మేఘన చికెన్ బిర్యానీ.. అస్సలు మిస్ అవ్వకండి!

Posted By:

బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? కానీ మీరు ఎప్పుడూ తినే రెగ్యులర్ బిర్యానీలకు భిన్నంగా, ఒక సరికొత్త రుచిని ఆస్వాదించాలనుకుంటే మేఘన స్టైల్ బిర్యానీని తప్పక ప్రయత్నించాల్సిందే. బెంగళూరుకు చెందిన మేఘన ఫుడ్స్ అనే ఫేమస్ రెస్టారెంట్ చేసే చికెన్ బిర్యానీకి ఫ్యాన్స్ భారీగానే ఉంటారు.

కరకరలాడే జ్యూసీ ఫ్రైడ్ చికెన్ మసాలా, సువాసనభరితమైన బాస్మతి అన్నం, నెయ్యి, కుంకుమపువ్వు పాల మేళవింపుతో ఈ బిర్యానీ అద్భుతంగా ఉంటుంది. దీని ఘుమఘుమలు ఇల్లంతా నిండిపోయి నోరూరిస్తాయి. దీని రుచికి అందరూ ఫిదా అవ్వాల్సిందే. బిర్యానీ ప్రియుల మనసు దోచుకునే ఈ స్పెషల్ రెసిపీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Unique Aromatic Meghana Style Chicken Biryani Recipe in Telugu A Must Try for Biryani Lovers

కావలసిన పదార్థాలు:

చికెన్ ఫ్రై కోసం:

-బోన్‌ లెస్ చికెన్,
-పెరుగు
-అల్లం వెల్లుల్లి పేస్ట్
-రుచికి సరిపడా ఉప్పు
-మసాలా పొడులు
-కార్న్‌ ఫ్లోర్ లేదా బియ్యప్పిండి
-వేయించడానికి సరిపడా నూనె

రైస్ కోసం:

-నానబెట్టిన బాస్మతి బియ్యం
-మసాలా దినుసులు
-పుదీనా
-కొత్తిమీర
-ఉప్పు

మసాలా, దమ్ కోసం:

-తరిగిన ఉల్లిపాయలు
-పచ్చిమిర్చి
-టమాటో పేస్ట్
-జీలకర్ర
-సోంపు
-చికెన్ మసాలా
-పెరుగు
-నెయ్యి
-కుంకుమపువ్వు పాలు

బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్‌ కు బెస్ట్..ఇంట్లోనే హై ప్రోటీన్ చపాతీ చేసుకోండిలా..

తయారీ విధానం

-ముందుగా బోన్‌ లెస్ చికెన్ ముక్కలలో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, మసాలా పొడులు వేసి బాగా కలపాలి. మసాలాలు ముక్కలకు పట్టేలా 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

-అరగంట తర్వాత చికెన్ ‌కు కొద్దిగా కార్న్‌ఫ్లోర్ లేదా బియ్యప్పిండి పట్టించి, వేడి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. చికెన్ లోపల మెత్తగా, జ్యూసీగా ఉండి చక్కగా ఉడికే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

మరోవైపు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని మరిగే నీటిలో వేసి, అందులో హోల్ స్పైసెస్(మసాలా దినుసులు), పుదీనా, కొత్తిమీర, ఉప్పు జతచేసి సగం ఉడికే వరకు ఉడికించి, నీటిని పూర్తిగా వడకట్టాలి.

-చికెన్ వేయించగా మిగిలిన నూనెను కడాయిలో తీసుకుని, మసాలా దినుసులు, జీలకర్ర, సోంపు వేయించాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చేవరకు వేపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పేస్ట్, మసాలా పొడులు, చికెన్ మసాలా, పెరుగు వేసి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.

-సిద్ధమైన ఈ చిక్కని గ్రేవీ నుండి కొంత భాగాన్ని వడ్డించడానికి ఒక గిన్నెలోకి పక్కన తీసి పెట్టుకోవాలి. మిగిలిన మసాలాలో వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను వేసి, మసాలా అంతా పట్టేలా బాగా కలపాలి.

-ఒక మందపాటి బిర్యానీ గిన్నెలో పక్కన పెట్టిన గ్రేవీ, చికెన్ మసాలా,సగం ఉడికించిన అన్నాన్ని పొరలు పొరలుగా అందంగా అమర్చాలి. పైనుంచి నెయ్యి, కుంకుమపువ్వు పాలు, తరిగిన పుదీనా, కొత్తిమీర చల్లాలి.

-గిన్నెపై మూత గట్టిగా పెట్టి, ఆవిరి బయటకు పోకుండా తక్కువ మంట మీద సరిగ్గా 15 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి.

-అంతే ఎంతో ఘుమఘుమలాడే, రుచికరమైన మేఘన స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ. దీనిని వేడివేడిగా, పక్కన పెట్టిన మసాలా గ్రేవీ, చల్లని రైతాతో వడ్డిస్తే ఆ రుచిని ఎప్పటికీ మర్చిపోలేరు.

[ of 5 - Users]
Story first published: Tuesday, November 17, 2026, 19:17 [IST]
Desktop Bottom Promotion