Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
మీ నాన్న ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఈ 3 రకాల గింజలు ఇవ్వండి
యాభై ఏళ్లు దాటాక ఆరోగ్యం అంటే.. గుప్పెడు మందులు వేసుకోవడం కాదు, మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవడం. మనల్ని కంటికి రెప్పలా పెంచిన నాన్నగారి ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ వహించాల్సిన సమయం ఇదే. వయసు పైబడుతున్న కొద్దీ వారి శరీరానికి అవసరమైన పోషకాలను అందించడం మన బాధ్యత. అందుకే, మీ నాన్నగారి రోజువారీ ఆహారంలో మూడు అద్భుతమైన గింజలను చేర్చాలని,ఇవి వారిని ఎప్పటికీ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంచుతాయని డాక్టర్ మల్లికాసాయి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపారు.

అవిసె గింజలు- 50 ఏళ్ల తర్వాత ఇవి బంగారమే
అవిసె గింజలు వయసు పైబడిన వారికి సంజీవని లాంటివి.
గుండెకు రక్ష: వీటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను రక్షిస్తాయి, శరీరంలో వాపులను తగ్గిస్తాయి.
కొలెస్ట్రాల్ కంట్రోల్: చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండెను పదిలంగా ఉంచుతాయి.
ప్రోస్టేట్ ఆరోగ్యం: ముఖ్యంగా వృద్ధాప్యంలో పురుషుల్లో వచ్చే ప్రోస్టేట్ సమస్యలు రాకుండా ఇందులో ఉండే లిగ్నన్స్ అనే సహజ సమ్మేళనాలు కాపాడతాయి.
జీర్ణక్రియ: ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం సమస్య దరిచేరదు.
ఎలా వాడాలి?: రోజూ 1 నుంచి 2 టీస్పూన్ల అవిసె గింజలను పొడి చేసి.. పెరుగులో, స్మూతీలలో లేదా గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగమని ఇవ్వండి.
గుమ్మడి గింజలు - మగవారికి పవర్ సీడ్స్
50 ఏళ్లు దాటిన పురుషులకు గుమ్మడి గింజలు ఎంతో అవసరం.
శక్తినిస్తాయి: వీటిలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది పురుషుల్లో టెస్టోస్టెరాన్ (Testosterone) స్థాయిలను మెరుగుపరిచి, శారీరక శక్తిని ఇస్తుంది.
ప్రోస్టేట్ రక్షణ: వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రోస్టేట్ గ్రంథి సంబంధిత సమస్యలను ఇవి సమర్థవంతంగా అడ్డుకుంటాయి.
ప్రశాంతమైన నిద్ర: ఇందులో ఉండే మెగ్నీషియం, ట్రిప్టోఫాన్ అనే మూలకాల వల్ల రాత్రిపూట ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పడుతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్: రోగనిరోధక శక్తిని అమాంతం పెంచి, త్వరగా రోగాల బారిన పడకుండా కాపాడతాయి.
ఎలా వాడాలి?: రోజూ గుప్పెడు (ఒక టేబుల్ స్పూన్) గుమ్మడి గింజలను నేరుగా పచ్చివి కానీ, లేదా దోరగా వేయించుకుని కానీ స్నాక్ లాగా తినవచ్చు.
చియా సీడ్స్ - సైజు చిన్నది.. లాభాలు పెద్దవి
చూడటానికి చిన్నగా ఉండే ఈ గింజలు చేసే మేలు అంతా ఇంతా కాదు.
ఫైబర్ పవర్ హౌస్: జీర్ణక్రియను వేగవంతం చేసి, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను పూర్తిగా నివారిస్తాయి.
షుగర్ కంట్రోల్: రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తాయి. తద్వారా డయాబెటిస్ (మధుమేహం) ముప్పును తగ్గిస్తాయి.
గుండెకు బలం: వీటిలో ఉండే ఒమేగా-3 గుండె జబ్బుల నుండి రక్షణ కల్పిస్తుంది.
బరువు నియంత్రణ: ఇవి తింటే ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉంటుంది. దీనివల్ల ఊబకాయం రాకుండా బరువు నియంత్రణలో ఉంటుంది.
ఎలా వాడాలి?: ఒక టీస్పూన్ చియా సీడ్స్‌ను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. లేదా ఉదయం పూట తాగే మజ్జిగలో కలుపుకుని కూడా తీసుకోవచ్చు.
వయసు పైబడే కొద్దీ మందుల మీద ఆధారపడటం కన్నా, ప్రకృతి ప్రసాదించిన ఇలాంటి పవర్ ఫుల్ ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
