Latest Updates
-
ఒక్క లిప్ కిస్ ప్లీజ్.. విదేశీ యూట్యూబర్ తో మనోడు వెకిలి చేష్టలు, వీడియో చూడండి.. -
రాజస్థానీ పెరుగు వెల్లుల్లి చట్నీ.. ఇడ్లీ, దోశ, చపాతీలకు బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
ఆరోగ్యం, రుచి కలగలిసిన చలికాలం స్పెషల్..బీట్ రూట్ లడ్డూ ఇలా ఈజీగా చేసేయండి! -
సాయంత్రం టీ టైమ్ కోసం కరకరలాడే అటుకులు వేరుశెనగ పకోడీ.. నిమిషాల్లో ఇలా చేసుకోండి! -
కీళ్ల నొప్పులకు చెక్.మందులు లేకుండా ఉపశమనం ఇచ్చే ఆయుర్వేద నూనె మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
చలికాలంలో వేడివేడిగా తినాల్సిన వంటకం.. అచ్చమైన రాజస్థానీ మక్కీ బాటీ తయారీ ఎలాగంటే.. -
ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ బంగాళదుంప మోమోలు.. తక్కువ పదార్థాలతో సులభంగా చేసేయండిలా.. -
చలికాలంలో షుగర్ పేషంట్లు ఉదయం నుంచి రాత్రి దాకా ఏం తినాలి? -
డయాబెటిస్ లక్షణాలు లేకపోయినా ప్రమాదమే! షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా? -
చపాతీ పిండిలో ఈ రెండు కలిపి చూడండి.. కూర లేకపోయినా కడుపునిండా తినేస్తారు!
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు!
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుడిని అందం, ఆనందం, సంపద, శ్రేయస్సు, భౌతిక సుఖాలకు కారకుడిగా పరిగణిస్తారు. ఆగష్టు 25, 2026 (మంగళవారం) మధ్యాహ్నం 12:55 గంటలకు శుక్రుడు హస్తా నక్షత్రాన్ని వీడి, అంగారకుడి (కుజుడి) ఆధిపత్యంలో ఉండే చిత్ర నక్షత్రంలోకి ప్రవేశించి.. సెప్టెంబర్ 11, 2026 వరకు శుక్రుడు ఇదే నక్షత్రంలో సంచరిస్తాడు.
కుజుడి నక్షత్రంలో శుక్రుని సంచారం కొన్ని రాశులకు అదృష్టాన్ని తెచ్చిపెట్టినా, గ్రహాల స్థానాల ప్రభావం వల్ల ముఖ్యంగా 3 రాశుల వారికి మాత్రం గట్టి సవాళ్లను విసురుతోంది. ఆ అశుభ ప్రభావాలు ఎదుర్కొనే రాశులు, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇక్కడ చూడండి.

మిథున రాశి
కుజుడి నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశం మిథున రాశి వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఆచితూచి అడుగువేయాలి. కొత్త చోట పెట్టుబడులు పెట్టడం లేదా గుడ్డిగా ఇతరులను నమ్మడం వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. ప్రేమ సంబంధాలలో అనవసరమైన విభేదాలు తలెత్తవచ్చు. కాబట్టి ఈ కాలంలో వాదోపవాదాలకు దూరంగా ఉంటూ, వీలైనంత తక్కువగా మాట్లాడటం మీకు మంచిది.
కన్యా రాశి
కన్యా రాశి జాతకులకు ఈ నక్షత్ర మార్పు మిశ్రమ ఫలితాలను ఇచ్చినప్పటికీ, అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. మీ రహస్య ప్రేమ వ్యవహారాలను ఇప్పుడే బయటపెట్టకపోవడం ఉత్తమం. వ్యాపారస్తులు ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టాలనుకుంటే, నిపుణుల సలహా లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం నష్టాలకు దారి తీస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి శుక్రుని సంచారం ఏమంత ఆశాజనకంగా లేదు. ఆర్థిక లావాదేవీల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీ ఆదాయాన్ని మించి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నందున, బడ్జెట్ ప్రణాళిక తప్పనిసరి. ఈ కాలంలో ఇతరులకు అప్పుగా డబ్బు ఇవ్వడం మానుకోండి. అలాగే మీ ప్రేమ వ్యవహారాల వల్ల మానసిక ప్రశాంతత దెబ్బతినే ఆస్కారం ఉంది, కాబట్టి సంయమనం పాటించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
