Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పురుషులు ఈ వ్యాయామాలు చేస్తే శృంగారంలో పనితీరు మెరుగుపడుతుంది, క్లైమాక్స్ ఫుల్ మజానిస్తుంది
శృంగారానికి శారీరక, మానసిక ఆరోగ్యం చాలా కీలకం. ఆరోగ్యంగా ఉంటేనే శృంగారాన్ని బాగా ఆస్వాదించవచ్చు. వ్యాయామం చేయడం వల్ల శరీరం చురుకుగా తయారవుతుంది. ఆ చురుకుదనం శృంగారానికి చాలా ముఖ్యం. సరైన శరీర బరువు, మంచి ఫ్లెక్సిబిలిటీ, స్టామినా, ఎండ్యురెన్స్ ఉంటే ఎక్కువ సేపు శృంగారం చేయడంతో పాటు భాగస్వామిని సంతృప్తి పరచగలం.
పురుషులు ముఖ్యంగా శారీరకంగా చురుకుగా లేకపోతే శృంగార సమయంలో సౌకర్యవంతంగా ఉండలేరు. ఇష్టమైన, సంతృప్తికర భంగిమలు ప్రయత్నించలేరు. అయితే పురుషులు కొన్ని రకాల వ్యాయామాలు చేయడం ద్వారా శృంగారంలో పనితీరు మెరుగుపరచుకోవచ్చు. స్టామినా పెరుగుతుంది. మరి ఆ వ్యాయామాలు ఏంటో తెలుసుకుందామా..

వెయిట్ లిఫ్టింగ్:
లైంగిక పనితీరు మెరుగుపడాలంటే వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్ వల్ల శరీరంలో టెస్టోస్టెరాన్ ఉత్పత్తి మెరుగుపడుతుంది. టెస్టోస్టెరాన్ అంటే మగ సెక్స్ హార్మోన్. ఇది శృంగార కోరికలను పెంచుతుంది. వెయిట్ లిఫ్టింగ్ అలవాట్లు లేకపోతే.. చిన్న స్థాయి నుంచి ప్రారంభించాలి. క్రమంగా బరువు పెంచుతూ పోవాలి. పుష్-అప్‌లు, సిట్-అప్‌లు, క్రంచెస్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. కండరాలను పెంచే వ్యాయామాలు ద్వారా భుజాలు, ఛాతీ, అబ్స్ ను బలోపేతం చేయడం ద్వారా శృంగారం పనితీరు మెరుగుపడుతుంది. శృంగార సమయంలో ఈ కండరాలే ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి ఎగువ శరీర బలం ముఖ్యం.
కెగెల్స్:
కెగెల్స్ వ్యాయామం పురుషుల లైంగిక పనితీరును మెరుగుపరచడంలో మంచి ఫలితాన్ని ఇస్తాయి. కెగెల్ వ్యాయామాలు పుబోకోసైజియస్(PC) కండరాలను టోన్ చేయడం ద్వారా ఎండ్యురెన్స్, కంట్రోలింగ్ కు సహాయపడతాయి. ఇవి మూత్రం మధ్యలో ప్రవాహాన్ని ఆపడానికి సహాయపడతాయి. కెగెల్స్ వ్యాయామం పెల్విక్ ఫ్లోర్‌లోని కండరాలను బలోపేతం చేస్తాయి. ఇది మంచి సెక్స్ కు దారితీస్తుంది. పురుషులు ఉద్వేగానికి ముందు ఈ కండరాలని సంకోచించడం ద్వారా స్ఖలనం ఆలస్యం చేయడానికి కెగెల్స్ వ్యాయామం ఉపయుక్తంగా ఉంటుంది.
యోగా:
యోగాను సాధన చేయడం ద్వారా సంభోగ సమయంలో మరింత ఆనందాన్ని పొందుతారు. సెక్స్ చేస్తున్నప్పుడు వివిధ భంగిమల్లో సంభోగించడానికి శరీరం ఫ్లెక్సిబిలిటీని సాధిస్తుంది. దీని వల్ల మెరుగైన సెక్స్ ను ఆస్వాదించవచ్చు. కటి కండరాలను మెరుగుపరచడానికి యోగా భంగిమలు ఉపయోగపడతాయి.
వేగంగా నడవడం:
ఏరోబిక్ వ్యాయామం వల్ల అంగస్తంభన సమస్య 30 శాతం తగ్గుతుందని హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. రోజుకు కనీసం 200 కేలరీలు బర్న్ చేసే వేగవంతమైన నడక వల్ల అంగస్తంభన ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. బ్రిస్క్ వాకింగ్ సర్క్యులేషన్ ను, రక్త ప్రవాహాన్ని మెరుగుపరిచి అంగాన్ని ఎక్కువసేపు స్తంభించేలా చేస్తుంది. వేగంగా నడవడం, పరుగెత్తడం, ఇతర ఏరోబిక్ వ్యాయామాలు రక్తనాళాలను స్పష్టంగా ఉంచి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.
ఈత:
స్విమ్మింగ్ వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం అవుతుంది. ఈత కొట్టాలంటే శరీరం మొత్తాన్ని కదిలించాలి. దీని వల్ల శక్తి ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే కాసేపు ఈత కొడితే ఎక్కువగా అలసిపోతుంటారు. అలాంటి ఈతను రోజూ సాధన చేయడం వల్ల స్టామినా పెరుగుతుంది. సెక్స్ సమయంలో మరింత ఎక్కువ సేపు సంభోగించడానికి వీలవుతుంది. ఈత వల్ల బరువు తగ్గవచ్చు, శరీరంలోని కొవ్వు కరుగుతుంది, ఏరోబిక్ వ్యాయామం వల్ల గుండె పనితీరు, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. దీని వల్ల ఎక్కువసేపు సెక్స్ చేసినా అలసట, ఆయాసం రాకుండా ఉంటుంది.



Click it and Unblock the Notifications