For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సున్నితమైన మసాజ్ తోనే ముఖంలో మెరుపు కళలు...

|

Facial Massage
చర్మం అందంగా.. ఆరోగ్యంగా మెరుస్తుండేందుకు బ్యూటీ పద్దతుల్లో చాలా రకాలను ప్రయత్నం చేసే ఉంటారు. అయితే ఫేషియల్ మసాజ్ అనేది చర్మ సంరక్షణలో చాలా బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వయస్సులో ఏదో ఒక చర్మ సమస్యను ఎదుర్కొని ఉంటారు. వయస్సు మీదపడినట్లు, ముడుతలు, ముఖంలో మొటిమలు, బ్లాక్ సర్కిల్స్, మొ..ఎన్నో..అలాంటి వారిలో మీరూ ఒక్కరైతే.. మీ ముఖం నిర్జీవంగా, కాంతిహీనంగా ఉందా? ముఖంలో కళ తప్పినట్లైతే మళ్లీ చర్మానికి కాంతి చేకూర్చాలని ఉందా. అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి. మీ చేతివ్రేళ్లతో మీ చర్మానికి మెరుపుకళను తీసుకురావచ్చు. కంటి పై ఎముకభాగం నుండి ముక్కు వరకు అక్కడి నుండి బుగ్గల ఎముక భాగాల వరకు మీ చేతివ్రేళ్లతో పైకి కిందకు నెమ్మదిగా మర్దనా చేయండి.ఈ విధంగా మర్దనా చేస్తూ మాయిశ్చరైజర్‌ను ముఖానికి పట్టించి మెడ కింది భాగం నుండి గడ్డం వరకు వ్రేళ్లతో మర్దనా చేయాలి. ఇలా చేయడంతో మీ ముఖం కమిలినట్లు కనిపించినా, ముఖానికి కావలసినంత ఆక్సిజన్‌ లభిస్తుంది.మీకు ముడతలు లేని చర్మం కావాలంటే...

మీరు నిద్రించేటప్పుడు ముఖం పైకి ఉండేలా నిద్రించండి. పక్కకు, బోర్లా పడుకునే వారికి ఎక్కువగా చర్మంపై ముడతలు త్వరగా ఏర్పడుతాయి. ముఖానికి మసాజ్‌తో ఎంతో మేలు దీనికోసం మీరు మసాజ్‌ సెంటర్లకు వెళ్లనక్కర్లేదు. ప్రతీరాత్రి నచ్చిన మాయిశ్చరైజర్‌తో ఐదు నిమిషాల పాటు ముఖంపై నెమ్మదిగా మర్దనా చేయండి. మసాజ్ చేయించుకున్నంత ఫలితం పొందుతారు. ఆహార అలవాట్లపై దష్టి ఉంచండి . పరిశుభ్రమైన ఆహారంతో మీ చర్మానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. మీరు తీసుకునే ఆహారంతో మీ ముఖంపై మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా కాపాడుకోవచ్చు. తరుచుగా చేపలతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల చర్మానికి మంచి పోషణ అందించవచ్చు.

సన్‌స్క్రీన్‌లు వాడటం మరింత మంచిది: కుడిచేయి వాటం ఉన్నవారు ఎక్కువగా సన్‌స్క్రీన్‌లను ఎడమవైపు పెడతారని, ఎడమ చేయివాటం వారు కుడివైపు ఎక్కువ క్రీం పూస్తారని దీంతో ముఖంపై రెండువైపులా అసమతౌల్యంగా రాయడం జరుగుతుంది. క్రీం వాడేప్పుడు రెండు వైపులా రెండు చేతులతో మార్చి మార్చి రాయడంతో ముఖమంతా సమపాళ్లలో క్రీం పడుతుందని, ఇలా రాయడమే ఉత్తమమని బ్యూటీషియన్లు అంటున్నారు.

English summary

How to Give A Facial Massage | సున్నితమైన మసాజ్ తోనే మెరుపుకళలు...

There are several methods and beauty procedures that make your skin healthy and glowing. Facial Massage is one of them that refresh your face skin. Every person suffers from vagaries of the nature like aging, wrinkle etc. People of any skin type would suffer from skin problems of specific type. It is a myth that those who have fair skin would experience aging affects early.
Story first published:Friday, September 14, 2012, 15:35 [IST]
Desktop Bottom Promotion