Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
Father's day 2026: ఈ ఫాదర్స్ డే నాడు పిల్లల నుండి తండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు..
ఫాదర్స్ డే అనగానే పిల్లలు నాన్నలకు బహుమతులు ఇవ్వడం, లేదా నాన్నలు పిల్లల కోసం ఇంకేం చేయాలి అనే ఆలోచనే ఎక్కువగా వస్తుంది. కానీ ఈ ఫాదర్స్ డే నాడు ఒక కొత్త కోణంలో ఆలోచించండి. తండ్రులుగా మీకు మేరేం చేసుకుంటున్నారు? మీ అవసరాలు ఏమిటి? అని ప్రశ్నించుకోవడానికి ఇది సరైన సమయం.

పిల్లలు ఎప్పుడూ ఆన్ లైన్ లోనే ఉంటున్నారు, మొబైల్స్ కే అతుక్కుపోతున్నారు అని మనం తరచుగా బాధపడుతుంటాం. దానికి బదులుగా వారు ఎక్కడ ఉండాలని మనం కోరుకుంటాం? బయట ప్రకృతిలో, స్నేహితులతో ఆడుకుంటూ, గిటార్ లాంటి కొత్త విషయాలు నేర్చుకుంటూ, నవ్వుతూ గడపాలని కదా.
ఇటీవలి కాలంలో యువత, ముఖ్యంగా అబ్బాయిల మానసిక ఆరోగ్యం, వారిలోని ఒంటరితనం గురించి ఎక్కువగా చర్చిస్తున్నాం. సామాజిక సంబంధాలు తగ్గిపోవడం పెద్ద సమస్యగా మారింది. దీనికి నిపుణులు చెప్పే పరిష్కారం ఒక్కటే..శరీరానికి పని చెప్పండి, నలుగురితో కలవండి, ఏదైనా ఆటలో లేదా సేవలో పాల్గొనండి. కానీ కొంచెం లోతుగా ఆలోచిస్తే..ఈ పరిష్కారం కేవలం పిల్లలకే కాదు, బాధ్యతల సుడిగుండంలో పడిపోయిన తండ్రులకు కూడా అత్యవసరం అనిపిస్తుంది.
మన పిల్లలు స్నేహితులను సంపాదించుకుంటారో లేదో అని ఆందోళన చెందే తండ్రులు.. అసలు మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? మీకు మనసు విప్పి మాట్లాడే స్నేహం ఎక్కడ దొరుకుతుంది? అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? స్మార్ట్ ఫోన్ లు, సోషల్ మీడియా యుగంలో పిల్లలను ఎలా పెంచాలనే దానిపైనే తండ్రుల దృష్టి అంతా ఉంటుంది. కానీ అదే తండ్రులు కూడా అదే ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారన్న నగ్న సత్యాన్ని తప్పించుకుంటున్నారు.
ఒక సర్వే ప్రకారం..దాదాపు ప్రతి ముగ్గురు పురుషులలో ఒకరు తీవ్రమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. వంద మంది పరిచయస్తులు ఉన్నారా అన్నది ముఖ్యం కాదు, మనల్ని పూర్తిగా అర్థం చేసుకునే వారు ఒక్కరున్నా ఆ మానసిక ప్రశాంతతే వేరు. ఈ ఒంటరితనాన్ని జయించడానికి పరిశోధనలు చెబుతున్న మార్గాలు చాలా సులువైనవి.
వారానికి కనీసం రెండు గంటలు ప్రకృతిలో గడపడం, రాత్రి పూట కుటుంబంతో కలిసి భోజనం చేయడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది. అలాగే ఒంటరి వ్యాయామం కంటే కూడా, ఏదైనా ఒక జట్టుతో కలిసి ఆడే క్రీడల్లో పాల్గొనడం మానసిక ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
మీరు పిల్లల కోసం ఏం కోరుకుంటామో, తండ్రులుగా మనకు కావాల్సింది కూడా అక్షరాలా అదే. సమస్యలు లేని పరిపూర్ణమైన జీవితమో, నిరంతర ఆనందమో మనకు అవసరం లేదు. మనం ఉన్నప్పుడు పలకరించే, లేనప్పుడు వెతుక్కునే ఒక చిన్న ఆత్మీయ సమూహం కావాలి.



Click it and Unblock the Notifications
