Latest Updates
-
ఐరన్ లోపం, జుట్టు, చర్మ సమస్యలకు మేలు చేసే మునగ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా! -
చలికాలంలో నువ్వులు తింటే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! -
చుక్క నూనె లేకుండా వెజిటబుల్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా, రుచిగా తయారు చేసుకోండిలా -
బంపర్ ఆఫర్ అంటే ఇదే.. రీఛార్జ్ తో పాటు ఫ్రీగా రూ.1 లక్ష ఇన్స్యూరెన్స్ ఇస్తున్న BSNL -
చలికాలంలో వెచ్చని వాతావరణం కోరుకుంటున్నారా? భారత్ లో తప్పక చూడాల్సిన 5 బెస్ట్ ప్రదేశాలివే! -
మధ్యాహ్న భోజనానికి బెస్ట్.. వంకాయ మునగకాయ మసాలా 10 నిమిషాల్లోనే చేయండిలా.. -
ఎసిడిటీ, గ్యాస్ వేధిస్తున్నాయా? ఈ 5 ఇంటి చిట్కాలతో చిటికెలో ఉపశమనం! -
ఉద్యోగస్తులు, బ్యాచిలర్స్ కోసం త్వరగా అయిపోయే మసాలా కొబ్బరి అన్నం...పిల్లల లంచ్ బాక్స్ కు బెస్ట్ -
జలుబు వల్ల వచ్చే తీవ్రమైన తలనొప్పిని తగ్గించే బెస్ట్ చిట్కా ఇదే -
నార్త్ ఇండియా స్టైల్ పుట్టగొడుగులు బంగాళదుంప మసాలా..తరతరాలకు గుర్తుండిపోయే రుచి!
20 నిమిషాల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ లేని పీనట్ బటర్..ప్రోటీన్, పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన అల్పాహారం
బ్రెడ్ మీద వేరుశెనగ వెన్న (పీనట్ బటర్) పూసుకుని తినడం రుచిగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ మార్కెట్లో దొరికే వాటిలో శుద్ధి చేసిన చక్కెర, ప్రిజర్వేటివ్ లు, అదనపు నూనెలు ఎక్కువగా ఉండవచ్చు. ప్రతిరోజు అల్పాహారంలో పీనట్ బటర్ తినే అలవాటు ఉంటే, దాన్ని ఇంట్లోనే సులభంగా చేసుకోవడం మంచిది. ఇందుకు ఎక్కువ సమయం పట్టదు, తయారీ విధానం కూడా చాలా తేలిక. అమెరికా వ్యవసాయ శాఖ (USDA) ప్రకారం.. 100 గ్రాముల పీనట్ బటర్ లో 22.5 గ్రాముల ప్రోటీన్, 4.8 గ్రాముల ఫైబర్ ఉంటాయి. అలాగే 49 మి.గ్రా. కాల్షియం, 1.73 మి.గ్రా. ఐరన్, 169 మి.గ్రా. మెగ్నీషియం, 339 మి.గ్రా. ఫాస్ఫరస్, 564 మి.గ్రా. పొటాషియం, 2.54 మి.గ్రా. జింక్, 1.86 మి.గ్రా. మాంగనీస్, 4.1 మైక్రోగ్రాముల సెలీనియం లభిస్తాయి.
ప్రముఖ చెఫ్ పంకజ్ భదౌరియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన రెసిపీలో ప్రిజర్వేటివ్ లు లేదా ప్రాసెస్డ్ షుగర్స్ లేకుండా పీనట్ చేసుకోవచ్చు. సహజసిద్ధమైన తీపి కోసం ఖర్జూరాలు, తేనె వాడతారు కాబట్టి రోజూ తినడానికి అనువుగా ఉంటుంది. బయట కొన్నదానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఎంతో క్రీమీగా, రుచిగా వస్తుంది. ప్రిజర్వేటివ్ లు, చక్కెర లేకుండా పీనట్ బటర్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
ఉప్పు లేని పొట్టు తీసిన వేరుశెనగలు: 200 గ్రాములు
ఉప్పు: పావు టీస్పూన్
తేనె: 2 టీస్పూన్లు
వేరుశెనగ నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఖర్జూరాలు: 6-7
ఐరన్ లోపం, జుట్టు, చర్మ సమస్యలకు మేలు చేసే మునగ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!
తయారుచేసే విధానం
-నూనె వేయకుండా వేరుశెనగలను 8-10 నిమిషాలు పొడిగా వేయించండి. మంచి వాసన వచ్చి, పై తొక్క పగలడం మొదలయ్యే వరకు తక్కువ మంట మీద వేయిస్తే లోపలి పచ్చిదనం పోతుంది.
-వేరుశెనగలను పూర్తిగా చల్లారనిచ్చి, ఒక గుడ్డలో వేసి రుద్ది పొట్టు తీసి పారవేయండి.
-చల్లారిన పొట్టు తీసేసిన వేరుశెనగలను మిక్సర్ గ్రైండర్ లో వేసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోండి. ఈ పేస్ట్ లో తేనె లేదా గింజలు తీసిన ఖర్జూరాలు, ఉప్పు, వేరుశెనగ నూనె లేదా నెయ్యి వేసి మళ్లీ నునుపుగా రుబ్బండి.
-మార్కెట్ తరహా క్రీమీ పీనట్ బటర్ రెడీ. దీన్ని ఒక గాజు సీసాలో వేసి ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
