గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా?

జ్యోతిష్యంలో గురు గ్రహానికి(బృహస్పతి) చాలా విశిష్ఠమైన స్థానం ఉంది. దేవతల గురువుగా గురు గ్రహాన్ని పరిగనిస్తారు. మీన, ధనస్సు రాశులకు అధిపతిగా ఉండే గురువు..దాదాపు సంవత్సరం పాటు ఒకే రాశిలో ఉంటాడు.

ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్న గురువు..అక్టోబర్ 31న సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఈ రాశి మార్పు ముఖ్యంగా 3 రాశులకు చాలా మేలు చేస్తుంది. ఆ రాశులేవో, వారికి ఎలాంటి లాభాలు చేకూరనున్నాయో ఇక్కడ చూడండి.

Jupiter Enters Leo Koteeswara Yoga for Aries Sagittarius Aquarius

మేష రాశి

మేష రాశి వారికి గురుని సంచారం అత్యంత శుభప్రదంగా మారనుంది.సంతాన ప్రాప్తి కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న దంపతులకు శుభవార్త అందుతుంది. వివాహ ప్రయత్నాలు సాగిస్తున్న యువతీయువకులకు త్వరలోనే పెళ్లి యోగం కుదురుతుంది. నూతన ఆస్తుల కొనుగోలు, చిరకాల స్వప్నాలు నెరవేరే సమయం ఇది. చేపట్టిన ప్రతి పనిలోనూ అపూర్వ విజయాలు, వ్యాపారంలో భారీ లాభాలు కలుగుతాయి. మొత్తానికి మేష రాశివారికి ఇది కోటీశ్వరులను చేసే కాలం.

సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలుసిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు

ధనుస్సు రాశి

మీ కష్టాలన్నింటినీ తొలగి, జీవితంలో సరికొత్త పురోగతిని, ఉన్నతిని అందుకుంటారు. నూతన ప్రయత్నాలు విజయవంతమై, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ ఆర్థిక సంక్షోభాలు పూర్తిగా తొలగిపోయి, భగవంతుని ఆశీస్సులతో ధనలాభాలు కలుగుతాయి.

కుంభ రాశి

సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు, హోదా, సంపద అసాధారణంగా పెరుగుతాయి. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన వివాహం, ఇతర శుభకార్యాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. నిరాశా నిస్పృహలను వీడి, కుంభ రాశి వారు నూతన ఉత్సాహంతో అద్భుతమైన జీవితాన్ని సొంతం చేసుకునే సువర్ణావకాశం ఇది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Wednesday, October 14, 2026, 11:51 [IST]
Desktop Bottom Promotion