Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఈ రాశులకు చెందిన వారు ప్రపంచాన్ని ఏలుతారు..!
జ్యోతిష్య శాస్త్రం మొత్తం శాస్త్రీయతపై ఆధారపడి వున్నది. ఆధునిక పరిఘ్నానం మొదలుకాకముందే సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం గురించి జ్యోతిష్యం చెప్పింది. అలాగే వాతావరణం, ఆకాశంలో గ్రహాలకు సంబంధించిన అనేవ విషయాలను జ్యోతిష్యం మనకు చెబుతూ వస్తోంది. ప్రపంచాన్ని ఎవరు ఏలతారనే విషయాన్ని కూడా జ్యోతిష్యం ముందుగానే చెప్పేస్తోంది. కొన్ని రాశులకు చెందిన వారికే ప్రపంచాన్ని ఏలే సామర్ద్యం వుంటుంది.
కొంతమందికి పుట్టుకతోనే నాయకత్వ లక్షనాలు వుంటాయ్. ఈ విషయాన్ని మనలో చాలా మందే గమనించి వుంటారు. వారికి ఆ లక్షణాలు ఎవరూ నేర్పలేదు. అవి వారి జాతక చక్రంలో వున్నవి. సమస్య వచ్చినప్పుడు లేదా అవసరం పడినప్పుడు వారు అద్భుతమైన నాయకత్వ లక్షణాలను ప్రదర్శిస్తారు. అదే వారిని తిరుగులేని నాయకుడిగా చేస్తుంది. తమ సామర్ధ్యమేంటో తెలియని వారికి జ్యోతిష్యం దోహదపడుతుంది. జ్యోతిష్యాన్ని అనుసరిస్తే నాయకుత్వ లక్షణాలు కలిగిన రాశుల వారు ప్రపంచాన్ని ఏలే అవకాశముంది. అయితే వాళ్లు ఏ రాశికి చెందినవారు. వారి లక్షనాలు ఎలా వుంటాయ్. మొత్తం 12 రాశులలో ఎన్ని రాశులకు ప్రపంచాన్ని ఏలే శక్తి వుంది.

మేషరాశి
ఇతరుల సమస్యలను మేషరాశికి చెందిన వారు బాగా అర్ధం చేసుకోగలరు. దీని కోసం వారు ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఎంతమందినైనా సరే చిటికెలో ఆకట్టుకునే శక్తిని కూడా కలిగి వుంటారు. వీరిని తక్కువ అంచనా వేస్తే పప్పులో కాలు వేసినట్లే. వారి గుండెల్లో, నరనరాల్లో పాలించాలనే తపన, శాసించాలనే కాంక్ష వుంటుంది. దీనిని సరిగ్గా గుర్తించి అనుసరిస్తే పాలకులు మాత్రమే కాదు ప్రపంచాన్ని ఏలే స్థాయికి ఎదుగుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
వృశభం
ఈ రాశికి చెందిన వారు చాలా చతురతను కలిగి వుంటారు. ఏదైనా సరే ఒక ప్రణాలిక ప్రకారం పూర్తిచేయాలని అనుకుంటారు. జీవితంలో ఎదురైన ప్రధాన సంఘటనలను చాకచక్యంగా పరిష్కిరించుకుంటారు. ప్రజలను ఎలా ప్రభావితం చేయాలనే ఆలోచన వీరికి వెన్నతో పెట్టిన విద్యగా భావించవచ్చు. వారికి అనుకున్నది లభించాలి. దాన్ని దక్కించుకునేవరకు విశ్రమించరు.
సింహరాశి
అన్ని రాశుల్లోకి నాయకుడయ్యే మొదటి స్థానం సింహరాశివారికే వుంటుందని పండితులు సైతం ఘంటాపధంగా చెబుతున్నారు. సింహరాశి వారు చాలా దృఢంగా, నిజయితీగా, దయగా ప్రేమపూర్వకంగా వుంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎప్పుడూ ఎదుటివారికి సాయం చేయాలనే లక్షణం కలిగి వుంటారు. ప్రపంచాన్ని శాసించే ఏకైక శక్తి సింహరాశి వారికే వుంటుంది.
కన్య రాశి
కన్య రాశికి చెందిన వారికి పుట్టుకతోనే నాయకులుగా అనిపిస్తారు. ఇతరులను చాలా సులభంగా ప్రభావితం చేయగల శక్తి వీరికి వుంటుంది. ఏ సమస్యనైనా దాని లోతుపాతులను గమనించి పరిష్కరించే నైపుణ్యాన్ని కలిగి వుంటారు. విలువలు వీరికి చాలా ముఖ్యం. వీరి ఏర్పరుచుకున్న హద్దుల్లోనే వీరు వుంటారు.
వృశ్చికం
వృశ్చికం వారికి కష్టపడే స్వభాకం ఎక్కువగా వుంటుంది. తాము ఏర్పరుచుకున్న పరిధిలోనే, నియాలకు లోబడే వారు జీవిస్తూ వుంటారు. ఇలా వుండడమే కాకుండా, వారి జీవితం తమ చుట్టూ వున్నవారికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. ఎంతో మంది ఈ రాశికి చెందిన వారిని స్పూర్తిగా తీసుకొని ఎన్నో విజయాలు సాధిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications