షుగర్ పేషెంట్లు తప్పక తినాల్సిన కూరగాయలు ఇవే..ఎంత మోతాదులో తినాలంటే..

ప్రపంచంలోనే ఎక్కువమంది షుగర్ పేషెంట్లు మనదేశంలోనే ఉన్నారు. దాదాపు ప్రతి ఇంట్లోనూ షుగర్ సమస్య ఉన్నవారు కనిపిస్తారు. అయితే షుగర్ వ్యాధి అనగానే ఏం తినకూడదో చెబుతారు కానీ, ఏ కూరగాయలు ఎంత మోతాదులో తినాలో చాలామందికి తెలియదు.వైద్య నిపుణుల ప్రకారం రక్తంలో చక్కెరను నియంత్రించే కొన్ని కూరగాయలు, వాటిని తినాల్సిన విధానాన్ని ఇక్కడ చూడండి.

కాకరకాయ
దీనిలోని చారంటిన్, వైసిన్, పాలిపెప్టైడ్-పి ఇన్సులిన్‌ లా పనిచేసి గ్లూకోజ్‌ ను నియంత్రిస్తాయి. చేదు తగ్గడానికి ముక్కలకు ఉప్పు పట్టించి 20-30 నిమిషాలు ఉంచి కడిగి, వారానికి 2-3 సార్లు వేపుడుగా తినాలి. బెల్లం కలపడం, చిప్స్‌ లా వేయించడం వద్దు.

Best Vegetables to Control Diabetes Naturally

బెండకాయ
ఇందులోని కరిగే పీచు, మ్యూసిలేజ్ కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను, గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తాయి. నానబెట్టిన నీరు తాగడం కంటే, వారానికి మూడుసార్లు ఒక కప్పు తక్కువ నూనెతో వండిన బెండకాయ కూర తినడం శాస్త్రీయంగా బెటర్.

మునగకాయ
క్లోరోజెనిక్ ఆమ్లం, ఐరన్, కాల్షియం, ప్రోటీన్ సమృద్ధిగా ఉండే మునగ భోజనం తర్వాత షుగర్ పెరగకుండా చూస్తుంది. కొబ్బరికి బదులు పప్పుతో కలిపి వారానికి మూడుసార్లు అర నుండి ఒక కప్పు వరకు తినవచ్చు.

అరటి పువ్వు
అధిక పీచు ఉండటంతో జీర్ణక్రియ మెరుగుపడి, భోజనం తర్వాత చక్కెర వేగంగా పెరగదు. వారానికి రెండుసార్లు ఒక కప్పు అరటి పువ్వు వేపుడు లేదా పప్పుతో వండిన కూరను ఆహారంలో చేర్చుకోండి.

అరటి కాండం
తక్కువ కేలరీలు, అధిక నీరు, పీచు కలిగి ఉండి కడుపు నిండిన భావనను ఇస్తుంది, అతిగా తినడాన్ని నివారిస్తుంది. రసం కంటే వారానికి రెండుసార్లు కప్పు ఉడికించిన కాండం తినడం మంచిది.

చలికాలంలో అందరూ తప్పక తినాల్సిన లడ్డు ఇదే..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..చలికాలంలో అందరూ తప్పక తినాల్సిన లడ్డు ఇదే..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా..

బీన్స్
పీచు, మొక్కల ప్రోటీన్ భోజనం యొక్క గ్లైసెమిక్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. బీన్స్ లేదా కాయధాన్యాలను వారానికి మూడుసార్లు ఎయిర్ ఫ్రైయర్‌ లో లేదా తక్కువ నూనెతో వేయించి ఒక కప్పు తీసుకోవాలి.

మెంతికూర
దీనిలోని గెలాక్టోమన్నన్ అనే కరిగే పీచు ప్రేగులలో గ్లూకోజ్ శోషణను నెమ్మదిస్తుంది. వారానికి రెండుసార్లు ఒక కప్పు మెంతి పప్పును పాలకూరతో కలిపి తింటే అద్భుతమైన పోషకాలు అందుతాయి.

వంకాయ
దీని ఊదా తొక్కలోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. తక్కువ కేలరీలు ఉన్నప్పటికీ ఇది నూనె ఎక్కువ పీల్చుకుంటుంది, కాబట్టి తక్కువ నూనెతో వండిన కప్పు వంకాయను వారానికి రెండుసార్లు తీసుకోవాలి.

Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.

Story first published: Saturday, November 28, 2026, 11:42 [IST]
Desktop Bottom Promotion