స్కిన్ మరియు హెయిర్ కు కాఫీతో ఆశ్చర్యం కలిగించే బెనిఫిట్స్...

సహజంగా నూటికి 90శాతం మంది దినచర్యను కాఫీ లేదా టీలతోనే ప్రారంభిస్తారు . ఉదయం నిద్రలేవగానే కొంత మందికి కాఫీ త్రాగందే దినచర్య ముందుకు సాగదు. ఇక ఆరోజంతా ఏదో కోల్పోయినట్లు ఫీలవుతుంటారు . కాఫీతో అనేక ప్రయోజనాలున్నాయి. అంతే కాదు మోతాదుకు మించితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాదు, బ్యూటీ బెనిఫిట్స్ కూడా గ్రేట్ గా ఉన్నాయి.

కాఫీలో ఉండే కెఫిన్ చర్మం మరియు జుట్టుకు మంచి ప్రయోజనాలను అందిస్తుంది . ఇది స్కిన్ రెడ్ నెస్, సెల్యులైట్ ను తగ్గిస్తుంది. ఇంకా కళ్ళు ఉబ్బను కూడా తగ్గిస్తుంది.

రోజుకు 2 కప్పుల షుగర్ లెస్ బ్లాక్ కాఫీ తాగడంతో పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్..!

కెఫిన్ ను స్కిన్ కేర్ మరియు హెయిర్ కేలో భాగంగా ఉపయోగిస్తున్నారు. ఇది స్కిన్ కండీషన్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖంను బ్రైట్ గా మార్చడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . ఇంకా ఇది హెయిర్ కలర్ ను నేచురల్ గా పెంచుతుంది . కాఫీలోని నురుగ జుట్టు చిక్కుపడకుండా నివారిస్తుంది . ఇంకా దీన్ని తలలో తెల్ల జుట్టు కనబడకుండా నేచురల్ డైగా ఉపయోగించుకోవచ్చు.

ఒక కప్పు కాఫీతో ఆరోగ్యానికి ఆశ్చర్యం కలిగే లాభాలు

అంతే కాదు, ఇది జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. కాఫీని స్కిన్ కేర్ లో భాగంగా చేసుకోవడం వల్ల అందమైన చర్మం మరియు అద్భుతమైన జుట్టును పొందవచ్చు. చర్మం మరియు జుట్టుకు సంబంధించిన ప్రయోజనాలు కాఫీలో చెప్పలేనన్ని ఉన్నాయి. మరి ఆ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ మనిపించాల్సిందే...

డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది:

డార్క్ సర్కిల్స్ ను నివారిస్తుంది:

కళ్ళ క్రింద డార్క్ సర్కిల్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. చాలా ఎఫెక్టిగ్ గా కళ్ళ క్రింద నల్లటి వలయాలు తొలగిపోతాయి . ఇంకా ఇది కళ్లను విశ్రాంతి పరుస్తుంది . కళ్ళ ఉబ్బు నుండి ఉపశమనం కలిగిస్తుంది . కాఫీ పౌడర్లో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేసుకోవాలి. కళ్ళ క్రింది అప్లై చేసి కొద్ది సమయం తర్వాత శుభ్రం చేసుకోవాలి.

ఎక్స్ఫోయేటింగ్ స్ర్కబ్బింగ్:

ఎక్స్ఫోయేటింగ్ స్ర్కబ్బింగ్:

కాఫీ ఒక అద్భుతమైన స్క్రబ్బర్ గా పనిచేస్తుంది. చర్మంలోని సెల్యులైట్ ను తొలగించి చర్మాన్ని కాంతివంతంగా క్లియర్ కంప్లెక్షన్ అందిస్తుంది . కొద్దిగా కాఫీ పౌడర్ తీసుకొని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ఫేస్ స్ర్కబ్బర్ గా ఉపయోగించాలి.

చర్మంలో ఎక్సెస్ ఆయిల్ మరియు బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

చర్మంలో ఎక్సెస్ ఆయిల్ మరియు బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది:

ముక్కు, బుగ్గలు, ఫోర్ హెడ్ మీద బ్లాక్ హెడ్స్ ను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా ఇది చర్మంలో ఎక్సెస్ ఆయిల్ మరియు చర్మం రంద్రాల్లో చేరిన మురికిని తొలగించడానికి సహాయపడుతుంది.

స్కిన్ వైటనింగ్:

స్కిన్ వైటనింగ్:

కాఫీ కూడా స్కిన్ వైటనింగ్ ఏజెంట్ . దీన్ని చర్మం బ్రైట్ గా మార్చడానికి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . ఇది బ్లడ్ సర్క్యులేషన్ ను మెరుగుపరుస్తుంది. చర్మంలో సెల్యులైట్ ను తొలగిస్తుంది. ఇది చర్మంను తిరిగి కాంతి పొందేలా చేసి బ్రైట్ గా కనబడేందుకు సహాయపడుతుంది.

జుట్టు అందంగా, పెరిగేందుకు సహాయపడుతుంది:

జుట్టు అందంగా, పెరిగేందుకు సహాయపడుతుంది:

కాఫీ జుట్టును అందంగా..మెరిపిస్తుంది. కాఫీ బ్రూ జుట్టును చిక్కుబడకుండా ముడులు లేకుండా సహాయపడుతుంది . జుట్టుకు మంచి షైనింగ్ ను అందిస్తుంది. చుండ్రు మరియు హెయిర్ ఫాల్ నివారిస్తుంది.

హెయిర్ కలర్:

హెయిర్ కలర్:

కాఫీ మీ జుట్టుకు డీప్ గా కలరింగ్ అందిస్తుంది . ఇది నేచురల్ హెయిర్ డై గా పనిచేస్తుంది. కాఫీని హెన్నా పౌడర్ తో మిక్స్ చేసి , దీన్ని జుట్టుకు అప్లై చేయాలి . ఒక గంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి. జుట్టుకు నేచురల్ గానే కలర్ అందుతుంది.

Story first published: Monday, February 29, 2016, 16:03 [IST]
Desktop Bottom Promotion