Latest Updates
-
చపాతీ పిండిలో ఈ రెండు కలిపి చూడండి.. కూర లేకపోయినా కడుపునిండా తినేస్తారు! -
చూస్తుంటేనే నోరూరిపోయే డబుల్ లేయర్ చాక్లెట్ బర్ఫీ.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా! -
నూనెలో డీప్ ఫ్రై లేకుండానే కరకరలాడే మసాలా పల్లీలు..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
మటన్ గిల్లీ బిర్యానీ..వాసనకి పక్కింటోళ్లు కూడా ప్లేట్ పట్టుకుని పరుగెట్టుకొస్తారు! -
ప్రతి రాత్రి సోంపు నీరు తాగుతున్నారా? నెల రోజుల్లో శరీరంలో జరిగే అద్భుత మార్పులివే! -
బియ్యం, మినప్పప్పు లేకుండానే అటుకులతో అప్పటికప్పుడు క్రిస్పీ మసాలా దోసె..అబ్బబ్బబ్బా అనాల్సిందే! -
చలికాలంలో రోజూ ఒక బెల్లం ముక్క తింటే ఏమవుతుంది? రోజుకు ఎంత, ఎలా తినాలో తెలుసా? -
బాలల దినోత్సవం స్పెషల్: ఓవెన్ లేకపోయినా పర్లేదు.. స్టవ్ మీదనే క్రిస్పీగా వేరుశెనగ బిస్కెట్లు చేసుకోండిలా! -
పాస్ వర్డ్ లో కామా పెడితే ఎవ్వరూ హ్యాక్ చేయలేరా? వైరల్ టెక్ ట్రిక్ వెనుక వాస్తవం ఇదే! -
కారంగా, కమ్మగా ఉండే కరివేపాకు చికెన్ రోస్ట్.. ఈ సీక్రెట్ మసాలాతో రుచి డబుల్!
డయాబెటిస్ లక్షణాలు లేకపోయినా ప్రమాదమే! షుగర్ వ్యాధిని ముందే గుర్తించడం ఎలా?
భారతదేశంలో షుగర్ వ్యాధి(డయాబెటిస్) నేడు ప్రతి ఇంటినీ కలవరపెడుతున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. షుగర్ వ్యాధిని నివారించడానికి, దాని ప్రమాదాన్ని తగ్గించడానికి ఉన్న అత్యంత ప్రభావవంతమైన మార్గం, వ్యాధిని వీలైనంత ముందుగానే గుర్తించడమేనని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సంకేతాలు బయటపడే వరకు వేచి చూడకుండా, క్రమం తప్పకుండా మీ రక్తంలో షుగర్ లెవల్స్ ను పరీక్షించుకోవడం, మీ నడుము సైజును ఎప్పటికప్పుడు గమనించుకోవడం ఎంతో ముఖ్యం.
లక్షణాలు లేకపోయినా లోలోపల ముప్పు
టైప్ 2 మధుమేహం ఎటువంటి బాహ్య లక్షణాలు లేకుండానే ఏళ్ల తరబడి శరీరంలో నిశ్శబ్దంగా కొనసాగగలదు. రక్తంలో షుగర్ లెవల్స్ ప్రమాదకర దశకు చేరుకున్నప్పుడు మాత్రమే చాలామంది తమ పరిస్థితిని గుర్తిస్తారు. అప్పటికే ఆ అధిక చక్కెర లోలోపల రక్తనాళాలు, నరాలు, మూత్రపిండాలు, కళ్ళ వంటి కీలక అవయవాలను దెబ్బతీస్తుంది.

డాక్టర్ల ప్రకారం..లక్షణాలు బయటపడే వరకు వేచి ఉండకూడదు. ఎవరైనా అధిక దాహం లేదా అలసట గురించి ఫిర్యాదు చేసే సమయానికే, శరీరంలో జరగాల్సిన నష్టం మొదలై ఉండవచ్చు. అందుకే 30 ఏళ్లు పైబడిన ప్రతిఒక్కరూ ఏడాదికొకసారి ఫాస్టింగ్ షుగర్, HbA1c పరీక్షలను చేయించుకోవాలి. కుటుంబ చరిత్ర, అధిక నడుము చుట్టుకొలత, లేదా ఎక్కువసేపు కూర్చుని పనిచేసే డెస్క్ జాబ్ ఉన్నవారైతే 30 ఏళ్ల లోపు వారైనా సరే ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి.
పురుషులు విస్మరించకూడని ముఖ్య సంకేతాలు
దీర్ఘకాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల నరాలు, రక్తనాళాలు దెబ్బతింటాయని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల పురుషులలో అంగస్తంభన లోపం, తక్కువ టెస్టోస్టెరాన్ స్థాయిలు వంటి సమస్యలు తలెత్తవచ్చు. కానీ చాలా మంది పురుషులు సంకోచంతో వీటి గురించి బహిరంగంగా చర్చించడానికి ఇష్టపడరు. ఫలితంగా వ్యాధి నిర్ధారణ, ట్రీట్మెంట్ ఆలస్యమై ఆరోగ్య పరిస్థితి మరింత జటిలమవుతుంది.

మహిళల సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం
షుగర్.. మహిళల సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ దెబ్బతీస్తోంది. సంతానలేమితో బాధపడే ఎన్నో జంటలలో మధుమేహం వంటి అంతర్లీన సమస్యలు ఉంటున్నాయని డాక్టర్లు చెబుతున్నారు అదుపులో లేని రక్త చక్కెర స్థాయిలు అండ విడుదలను ప్రభావితం చేసి, గర్భస్రావం, గర్భధారణ సమయంలో జెస్టేషనల్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతాయి. నేడు యువతులలోనూ పిసిఒఎస్ (PCOS) కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయని, ఇది భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ముప్పును పెంచుతుందని చెబుతున్నారు.
అసలైన రక్షణ
మధుమేహాన్ని ఎదుర్కోవడానికి కేవలం మందులపై ఆధారపడటం ఏమాత్రం సరిపోదని డాక్టర్లు సూచిస్తున్నారు. మనం రోజువారీ అలవాట్లను మెరుగుపరుచుకోవడం కూడా అంతే అవసరం. అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం, గంటల తరబడి కూర్చోవడం, స్క్రీన్ కు అధిక సమయం కేటాయించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి మధుమేహం వచ్చే ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన అలవాట్లు, ముందస్తు పరీక్షలతో మధుమేహం ముప్పును సులభంగా అడ్డుకోవచ్చు
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
