Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
వేప నూనెలోని సొగసు చిట్కాలు తెలుసా ?
వేప అనగానే చేదుగా ఉంటుందని చాలా మంది ఇష్టపడరు. కానీ.. చేసే మేలు అంతా ఇంతా కాదు. ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా చాలా పవర్ ఫుల్ గా మనిచేస్తుంది. జుట్టు సంరక్షణలో చక్కగా పనిచేసే వేప.. మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్ నివారించడంలోనూ.. చక్కగా ఉపయోగపడుతుంది.
జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు
అయితే వేపాకులను చాలామంది ఉపయోగిస్తూ ఉంటారు. కానీ.. వేప నూనెను ఉపయోగించే పద్ధతులు కూడా చాలా ఉన్నాయి. చర్మ సమస్యలకు, జుట్టు సంరక్షణకు వేప నూనెను ఉపయోగిస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. వేప నూనె మార్కెట్ లో కూడా అందుబాటులో ఉంటుంది. వేప నూనె సొగసు, సోయగానికి ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..

ఏజింగ్
వేప నూనె మీ వయసు ఛాయలు కనిపించకుండా.. యంగ్ లుక్ అందిస్తుంది. వేప నూనెను ముఖానికి తరచుగా అప్లై చేస్తూ ఉంటే... ముడతలు తగ్గిపోతాయి.

జుట్టు పెరుగుదలకు
వేపనూనె జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. వేప నూనెతో అప్పుడప్పుడు తలకు మసాజ్ చేస్తే జుట్టు బలంగా పెరుగుతుంది. లేదా కాస్త వేడిచేసి మసాజ్ చేసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

యాక్నె
వేపనూనెను ఫేస్ మాస్క్ లా ఉపయోగిస్తే.. యాక్నె సమస్య తగ్గిపోతుంది. ఇది బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

హెయిర్ లాస్
జుట్టు రాలడాన్ని, చిట్లిపోవడాన్ని వేపనూనె చక్కగా పరిష్కరిస్తుంది. వేప నూనెను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు రాసుకుంటూ ఉంటే.. ఈ సమస్య తగ్గిపోతుంది.

బరువు తగ్గడానికి
వేప ఆయిల్ బరువు తగ్గడానికి కూడా చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. అయితే దాని రుచి కాస్త చేదుగా ఉంటుంది కాబట్టి.. కష్టమైనా.. తీసుకుంటే.. బరువు తగ్గవచ్చు.

పొడి జుట్టికి
పొడిబారి, రఫ్ గా మారిన జుట్టుని ట్రీట్ చేయడంలో వేప నూనె చాలా బాగా పనిచేస్తుంది. షాంపూలో కొన్ని చుక్కల వేప నూనె కలిపి.. అప్లై చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది.

డ్రై స్కిన్
వేప నూనెతో చర్మానికి మసాజ్ చేస్తే.. పొడిబారిన చర్మం స్మూత్ గా తయారవుతుంది.

చుండ్రు నివారణకు
వేప నూనెలో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి చుండ్రుని నివారించడానికి అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని తలకు మసాజ్ చేస్తే.. ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గి.. చుండ్రు తగ్గిపోతుంది.



Click it and Unblock the Notifications
