ఐరన్ లోపం, జుట్టు, చర్మ సమస్యలకు మేలు చేసే మునగ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!

Posted By:

చలికాలం వచ్చిందంటే చాలు, శరీరానికి హాయినిచ్చే వేడివేడి పానీయం తాగాలని ప్రతిఒక్కరికీ అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఎప్పుడూ తాగే టీ లేదా కాఫీలకు బదులుగా, ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకభరితమైన సూప్ తాగితే ఎంతో బాగుంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతిఒక్కరి ఆహారంలో తప్పకుండా చేర్చుకోవాల్సిన అద్భుతమైన కాయగూర మునగ. దీని కాయలు, ఆకులు రెండూ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరమైనవే.

మునగ సూప్ ఐరన్, విటమిన్ సి లకు మంచి మూలం కాబట్టి చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు మునగ మీ జుట్టు నుండి చర్మం వరకు అన్నింటికీ మేలు చేస్తుంది. ముఖ్యంగా ఐరన్ లోపంతో బాధపడేవారు దీనిని తాగడం వల్ల మొత్తం ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Healthy Drumstick Soup Recipe in elugu The Best Winter Drink Rich in Iron Vitamin C

తయారీ విధానం

-ముందుగా ప్రెషర్ కుక్కర్‌లో మునగకాయ ముక్కలు, టమోటా, తరిగిన అల్లం, నానబెట్టిన పెసరపప్పు, రుచికి సరిపడా ఉప్పు వేసి, అవసరానికి తగినంత నీరు (రెండు కప్పులు) కలపండి. కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి స్టవ్ ఆపేయండి.

-కుక్కర్ ఆవిరి పోయాక మూత తెరిచి, పదార్థాలన్నీ సరిగ్గా ఉడికాయో లేదో చూసుకోండి. ఆ తర్వాత మరిగించిన ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి.

-అన్నీ చల్లారిన తర్వాత, ఈ మిశ్రమం పూర్తిగా నునుపుగా మారేలా బ్లెండర్‌ లో వేసి బాగా బ్లెండ్ చేయండి. తర్వాత మునగకాయల పీచు ఏమాత్రం మిగిలిపోకుండా జల్లెడ సహాయంతో దీనిని శుభ్రంగా వడకట్టండి.

చలికాలం స్పెషల్ బ్రేక్‌ ఫాస్ట్..ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు పాలకూర దోసె చేసుకోండిలా..

-ఇప్పుడు తాలింపు కోసం ఒక బాండీలో నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగిన తర్వాత జీలకర్ర వేసి, గింజలు చిటపటలాడటం మొదలవగానే ఈ తాలింపును వడకట్టిన సూప్‌ లో కలపండి. ఇప్పుడు దీనిలో నల్ల మిరియాల పొడి వేసి, సూప్ బాగా మరిగే వరకు స్టవ్‌ పై ఉడికించండి.

-కొద్ది సమయంలోనే నెయ్యి, మిరియాల ఘుమఘుమలతో కూడిన మునగకాయ సూప్ రెడీ. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులతో అలంకరించి, వేడివేడిగా గిన్నెల్లో పోసి వడ్డించండి.

[ of 5 - Users]
Story first published: Friday, November 20, 2026, 23:23 [IST]
Desktop Bottom Promotion