Latest Updates
-
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు!
ఎండల దెబ్బకి కుప్పలుగా రాలుతున్న కురులు.. మజ్జిగతో ఇట్టే పరిష్కారం.!
వేసవి వచ్చిందంటే చాలు బాడీ డీహైడ్రేషన్‌కి గురి కావడం, చర్మం పొడిబారడం జరుగుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం ఈ కాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్య. జుట్టు సంరక్షణ కోసం రసాయనాలు కలిసిన పౌడర్లతో రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కానీ ఇది ప్రమాదకరమని చాలా మందికి తెలియదు. అయితే మీ జుట్టు కుదుళ్లు ఎప్పుడూ ఆరోగ్యకరంగా, మృదువుగా, రాలిపోకుండా ఉండాలంటే ఇంట్లోనే సులువైన పరిష్కారం ఉంది. అదెలా అనుకుంటున్నారా.?

మజ్జిగలో పోషకాలు పుష్కలం
వేసవిలో బయటకు వెళ్లినప్పుడు జుట్టుపై వేడి ప్రభావం, కాలుష్యం కారణంగా తల చర్మం ఆరోగ్యంపై ప్రభావం చూపి రాలిపోవడం ప్రారంభం అవుతుంది. అయితే ఇంట్లోనే దొరికే మజ్జిగ ద్వారా మీ జుట్టు సమస్యకి మంచి పరిష్కారం పొందవచ్చు. మజ్జిగ.. పొడిబారిన, పొలుసులుగా ఉన్న మీ తలకి సరైన పోషకాలను అందించి జుట్టు కుదుళ్లను ఆరోగ్యవంతంగా చేస్తుంది. హెయిర్ ఆరోగ్యానికి కావాల్సిన కాల్షియం, ఐరన్, విటమిన్ 12లు, ప్రొటీన్లు మజ్జిగలో పుష్కలంగా దొరకడం ద్వారా జుట్టును బలంగా చేసి రాలిపోవడం సమస్యను పరిష్కరిస్తుంది.
మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టుపై ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్‌లా పనిచేస్తుంది. అందుకే మజ్జిగతో జుట్టు కుదుళ్లకు సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా పొలుసులను, తలపై పేరుకుపోయిన మలినాలను కరిగిపోయేలా చేస్తుంది. మృత చర్మ కణాలను, నూనె జిడ్డును తొలగించి శుభ్రంగా ఉంచుతుంది. తద్వారా చిరాకు, దురద వంటివి తొలగిపోయి హాయిగా, చల్లగా అనిపిస్తుంది.

చుండ్రు సమస్య
తలపై పీహెచ్ స్థాయిలో బ్యాలెన్సింగ్‌గా లేకపోతే చుండ్రు ఏర్పడి ఇబ్బంది కలిగిస్తుంది. ఇక్కడే మజ్జిగ దివ్య ఔషధంలా పనిచేస్తుంది. ఇందులోని సహజమైన లాక్టిక్ యాసిడ్, ప్రోబయాటిక్స్ కలయిక తల చర్మంపై అద్భుతంగా పనిచేసి చుండ్రును తొలగించడంలో సహాయపడుతుంది.
చాలా మంది తలస్నానం చేసిన తర్వాత కండిషనర్లు ఉపయోగిస్తుంటారు. కానీ మజ్జిగలో ఆరోగ్యకరమైన కొవ్వులు, లిపిడ్ల ముందు కండిషనర్లు ఏ మాత్రం పోటీ పడలేవంటే నమ్మలేరు. మజ్జిగ జుట్టుకి అవసరమైన తేమని అందిస్తూ మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇందులోని యాసిడ్, పాల ప్రొటీన్లు సరైన విధానంలో పోషణని అందించడం ద్వారా మృదువైన, పట్టులాంటి జుట్టును పొందవచ్చు.
ఉపయోగించే విధానం
జుట్టుకి మజ్జిగని ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. సరైన పద్ధతిలో దీనిని అప్లై చేయడం ద్వారా కొన్ని రోజుల్లోనే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
ముందుగా ఒక కప్పు మజ్జిగ తీసుకోవాలి. అందులో ఉప్పు ఉండకూడదు. ఇందులో ఒక టీ స్పూన్ మెంతి పౌడర్‌ను వేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. మెంతులు కలుపుకోవడం ద్వారా పోషణ శక్తి మరింత మెరుగవుతుంది. ఉదయాన్నే జుట్టు తడి చేసుకుని మొదళ్ల నుంచి చివరి వరకు బాగా పట్టించి తర్వాత సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ అనంతరం ఒక 30 నిమిషాల సేపు వదిలేయాలి. ఆరిన తర్వాత జుట్టుని శుభ్రంగా కడిగి అధిక రసాయనాలు లేని షాంపూతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం ద్వారా మీ జుట్టు ఆరోగ్యకరంగా మారుతుంది.



Click it and Unblock the Notifications
