Latest Updates
-
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.!
అవాంచిత రోమాలను తొలగించుకోవడానికి పచ్చిబొప్పాయ ప్యాక్
శరీరంలో కొన్ని ప్రదేశాల్లో ముఖ్యంగా పెదాల మీద, గెడ్డం, కాళ్లు, చేతుల మీద సన్న వెంట్రుకలతో ఇబ్బంది కరంగా ఉంటుంది. అవాంచిత రోమాలను నివారించడం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే అవాంఛిత రోమాలాను తొలగించుకోవడానికి ప్రతి నెలా వాక్సింగ్ లేదా షేవింగ్ చేసుకోవడం అంటే కొంచెం గజిబిజిగా మరియు కష్టంగా ఉంటుంది. అలా జరకుండా చాలా సింపుల్ గా నేచురల్ పద్దతిలో అవాంచిత రోమాలను నివారించుకోవడం చాలా సులభం. అందుకు ఒక బ్యూటిఫుల్ నేచురల్ రెమెడీ మనకు అందుబాటులో ఉన్నది. అదేంటంటే, పచ్చిబొప్పాయి.
పచ్చిబొప్పాయిలో పెపిన్ అనే ఎంజైమ్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది, హెయిర్ ఫోలీసెల్స్ ను బలహీనపరచడంతో పాటు, అవాంఛితరోమాలను తొలగించి, తిరిగి పెరగకుండా నివారిస్తుంది. సాధారణంగా అవాంఛిత రోమాలను నివారించే కొన్ని క్రీమ్స్ లో ఉపయోగించే పెపిన్ కంటే పచ్చిబొప్పాయిలో పెపిన్ అధికంగా ఉండటం వల్ల ఇది నేచురల్ గానే చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, అవాంఛిత రోమాలను నివారిస్తుంది. అవాంఛిత రోమాలను నివారించడం కోసం రెండు పద్దతులను ఈ క్రింది విధంగా మీకోసం అందిస్తున్నాము! READ: బొప్పాయి జ్యూస్: వండర్ ఫుల్ బెనిఫిట్స్

పచ్చిబొప్పాయి మరియు పసుపుతో ప్యాక్: పచ్చిబొప్పాయిలో ఉండే పెపిన్ మాత్రమే కాకుండా, పసుపులో ఉండే, యాంటీ సెప్టిక్ మరియు యాంటీబ్యాక్టీరియల్ గుణాలు అవాంఛిత రోమాలను తొలగించడంతో పాటు, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ను సోకకుండా సహాయపడుతాయి.
అందుకు మీరు చేయాల్సింది: పచ్చిబొప్పాయి ముక్కలను కొద్దిగా తీసుకొని(మీ అవసరాన్ని బట్టి, బొప్పాయిని ఎక్కువ, తక్కువ తీసుకోవచ్చు)మెత్తగా పేస్ట్ చేసి, అందులో కొద్దిగా పసుపు మిక్స్ చేసి అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది డ్రై అయ్యే వరకూ ఉండి తర్వాత చేత్తో బాగా మర్దన లేదా రుద్దడం వల్ల హెయిర్ తొలగిపోతుంది. ఇలా వారానికొకసారి రెగ్యులర్ గా చేడయం వల్ల అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించుకోవచ్చు.

బొప్పాయి, శెనగపిండి, పసుపు మరియు కలబంద: ఈ అన్ని పదార్థాల యొక్క కలయిక అవాంఛిత రోమాలను తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా శెనగపిండి, పసుపు, కలబంద, చర్మాన్ని సున్నితంగా మరియు కాంతివంతంగా ఆరోగ్యకరమైన చర్మం అందివ్వడానికి సహాయపడుతుంది.
ఎలా తయారుచేసుకోవాలి: పచ్చిబొప్పాయి ముక్కలు కొద్దిగా తీసుకొని మెత్తగా పేస్ట్ చేసి, అందులో శెనగపిండి, పసుపు, కలబంద వేసి బాగా మిక్స్ చేసి అవాంఛిత రోమాలున్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత అవాంఛిత రోమాలు పెరిగే వ్యతిరేక దిశలో స్ర్కబ్ చేసి తర్వాత శుభ్రం చేసుకోవడం వల్ల అవాంఛిత రోమాలు తొలగిపోతాయి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. READ:పచ్చి బొప్పాయలోని ఆరోగ్యప్రయోజనాలు

హెచ్చరిక: ఈ పదార్థాలతో ప్యాక్ వేసుకోవడం వల్ల ఎటువంటి స్కిన్ అలర్జీని కలగించవని గుర్తుంచుకోవాలి. ఈ నేచురల్ రెమెడీస్ తో రెగ్యురల్ గా ప్యాక్ వేసుకోవచ్చు. అయితే ప్యాక్ వేసుకొన్న వెంటనే ఫలితం ఆశించకూడదు. రెగ్యులర్ గా కొన్ని సార్లు ప్రయత్నించిన తర్వాత మీరు గమనించినట్లైతే మీకు ఆశ్చర్యం కలగక మానదు. ప్రతి వారం వీటిని ప్రయత్నించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు...గెట్ రెడీ...



Click it and Unblock the Notifications
