నవపంచమ దృష్టి యోగం..సెప్టెంబర్ 1 నుంచి ఈ 4 రాశుల జాతకం మారిపోబోతోంది!

జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహాన్ని..కర్మల ఫలదాత, న్యాయాధిపతి అని పిలుస్తారు. గురు గ్రహాన్ని..జ్ఞానానికి, అదృష్టానికి, సంపదకు కారకుడుగా భావిస్తారు. శని,గురు గ్రహాలని చాలా పవర్ ఫుల్ గా పరిగణించబడతాయి. ఈ రెండు గ్రహాల సంచారాల్లో వచ్చే మార్పులు మొత్తం 12 రాశులపై మంచి, చెడు రూపాల్లో తీవ్ర ప్రభావాన్ని చూపెడుతుంటాయి.

అయితే ఈ ఏడాది సెప్టెంబర్ లో ఒక అరుదైన జ్యోతిష్య ఘట్టం ఆవిషృతం కానుంది. సెప్టెంబర్ 1, 2026 మంగళవారం వేకువజామున 03:39 గంటల సమయంలో శని మీన రాశిలో వక్రగతిలో సంచరిస్తుండగా, గురువు తన ఉచ్ఛ స్థానమైన కర్కాటక రాశిలో కొలువై ఉంటాడు. ఈ అరుదైన సమయంలో గురు, శని గ్రహాలు ఒకదానికొకటి సరిగ్గా 120 డిగ్రీల కోణంలోకి వస్తాయి. దీనినే జ్యోతిష్య భాషలో నవపంచమ దృష్టి యోగం అని పిలుస్తారు. ఈ మహా యోగం 4 రాశుల వారి జీవితాల్లో కనకవర్షం కురిపించనుంది.

Navpancham Drishti Yoga 2026 on Sep 1 4 Zodiac Signs Set to Strike Gold

మేష రాశి

గురు, శనిల అరుదైన కలయిక వల్ల ఏర్పడే నవపంచమ దృష్టి యోగం మేష రాశి వారికి ఒక వరం లాంటిది. ఈ కాలంలో మీరు ఊహించని సానుకూల ఫలితాలను అందుకుంటారు. ఇన్నాళ్లుగా మిమ్మల్ని వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు పటాపంచలు అవుతాయి. డబ్బు సంపాదించే మార్గాలు సుగమం అవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. వ్యాపారస్తులు చేసే పర్యటనలు అత్యంత లాభదాయకంగా మారుతాయి. ఉద్యోగ, వృత్తి రంగాల్లో ఉన్నవారికి శరవేగంగా పురోగతి లభిస్తుంది.

కర్కాటక రాశి

బృహస్పతి మీ రాశిలోనే ఉచ్ఛస్థితిలో ఉండటం వల్ల ఈ యోగం కర్కాటక రాశి వారికి అమితమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కనీవినీ ఎరుగని స్థాయిలో భారీ లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులకు వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులు దక్కుతాయి. శుభవార్తలు వింటారు. మీ వ్యక్తిత్వంలో ఒక కొత్త ఆకర్షణ ఏర్పడుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఆగస్టు 25 నుంచి ఈ 3 రాశులకు కుప్పలుతెప్పలుగా ధనాగమం!చిత్తా నక్షత్రంలోకి శుక్రుడు.. ఆగస్టు 25 నుంచి ఈ 3 రాశులకు కుప్పలుతెప్పలుగా ధనాగమం!

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ గురు శని సంయోగం విజయానికి రాజమార్గం పరుస్తుంది. మీరు ఎంచుకున్న కెరీర్‌ లో అత్యున్నత శిఖరాలను చేరుకుంటారు. గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న దీర్ఘకాలిక సమస్యలు, కష్టాలు పూర్తిగా తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, అత్యంత నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. ఇంటి పెద్దల అనుభవం, వారు ఇచ్చే సలహాలు పాటించడం ద్వారా మీ జీవితంలోని ఒక అతిపెద్ద సమస్యను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు.

మకర రాశి

మకర రాశి వారికి ఈ నవపంచమ దృష్టి యోగం అత్యంత శుభప్రదమైన కాలాన్ని తీసుకురాబోతోంది. కార్యాలయంలో మీ సామర్థ్యానికి గుర్తింపు లభించి, ఒక కొత్త, ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని ఆర్థిక లాభాలు సిద్ధిస్తాయి. అదృష్టం మీకు ప్రతి అడుగులోనూ తోడుగా నిలుస్తుంది. ఏళ్లుగా పెండింగ్‌ లో ఉన్న పనులన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. మీ విజయాల వల్ల మీ కుటుంబ ప్రతిష్ట, గౌరవం నలుదిశలా వ్యాపిస్తుంది.

Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.

Story first published: Monday, August 24, 2026, 11:32 [IST]
q
Desktop Bottom Promotion