Latest Updates
-
మీరు సెప్టెంబర్లో జన్మించారా.. మీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా.? -
నేపాల్ దేశంలో ఎంతో ఫేమస్..ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోయే తెల్ల నువ్వుల చట్నీ చేసుకోండిలా.. -
జిమ్ చేసేవారికి పర్ఫెక్ట్ స్వీట్.. పంచదార లేని హై ప్రోటీన్ పీనట్ బటర్ లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
ఈ సొసైటీ మిమ్మల్ని చిన్న చూపు చూస్తుందా.. మీ గౌరవం పెరగాలంటే ఈ 3 విషయాలు గుర్తుంచుకోండి.! -
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ..
సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించటం యొక్క విశిష్టత
మన తల్లిదండ్రులు,తాతముత్తాతలు మన చిన్నతనం నుండి ఉదయమే లేవటం మరియు సూర్యుడికి ఆర్ఘ్యం వదలటం వంటి ఆచారాలను నేర్పుతూ వొస్తున్నారు. నేటి సమాజంలో మనం వ్యవహరించే ఆచారాలు, విశ్వాసం మరియు నమ్మకం ఉన్న సూర్యుడికి నీరుని సమర్పించటం వంటివి నిజంగా మనకు సహాయపడుతున్నాయా లేదా కేవలం ఇది మరొక పురాణంలాగా వింటున్నామా!
సూర్యునికి దోసిలిలో నీరుని సమర్పించటానికి అనేక పరిశోధనలు మరియు అనేక శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. రెండు చేతులు దోసిలిగా పెట్టి, ఆ దోసిలిలో నీరు తీసుకుని రెండు చేతులను సూర్యదేవుని దిశగా పైకెత్తి పెట్టి, సన్నని ధారతో దోసిలిలోని నీరు వొదలాలి మరియు ఆ సమయంలో సూర్యుని నుండి వొచ్చే బలమైన కిరణాల వలన మనం సూర్యుని వైపు చూడలేము, మన పూర్వీకులు సూర్యభగవానుడికి ప్రాతఃకాలంలో విస్తృత అంచు కలిగి ఉన్న ఒక గిన్నెతో ఆర్ఘ్యం అందించేవారు. వారు నీటిని రెండు చేతులను సూర్యభగవానుని దిశగా పైకి ఎత్తి నీరుని సమర్పించేటప్పుడు వారి కళ్ళ ముందు ఆ సన్నని నీటి ధార దేవుడి దిశగా వెళుతున్నట్లుగా అనుభూతి చెందేవారు మరియు మన పూర్వీకులు (ఋషులు, సాధువులు) ఆ ప్రవహిస్తున్న నీటి చిత్రం ద్వారా.సూర్యభగవానుని చూసేవారు. సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్న కిరణాలు ( నీటి ప్రవాహం చిత్రం) వారి కళ్ళను మాత్రమే కాదు, వారి మొత్తం శరీరం మరియు ఆత్మను కూడా ఉత్తేజపరుస్తాయి.
శాస్త్రవేత్తలు ఉదయాన్నే సూర్యుడు కిరణాలు సోకటం మానవునికి మంచిదని చెబుతారు. మానవ శరీరమే ఒక అద్వితీయమైన శక్తితో కూడుకున్నది. మానవ శరీరం ఐదు అంశాలతో చేయబడింది, గాలి (వాయు), నీరు (జల), భూమి (పృథ్వి) , అగ్ని (శక్తి) మరియు అంతరిక్షము (ఆకాశము) మరియు శరీరంలోని అన్ని రోగాల నివారణ ఈ ఐదు అంశాల వలన మాత్రమే సాధ్యమవుతుంది మరియు ఉదయిస్తున్న సూర్యుని కిరణాలలో ఈ అంశాలు ఉండటం ఒక విశేషం. పలు వ్యాధులు సూర్యుని కిరణాలను ఉపయోగించి నయం చేయవచ్చు ఉదా. గుండె జబ్బులు , కళ్ళు, కామెర్లు, కుష్టు మరియు బలహీనమైన మెదడు.

మనల్ని నిద్ర నుండి మేల్కొలిపేలా చేసేది సూర్యభగవానుడు అని ఋగ్వేదం చెపుతున్నది. సూర్యుని కారణంగా అన్ని పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జీవకోటి సృష్టి అంతా సూర్యుడి మీద ఆధారపడి ఉన్నది. సూర్యుడు అనేక భౌతిక, మానసిక మరియు ఆధ్యాత్మిక బలహీనతలను తొలగిస్తాడు మరియు ఆరోగ్యకరమైన , దీర్ఘాయువును ఇస్తాడు. సూర్యుడి ఏడు రంగులు ఆరోగ్యానికి చాలా మంచివి మరియు ముఖ్యమైనవి. ఎవరయితే ప్రాతః కాలాన్నే స్నానం ఆచరించి మరియు సూర్య దేవుడిని ప్రార్థించటం చేస్తారో మరియు వారి శరీరానికి సూర్యుని కిరణాలు తాకుతాయో, వారి శరీరం అన్ని రుగ్మతల నుండి విముక్తి పొందుతుంది మరియు వారి యొక్క మేధస్సు పెరుగుతుంది.
మరోవైపు సూర్యుడు నీటి కోసం దాహంతో లేడు అని పేర్కుంటూ సిద్ధాంతాలు ఉన్నాయి లేదా సూర్యుడిని చేరుకోవటానికి ఇది ఒక మార్గమా. కేవలం ఈ సిద్ధాంతం నిరూపించడానికి గంగా నది తీరాన నీటిని తరలించడానికి 2- 3 అడుగుల మార్గం సృష్టించాడు.. ఆ సాధువును పవిత్రమైన నీటిని ఎందుకు వృథా చేస్తున్నావు అని ఇతరులు అడిగినప్పుడు అతను ప్రశాంతంగా తను గ్రామంలో తన పొలాలకు నీరును తరలిస్తున్నాను అని బదులిచ్చాడు.
మిగతా సాధువులందిరికి కోపం వచ్చింది మరియు ఈ విధంగా నీటిని నీ పొలాలకు తరలించటం సాధ్యం కాని పని అని అన్నారు. అప్పుడు ఆ సాధువు నవ్వి "మీరు సూర్యుడికి సమర్పించే ఆర్ఘ్య సమర్పణలు ఎలా చేరుతున్నాయి? వాటివలన మనం ఏ విధంగా లాభం పొందగాలుగుతున్నాము? అని అడిగాడు' ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ ఈ రెండు తత్వాల మధ్య విభేదం కొనసాగుతూనే.ఉన్నది.



Click it and Unblock the Notifications