Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
అప్పులతో అవస్థలు పడుతున్నారా.. సంకష్టహర చతుర్ధిరోజు ఇలా చేయండి, అప్పులన్నీ మాయం!
చాలా మంది సంపాదన లక్షల్లో ఉన్నప్పటికీ.. అప్పులు కుప్పలుగా అవుతుంటాయి. వారు కావాలని చేయకపోయినప్పికీ కొన్ని సందర్భాల్లో విపరీతంగా అప్పులు పెరిగిపోతుంటాయి. అయితే వాటిని తీర్చడం చాలా కష్టమవుతుంది. కొన్ని సంవత్సరాల పాటు ఎన్ని డబ్బులు కట్టినా అప్పులు మాత్రం అలాగే ఉంటాయి. అయితే వాటన్నిటిని తొలగించుకొని జీవితం హాయిగా సాగేలా చేసుకోవాలనుకుంటే ఈ పనులు కచ్చితంగా చేయాల్సిందే. ముఖ్యంగా సంకష్టహార చతుర్థి రోజు మేము చెప్పబోయే పనులు చేశారంటే అప్పులన్నీ అలా తీరిపోతాయి.

సంకట హార చతుర్థి వ్రతం చేయాలి:
తిథుల్లో అత్యంత ప్రీతికరమైన సంకష్టహార చతుర్ధి. దీన్నే సంకట హార చతుర్థి అని కూడా అంటారు. ప్రతీ నెలా సంకష్టహార చతుర్థి వస్తుంటుంది. కానీ 2023 జులై 6వ తేదీన అంటే గురువారం రోజున ఈసారి సంకట హార చతుర్థి రాబోతుంది. అప్పుల బాధ నుంచి విముక్తి కోసం సంకటహార చతుర్థి రోజు సాయంత్రంలోగా ఈ ఒక్క పని చేయాలి. సంకష్టహార చుతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకంలో కుజదోష సమస్యలు తొలిగి, చేసే పనుల్లో మంచి జరుగుతుందని చెబుతారు. ఈ సంకటహార చుతర్థి ప్రతి నెలా కృష్ణపశ్రం అంటే పౌర్ణమి తర్వాత మూడు, నాలుగు రోజుల్లో చవితినాడు వస్తుంది. ప్రదోష కాలంలో అంటే సూర్యాస్తమయం ఏ సమయంలో ఉంటుందో ఆరోజు సంకట హార చతుర్థిగా పరిగణిస్తారు.
ఈరోజు ముడుపు కడితే మరింత మంచిది
తెలుపు లేదా ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకొని అందులో మూడు గుప్పిట్ల బియ్యం పోసి, రెండు ఎండు ఖర్జూరాలు, రెండు వక్కలు, రూ.11 లేదా 21 వేదా 51 లేదా 101 పెట్టి ముడుపు కట్టుకోవాలి. ఎన్ని నెలలు పూజ చేయాలనుకుంటే అన్ని నెలలు ఆ ముడుపుకు పూజ చేయాల్సి ఉంటుంది. ఈ ముడుపు పైన పూలు, ముడుపు కింద తమలపాకులు అరటిపండు పెట్టి పూజించాలి. ఆ తర్వాత నిత్యపూజ చేసుకొని, గణపతి అష్టోత్తరం, శోడషోపచార పూజ చేసుకోవాలి. దగ్గర్లోని ఏదైనా ఓ గుడికి వెళ్లి 3 లేదా 5 ప్రదక్షిణలు చేయాలి. అలాగే గణపతికి గరికను కూడా సమర్పించాలి.
వ్రతం పూర్తయ్యే వరకూ ఉడికించినవి తినడం నిషేదం:
సూర్యాస్తమయం తర్వాత స్నానం చేసి స్వామికి దీపారాధన చేయాలి. అప్పటి వరకు ఉడికించినవి ఏమీ తినకూడదు. పాలు, పండ్లు, పచ్చి కూరగాయలు మాత్రం తినవచ్చు. ఈ వ్రతాన్ని 3, 5, 21 నెలలు పాటించాలి. సాయంత్రం ఎక్కడ పూజించాలనుకుంటున్నారో అష్టదళం ముగ్గు వేసుకోవాలి. ఆ తర్వాత ఆసనం కోసం పీఠం వేయాలి. ఆపై పీఠ మీద కొత్త జాకెట్ ముక్క పరవాలి. ప్రతీనెల కొత్తది వేయాల్సిన అవసరం లేదు. పూజ పూర్తయిన వెంటనే మళ్లీ దేవుడి గదిలో జాకెట్ ముక్క పెట్టుకుంటే సరిపోతుంది. అయితే స్వామి వారి పటాన్ని ఆ జాకెట్ పై పెట్టుకొని వినాయకుడికి ఇష్టమైన మందార పూలను సమర్పించుకోవాలి.
పరమాన్నం, కుడుములు ప్రసాదంగా పెట్టాలి:
అలాగే దీపాలను పెట్టుకుని.. పూజకు కూర్చున్నప్పుడు మాత్రమే పసుపు గణపతిని తయారు చేసుకోవాలి. పసుపు, కుంకుమ, గంధంతో స్వామి వారిని అలంకరించుకోవాలి. ఓం కేశవాయనమః, ఓం కమాధవాయ నమః, అని మూడు సార్లు తీర్థం తీసుకొని దీపారాధన చేయాలి. రెండు వత్తులు నూనెలు ముంచి ఏకారాధన చేసుకోవాలి. ఆ తర్వాత సంకట నాశన స్తోత్రం పఠించాలి. ఇది చదివేటప్పుడు స్వామి వారిని వినాయకుడికి ఇష్టమైన దానిమ్మ, గన్నేరు, సమర్పించాలి. ప్రసాదం పరమాన్నం, కుడుములు కూడా సమర్పించాలి. ఆ తర్వాత స్వామి వారికి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వాలి. ప్రాంతాన్ని బట్టి సంకష్టహార చతుర్థి సమయం మారుతుంది.
ఆ పసుపు గణపతిని ఏం చేయాలంటే?
అయితే వ్రతం అయిపోయిన తర్వాత రోజు దీపారాధన చేసుకొని పూజలో పెట్టుకున్నవి కదుపుకోవచ్చు. పూజలో పెట్టిన పసుపు గణపతిని స్త్రీలు ముఖానికి లేదా మంగళ సూత్రానికి రాసుకోవచ్చు. అలా కుదరదు అనుకుంటే పచ్చని చెట్లు ఉన్న చోట కూడా వేయవచ్చు. కానీ తులసి చెట్టు వద్ద మాత్రం అస్సలే పెట్టకూడదు. ఇలా చేయడం వల్ల అప్పులన్నీ తీరిపోయి ఆనందంగా ఉంటారు. మీ సేవింగ్స్ కూడా పెరుగుతాయి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











