Latest Updates
-
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి! -
40 దాటాక విటమిన్ D ఎందుకంత కీలకం? త్రిష మార్నింగ్ రొటీన్ వెనుక ఉన్న అసలు నిజాలివే.. -
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే..
రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం, భద్ర, పంచకాలు.. మరి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి.?
తోబుట్టువుల మధ్య ఉండే అనురాగం, ఆప్యాయతలకు ప్రతీకగా ప్రతి యేటా పవిత్ర శ్రావణ మాసంలో పౌర్ణమి నాడు రాఖీ పౌర్ణమిని దేశవ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటాం. కాగా, ఈ సారి శ్రావణ పౌర్ణమి రోజే భద్రా నక్షత్రం, పంచకం, చంద్ర గ్రహణం వంటి అశుభ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మరి ఇవి రాఖీ పౌర్ణమిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి. ఏ సమయంలో పండుగ జరుపుకోవాలి.. జ్యోతిష్య పండితుల సలహాలు చూద్దాం..

రాఖీ పౌర్ణమి రోజులు సోదరీమణులు తమ సోదరుల చేతి మణికట్టుకి రాఖీ కట్టి వారు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా సోదరీమణులను తమ జీవితాంతం రక్షిస్తామని సోదరులు వాగ్ధానం చేస్తారు. అందుకే ఈ పండుగను దేశవ్యాప్తంగా అట్టహాసంగా జరుపుకొంటారు. ఆ రోజు ఇల్లంతా చుట్టాలతో సందడిసందడిగా ఉంటుంది. మిఠాయిలు తింటూ, నచ్చిన వంటకాలు ఆస్వాదిస్తూ జ్ఞాపకాలను దాచుకుంటారు. ఈ క్రమంలో జ్యోతిష్య శాస్త్రం ఈ సారి రక్షా బంధన్ రోజు కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
ఈ ఏడాది శ్రావణ పౌర్ణమి తిథి ఆగష్టు 27, 28 రెండు తేదీల్లో వస్తోంది. ఈ క్రమంలో ఈ పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే సందేహం నెలకొంది. కాగా, పౌర్ణమి తిథి సుర్యోదయంతో లెక్కిస్తారు. ఇలా చూసుకుంటే 28వ తేదీన శుక్రవారం రాఖీ పౌర్ణమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఇక పౌర్ణమి ఉపవాసం గురువారం పాటించవచ్చు.
భద్ర సమయం..
తెలుగు క్యాలెండర్ ప్రకారం.. ఆగస్టు 27న గురువారం ఉదయం 9:09 గంటలకు భద్రా నక్షత్ర చక్రం ప్రారంభమవుతుంది. రాత్రి 9:32 గంటలకు ముగుస్తుంది. రాఖీ పౌర్ణమి ఆగస్టు 28న రావడంతో భద్రా నక్షత్ర చక్ర ప్రభావం రక్షా బంధన్‌పై ఉండదని పండితులు చెబుతున్నారు.

పంచకం ప్రభావం..
పంచాంగం ప్రకారం పంచకం ఈ నెల 27న ప్రారంభమై 31వ తేదీ రాత్రి వరకు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సమయంలో కొన్ని కార్యకలాపాలు మాత్రమే నిషేధించారు. కానీ ఇతర శుభకార్యాలు చేయవచ్చని పండితులు సూచిస్తున్నారు. దీంతో పంచకం వల్ల రాఖీ పౌర్ణమి పండుగపై ఎలాంటి అశుభ ప్రభావాలు పడవని చెబుతున్నారు..
చంద్రగ్రహణం ప్రభావం
రాఖీ పౌర్ణమి రోజు చంద్రగ్రహణం కూడా సంభవిస్తుంది. అయితే ఈ గ్రహణం ప్రభావం భారత్‌లో ఎక్కడా కనిపించదని పండితులు చెబుతున్నారు. కాబట్టి చంద్రగ్రహణానికి సంబంధించి సూతకం వంటి ప్రభావాలు ఇక్కడ ఏమీ ఉండవని పేర్కొన్నారు. ఈ పండుగపై చంద్రగ్రహణం ఎఫెక్ట్ ఉండదు కాబట్టి.. ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా రక్షాబంధన్‌ను జరుపుకోవచ్చని సూచించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
