Latest Updates
-
చాతుర్మాస్య స్పెషల్: ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచినిచ్చే ఆల్ రౌండర్ మసాలా ఇంట్లోనే చేసుకోండిలా.. -
రక్షాబంధన్ 2026: రాఖీ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు తీసేయాలి.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.! -
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.! -
సన్నగా ఉండే వారిలోనూ ఫ్యాటీ లివర్.. ఒంట్లో కొవ్వు లేకపోయినా ఈ రిస్క్ తప్పదు.! -
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్! -
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
డియోడరెంట్లతో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం.. మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు.! -
సాయంత్రం సమయంలో ఇంట్లో చేసే ఈ తప్పులు ఆర్థిక సమస్యలకి దారితీస్తాయని తెలుసా.!
బుధ అస్తమయం: సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశుల వారికి గడ్డుకాలమే..ఆఫీసులో, వ్యాపారంలో ఊహించని కుట్రలు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు, వాటి స్థాన మార్పులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఏ గ్రహం స్థానం మారినా దాని ప్రభావం మానవుల జీవితాలపై నేరుగా పడుతుంది.
ముఖ్యంగా మనిషి బుద్ధి, ఏకాగ్రత, వాక్చాతుర్యం, వ్యాపారం, వృత్తిగత జీవితాలను శాసించే బుధ గ్రహం ఆగస్టు 18వ తేదీ ఉదయం అస్తమయ స్థితిలోకి చేరుకుంది. ఈ అస్తమయ దశ సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 7:09 గంటల వరకు కొనసాగుతుంది.

అస్తమయం అంటే ఏమిటంటే.. సాధారణంగా ఏదైనా గ్రహం సూర్యుడికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు, సూర్యుడి తేజస్సు ముందు ఆ గ్రహం తన సహజ శక్తిని కోల్పోతుంది. దీన్నే గ్రహ అస్తమయం అంటారు. ఆగస్టు 17న సూర్యుడు సింహ రాశిలోకి ప్రవేశించగా, ఆగస్టు 22న బుధుడు కూడా సింహ రాశిలోకి అడుగుపెడుతున్నాడు. దీనివల్ల సూర్యుడు, బుధుడు ఒకరికొకరు మరింత చేరువవుతారు. ఫలితంగా గ్రహాల రాకుమారుడైన బుధుడి ప్రభావం క్షీణిస్తుంది. ఈ బుధ అస్తమయం వల్ల ముఖ్యంగా నాలుగు రాశుల వారు తీవ్రమైన ప్రతికూలతలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
మేష రాశి
మేష రాశి వారికి ఈ నెల రోజులు కాస్త గడ్డు కాలమే. ముఖ్యంగా మీరు మాట్లాడే మాటల వల్లే కొత్త సమస్యలు కొనితెచ్చుకుంటారు. మీ మాటతీరు వల్ల ఆఫీసులో తోటి ఉద్యోగులతో అపార్థాలు, వివాదాలు తలెత్తే ప్రమాదం ఉంది. పని ప్రదేశంలో పెరిగే మానసిక ఒత్తిడి.. మీ వ్యక్తిగత, కుటుంబ జీవితంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. వ్యాపారస్తులు నష్టాలను చవిచూసే అవకాశం ఉంది కాబట్టి ఆచితూచి అడుగువేయాలి.
సింహ రాశి
బుధుడు సింహ రాశిలోకే ప్రవేశిస్తుండటం వల్ల ఈ రాశి వారిపై నేరుగా ప్రతికూల ప్రభావం పడుతుంది. మీ ఆరోగ్యం, పరువు ప్రతిష్టలు, కెరీర్‌పై ఇది తీవ్రమైన దెబ్బ కొట్టొచ్చు. మీకు తెలియని రహస్య శత్రువులు మీపై కుట్రలు చేసే అవకాశం ఉంది. పనిలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ముఖ్యంగా కార్యాలయంలో ఎవరితోనూ వాగ్వివాదాలకు దిగకండి, సైలెంట్ గా మీ పని మీరు చేసుకోవడం బెటర్.
కన్యా రాశి
కన్యా రాశికి అధిపతి బుధుడే. స్వయంగా తమ రాశ్యాధిపతి అస్తమించడంతో ఈ రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. భారీ ఆర్థిక నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుని పెట్టుబడులు పెట్టకండి. ప్రాపర్టీ అగ్రిమెంట్లు, ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకాలు చేసేముందు ఒకటికి పదిసార్లు చదువుకోవడం మంచిది. లేదంటే మోసపోయే ప్రమాదం ఉంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి బుధుడి అస్తమయం వల్ల టెన్షన్లు విపరీతంగా పెరుగుతాయి. బీపీ (రక్తపోటు) లాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ వహించాలి. డబ్బు లావాదేవీలను కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం బెటర్. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. పనిలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేయాల్సి రావచ్చు. కుటుంబంలో కూడా ఉద్రిక్తతలు చోటుచేసుకుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications