Latest Updates
-
డయాబెటిస్ లక్షణాలు లేకపోయినా ప్రమాదమే! షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా? -
చపాతీ పిండిలో ఈ రెండు కలిపి చూడండి.. కూర లేకపోయినా కడుపునిండా తినేస్తారు! -
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే!
చలికాలంలో షుగర్ పేషంట్లు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం తినాలి?
షుగర్ వ్యాధి వచ్చిందనగానే చాలామందిలో మొదలయ్యే అతిపెద్ద భయం ఆహారం. ఏం తినాలి, ఏం మానేయాలి, ఎంత తినాలి అనే ఆందోళనతోనే సతమతమవుతుంటారు. నిజానికి షుగర్ పేషెంట్లు ఆహారం పూర్తిగా మానేసి కడుపు మాడ్చుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మీ ఆహారపు అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకుంటే చాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.
ఉదయం నిద్రలేవగానే..
రోజును ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో ప్రారంభించండి. పరగడుపున టీ లేదా చక్కెర ఉండే పానీయాలు తాగితే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. నిద్రలేచిన 30 నిమిషాల్లోపు 5 నుండి 6 నానబెట్టిన బాదం పప్పులు, ఒక వాల్ నట్ వంటి తేలికపాటి ఆహారం తీసుకోండి. అలాగే ఒక టీస్పూన్ నానబెట్టిన మెంతులు లేదా మెంతుల నీరు తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అద్భుతంగా నియంత్రణలో ఉంటాయి.

పోషకభరితమైన అల్పాహారం
షుగర్ పేషెంట్లకు బ్రేక్ ఫాస్ట్ అత్యంత ముఖ్యమైన భోజనం, దీనిని ఎట్టిపరిస్థితుల్లోనూ మానకూడదు. ఉదయం పూట ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం మొలకెత్తిన పెసలు, పెరుగు, గుడ్డులోని తెల్లసొన లేదా శనగపిండితో చేసిన అట్టు తినవచ్చు. పండ్లలో ఆపిల్, జామకాయ, బొప్పాయి, తాజా సలాడ్ ను మీ ఉదయపు బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకోండి.
బ్యాలెన్స్డ్ భోజనం
మధ్యాహ్న భోజనానికి ముందుగా దోసకాయ, టమాటా, క్యారెట్, ముల్లంగితో చేసిన సలాడ్ తినండి. ఆ తర్వాత గోధుమ, శనగ, బార్లీ పిండితో చేసిన రొట్టెలు, ఒక గిన్నె పప్పు, ఒక గిన్నె ఆకుకూరలు, ఒక గిన్నె పెరుగు, కొద్దిగా బ్రౌన్ రైస్ తీసుకోండి. తిన్న వెంటనే నిద్రపోకుండా కనీసం 10 నిమిషాల పాటు నెమ్మదిగా నడవండి.

సాయంత్రం 4-5 గంటల మధ్య చిరుతిళ్లు
సాయంత్రం వేళ ఆకలి వేసినప్పుడు నూనెలో వేయించిన అనారోగ్యకరమైన స్నాక్స్ కు దూరంగా ఉండండి. ఈ సమయంలో వేయించిన శనగలు, మఖానా, ఒక కప్పు మజ్జిగ లేదా గ్రీన్ టీ తీసుకోండి. ఇవి రాత్రి భోజనం వరకు మీ రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యంగా ఉంచడానికి ఎంతగానో సహాయపడతాయి.
తేలికపాటి డిన్నర్
నిద్రపోవడానికి మూడు గంటల ముందు, అంటే రాత్రి 7 నుండి 8 గంటల మధ్య భోజనం ముగించండి. ఆలస్యంగా తినడం వల్ల ఉదయం పూట చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. రాత్రిపూట అన్నం తినడం మానేసి, ఒకటి లేదా రెండు రొట్టెలు, ఒక గిన్నెడు పప్పు, సొరకాయ, బీరకాయ, పాలకూర వంటి తేలికపాటి కూరగాయలతో నిండిన గిన్నెడు కూర తినండి. భోజనం చేసిన తర్వాత 15-20 నిమిషాల పాటు తప్పకుండా నడవండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
