Latest Updates
-
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే.. -
బీహారీ స్పెషల్ చోఖా..పొలం గట్టు మీద కూర్చొని ఈ పచ్చడి కలిపి అన్నం తింటుంటే స్వర్గమే!
అయోధ్య బాలరాముడిపై సూర్య తిలకం.. కిరణాలు నుదుటిపై పడేందుకు ఏమి చేసారంటే..!
శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అయోధ్యలో రామమందిరం తెరచినప్పటి నుంచి మొదటి సారి ఈ సూర్యతిలకంతో బాలరాముడు దర్శనమిచ్చాడు. సూర్య కిరణాలు బాలరాముడి నుదిటిపై వచ్చే విధంగా శాస్త్రీయంగా అద్దాలతో అమర్చారు.

సూర్య తిలకం
ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా మద్యహ్నం 12గంటల నుంచి 12.30 గంటల మధ్య ఐదు నిమిషాలపాటు ఈ సూర్యతిలకం వచ్చే విధంగా ఏర్పాాటు చేశారు. వేలమంది భక్తులు సూర్యతిలకం ధరించిన బాలరాముడిని అయోధ్యలో దర్శించుకున్నారు.
500 ఏళ్ల తరువాత మళ్లీ శ్రీరాముడు అయోధ్యలో దర్శనమిచ్చాడు. ఇది మొదటి శ్రీరామనవమి కావడంతో వేడుకలు చాలా ఘనంగా జరిగాయ్.
ప్రత్యేక లెన్సులు
ఈ సూర్యతిలకం రాముడి నుదుటిపై వచ్చేలా చేయడానికి నాలుగు అద్దాలను, నాలుగు లెన్సులను ఉపయోగంచారని ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ రామచర్ల తెలిపారు. ప్రతీ శ్రీరామనవమికి ఈ సూర్యతిలకంతో ఉన్న బాలరాముడిని దర్శించవచ్చంటున్నారు.
ఏర్పాటులో నాన్యత
ఈ లెన్సులను, అద్దాలను నాన్యత కలిగిన ఇత్తడితో తయారు చేసిన పైపుల ద్వారా అమర్చారు. ఇలాంటి సూర్యతిలకం దర్శనం కొన్ని జైన దేవాలయాల్లో చూడవచ్చు. కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు కలిసి ఈ సూర్యతిలకం పడేలా చేయడానికి కృషి చేశారు.
సూర్య కిరణాల వల్ల బాలరాముడి విగ్రహానికి ఎలాంటి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సూర్య తిలకం కోసం పదిమంది శాస్త్రవేత్తలు కలిసి పనిచేశారు. నుదుటిపై పడ్డ సూర్యకిరణం వెడల్పు 5.8 సెంటిమీటర్లు.



Click it and Unblock the Notifications
