Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెల్లుల్లి రైస్.. తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచి -
టిక్కెట్ లేకుండా ప్రయాణం..చెకింగ్ కి భయపడి డోర్ లాక్..కదులుతున్న రైలు బయట వేలాడిన టీటీఈ! -
20 నిమిషాల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ లేని పీనట్ బటర్..ప్రోటీన్, పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన అల్పాహారం -
ఐరన్ లోపం, జుట్టు, చర్మ సమస్యలకు మేలు చేసే మునగ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా! -
చలికాలంలో నువ్వులు తింటే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! -
చుక్క నూనె లేకుండా వెజిటబుల్ పులావ్.. ఇంట్లోనే ఈజీగా, రుచిగా తయారు చేసుకోండిలా -
బంపర్ ఆఫర్ అంటే ఇదే.. రీఛార్జ్ తో పాటు ఫ్రీగా రూ.1 లక్ష ఇన్స్యూరెన్స్ ఇస్తున్న BSNL -
చలికాలంలో వెచ్చని వాతావరణం కోరుకుంటున్నారా? భారత్ లో తప్పక చూడాల్సిన 5 బెస్ట్ ప్రదేశాలివే! -
మధ్యాహ్న భోజనానికి బెస్ట్.. వంకాయ మునగకాయ మసాలా 10 నిమిషాల్లోనే చేయండిలా.. -
ఎసిడిటీ, గ్యాస్ వేధిస్తున్నాయా? ఈ 5 ఇంటి చిట్కాలతో చిటికెలో ఉపశమనం!
పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ నొప్పి ఉన్నప్పుడు.. ఇవి తీసుకుంటే చిటికెలో రిలీఫ్
పొట్ట ఉబ్బరంగా ఉన్నప్పుడు సోడాలు వంటివి తాగేస్తున్నారా? కడుపులో ఎసిడిటి ఎక్కువ అయ్యి గ్యాస్ట్రిక్ పెయిన్ వచ్చేటప్పుడు చాలామందికి పొట్ట బాగా ఉబ్బరంగా అనిపిస్తుంది. వాంతి అయినట్లు అనిపిస్తది..కొంతమందిలో ఉమ్మితో కూడిన వాంతులు అవుతాయి..ఛాతీ దగ్గర నొప్పి, మంట వచ్చేస్తుంటది.
గ్యాస్ట్రిక్ పెయిన్ మొదలవ్వగానే తేన్పులు వచ్చి తగ్గిపోతుందనే ఉద్దేశంతో చాలామంది కూల్ డ్రింక్స్ లేదా ప్లెయిన్ సోడా వైపు మొగ్గు చూపుతారు. కానీ ఈ అలవాటు మీ సమస్యను తగ్గించకపోగా మరింత తీవ్రతరం చేస్తుందని ప్రముఖ జనరల్ ఫిజిషియన్, ఏపీ పోలీస్ డిపార్ట్ మెంట్ లో మెడికల్ ఆఫీసర్ అయిన డాక్టర్ జవజాల మనోజ్ణ హెచ్చరిస్తున్నారు.

అది ఏ రకమైన సోడా అయినా సరే అది కార్బోనేటెడ్ పానీయమే కాబట్టి అది తాగాక పొట్ట లోపల ఇంకా ప్రెజర్ ఎక్కువ అయిపోయి యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటకు దారితీస్తుందని డాక్టర్ మనోజ్ణ తెలిపారు. తాత్కాలికంగా తేన్పు వచ్చినట్లు అనిపించినా, ఆ తర్వాత అసౌకర్యం రెట్టింపు అవుతుంది.
ఎసిడిటీ సమస్య ఉన్నప్పుడు సోడాలే కాదు ఆ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. యాపిల్ సిడర్ వెనిగర్, కాఫీ, టీ, నిమ్మరసం, చితంపండు, ఆరెంజ్ ఇలా పుల్లగా ఉన్న ఏవీ కూడా తీసుకోకూడదు. వీటి వల్ల కూడా యాసిడ్ రిఫ్లక్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

మరి ఉపశమనం కోసం ఏం వాడవచ్చు
కడుపు ఉబ్బరం, ఎసిడిటీ తగ్గాలంటే మన వంటింట్లో ఉండే సహజసిద్ధమైన దినుసులే అద్భుతంగా పనిచేస్తాయి. అవే జీలకర్ర, వాము, సోంపు. వీటితో తయారుచేసిన హోం రెమెడీస్ ఏవైనా వాడవచ్చు. . జీలకర్ర, వాము, సోంపు వంటి వాటితో తయారుచేసిన కషాయాలు లేదా గోరువెచ్చని నీటిలో వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడి గ్యాస్ త్వరగా తగ్గుతుంది. అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించిన తర్వాత కూడా నొప్పి లేదా మంట తగ్గకపోతే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
