగా స్టిర్ చేసుకోవాలి.
దీనిని కొబ్బరి పాలలో పోసి బాగా కలిపి స్టవ్‌పై మరిగించుకోవాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో ముప్పావు కప్పు పంచదార వేసి పాలు బాగా చిక్కబడే వరకు కలపాలి.
రాఖీ 2026 స్పెషల్: మీ చేతులతో సోదరుడి కోసం కుంకుమపువ్వు పిస్తా మిల్క్ కేక్ ఇలా చేయండి!
కొబ్బరి పాల మిశ్రమం చిక్కబడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసినప్పుడు ఒక దీర్ఘచతురస్రాకర బౌల్లో పోసుకుని చల్లారనివ్వాలి.
తర్వాత మూత పెట్టి ఫ్రిజ్‌లో గంటపాటు ఉంచాలి. గంట తర్వాత బయటకి తీసి చూస్తే గట్టిపడుతుంది. కొబ్బరి పాల జున్ను రెడీ. మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని పిస్తాపప్పుతో గార్నిష్ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications