Latest Updates
-
మై బ్రదర్, మై సూపర్ హీరో..మీ సోదరుడికి రాఖీ విషెస్ చెప్పండిలా -
టేస్టీ అండ్ క్రంచీ స్నాక్ ..కరకరలాడే శనగపిండి మసాలా పల్లీలు ఇలా చేసుకోండి -
తెల్ల ఇడ్లీ కాదు..అసలైన శక్తి ఉన్న నల్ల ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
నేపాల్ ను వణికించిన జలప్రళయం.. వరదల్లో చిక్కుకుంటే ప్రాణాలు ఎలా కాపాడుకోవాలి? -
Budha nakshatra gochar 2026 : పూర్వఫల్గుణి నక్షత్రంలోకి బుధుడు..ఆగస్టు 29 నుంచి ఈ 4 రాశులకు అగ్నిపరీక్షే! -
ఇంట్లో ఇడ్లీ, దోశ పిండి లేదా? అయితే కప్పు బియ్యంతో మల్లెపూవు లాంటి మెత్తని నీర్ దోశ చేసుకోండిలా! -
చూస్తేనే నోట్లో నీళ్లూరుపోయే హెల్తీ రాగి బిస్కెట్లు..ఓవెన్ లేకుండానే ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు
ఇంకా 15 రోజులే.. ఈ రాశుల వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో ఊహించని ధన యోగం.!
జులై నెల ముగియడానికి ఇంకా 15 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ చివరి పదిహేను రోజులు కొన్ని రాశుల వారికి కలిసి వస్తుండగా.. మరికొన్ని రాశుల వారికి సవాళ్లను తీసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఈ నెల ద్వితీయార్ధం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది.. తెలుసుకుందాం..

మేష రాశి
మేష రాశి వారికి జులై ద్వితీయార్ధం అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష్యం చెబుతోంది. వృత్తిపరంగా కొత్త బాధ్యతలను అందుకుంటారు. వ్యాపారంలో ఆర్థిక లాభాలు చూస్తారు. కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తయే సూచనలు మెండుగా ఉన్నాయి. ఆశించిన స్థాయిలో లాభాలు చూస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
వృషభ రాశి
వృషభ రాశి ఈ పదిహేను రోజులు కొంచెం సవాలుగానే ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఒడుదొడుకులు ఎదురుకావచ్చు. ఆర్థిక విషయాలపై ప్రత్యేక విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పండితులు చెబుతున్నారు. లావాదేవీల్లో తొందరపాటు పనికిరాదు. కుటుంబ విషయాల్లో ఓర్పుగా ఉండాలి. కళా రంగంలో ఉన్నవారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
మిథునం
బుధ గ్రహం తిరోగమనం నుంచి ముందుకు కదులుతుండగా మిథున రాశి వారికి ఈ పదిహేను రోజులు అనుకూలంగా ఉంటుంది. మీరు ఏ పని తలపెట్టినా కుటుంబీకుల నుంచి మద్దతు పొందుతారు. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. అయితే కొన్ని ముఖ్య విషయాల్లో ఇతరులను అతిగా నమ్మకూడదని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారి జులై ద్వితీయార్ధం ప్రత్యేక రోజులను తీసుకువస్తుంది. ఆర్థికపరమైన కీలక విషయాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి, వాహనాలు, భారీ పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబీకులస మద్దతు సంపూర్ణంగా ఉంటుంది.
సింహ రాశి
జులై రెండో అర్ధ భాగం సింహ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కొత్త విజయాలు అందుకోవడంతో సంతోషం రెట్టింపు అవుతుంది. కుటుంబీకుల నుంచి శుభవార్త అందుకునే సంకేతాలు ఉన్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుకుంటారు. కొత్త బాధ్యతలు చేపడతారు. వృత్తిపరంగా గౌరవం పొందుతారు.

కన్యారాశి
ఈ నెల 15 రోజులు కన్యా రాశి వారికి వృత్తిపరమైన పురోగతి లభిస్తుంది. ఉద్యోగంలో వృద్ధి పొందుతారు. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంతో కాలంగా మీ మనసులో ఉన్న కోరిక నెరవేరే సూచనలు ఉన్నాయి.
తులారాశి
తులా రాశి ఈ నెల మిగిలిన రోజులు మామూలుగానే గడిచిపోతుంది. వివాహానికి సంబంధించి మంచి ప్రతిపాదనలు అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రయోజనాలు అందుకుంటారు.
వృశ్చిక రాశి
ఈ నెలలో శని వక్రగమనం కారణంగా వృశ్చిక రాశి వారు అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ నెల ద్వితీయార్ధం వారికి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శక్తి తగ్గి నీరసంగా ఉండొచ్చు. వృత్తిపరంగా ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్యం చెబుతోంది. గొడవలకు దూరంగా ఉండాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి జులై ద్వితీయార్ధం కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో తెలివిగా పెట్టుబడులు పెట్టాలని పండితులు సూచిస్తున్నారు. వృత్తిపరంగా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో సానుకూల ఫలితాలు కనిపిస్తాయి.
మకర రాశి
జులై మిగతా 15 రోజులు మకర రాశి వారికి బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. వృత్తిపరమైన జీవితంలో ఉద్యోగులు ఊహించని విధంగా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబీకులతో ఆనందంగా గడుపుతారు. వృత్తిపరంగానూ సంతోషంగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభవార్త అందుకుంటారు.
కుంభ రాశి
కుంభ రాశి వారికి జులై ద్వితీయార్ధం ప్రత్యేకమైన సమయంగా తీసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అప్పులు చేయాల్సి రావచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా బడ్జెట్ పాటించాలని పండితులు చెబుతున్నారు. వృత్తిపరంగా ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని సూచిస్తున్నారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా ఉండకూడదని అంటున్నారు.
మీన రాశి
ఈ నెలలో మిగిలిన రోజులు మీన రాశి వారికి శని వక్రగతిలోకి ప్రవేశిస్తుంది. అందుకే రానున్న రోజులు ఆర్థిక, కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. చక్కదిద్దుకునేందుకు కష్టపడాల్సి వస్తుంది. దీంతో పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications