Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
సమ్మర్ సన్ టాన్ నివారించే బట్టర్ మిల్క్ ఫేస్ ప్యాక్
వేసవికాలం ఎండలో కాసేపు తిరిగితే చాలు చర్మం కమిలిపోయి నల్లబడు తుంది. చర్మ సంరక్షణ విషయంలో కాస్తంత నిర్లక్ష్యం చేస్తే చాలు...తిరిగి నిగారింపును పొంద టానికి చాలా సమయం పడుతుంది. వేసవిలో చర్మం ఎండతాకిడికి కమిలిపోవడం, దుమ్ముధూళి పేరుకుపోవడం, పొడిబారడం లేదంటే జిడ్డుగా తయారవడం, స్కిన్ పిగ్మెంటేషన్, సన్ బర్న్, వంటి సమస్యలెన్నో తలెత్తుతుంటాయి.
ఎక్కువ సమయం ఎండలో యూవీ కిరణాలు పడేలా ఉండటం వల్ల యూవీబి రేడియేషన్ స్కిన్ హెల్త్ మీద ప్రభావం చూపుతుంది. దాంతో ఎగ్జిమా, స్కిన్ క్యాన్సర్, మెలనోమా వంటి చర్మ సమస్యలకు గురిచేస్తుంది, . కాబట్టి, వేసవిలో ఎల్లప్పుడు మీ చర్మాన్ని హానికరమైన యూవీ రేస్ నుండి ఎండ తీవ్రత నుండి చర్మాన్ని కాపాడుకోవాలి.

అలాగని మనం నిరంతరం ఇంట్లో కూర్చోలేము కదా..? వేసవిలో బయట వెళ్ళినప్పుడు సన్ టాన్, స్కిన్ పిగ్మెంటేషన్ మరియు స్కిన్ కంప్లెక్షన్ డల్ గా మరియు డార్క్ గా మార్చుతుంది. ఈ స్కిన్ సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని సన్ స్క్రీన్ లోషన్స్ ఉపయోగిస్తుంటాము, అలాగే కొన్ని సెల్ఫ్ బ్యూటీ టిప్స్ ను అనుసరిస్తుంటాము . అయినా కూడా వేసవిలో ఎండ నుండి టాన్ ను తప్పించుకోలేరు. ఏదో ఒక రకంగా చర్మం మీద డార్క్ ప్యాచెస్ ఏర్పడుతుంటాయి.

కాబట్టి, ఇలాంటి సన్ టాన్ ను ఎఫెక్టివ్ గా నివారించుకోవడానికి బట్టర్ మిల్క్ మరియు ఓట్ మీల్ ఫేస్ ప్యాక్ గ్రేట్ గా సహాయపడుతుంది . మరి దీన్ని ఎలా తయారుచేయాలి, ఏవిధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం...
కావల్సిన పదార్థాలు: ఓట్ మీల్ -3టేబుల్ స్పూన్లు, బట్టర్ మిల్క్-1/4కప్పు, నిమ్మరసం -2టీస్పూన్లు
ఓట్ మీల్ నేచురల్ స్కిన్ ఎక్సఫ్లోయేటర్ ,. ఇది చర్మం మీద ఎఫెక్టివ్ గా పనిచేసి డెడ్ స్కిన్ సెల్స్ ను మరియు డార్క్ ప్యాచెస్ ను తొలగిస్తుంది. చర్మంలో డెడ్ స్కిన్ లేయర్ తొలగిపోతే సన్ టాన్ మరియు పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది.

అలాగే బట్టర్ మిల్క్ లో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంది ఇది స్కిన్ టైట్ చేస్తుంది. ఇంకా సన్ టాన్ మరియు పిగ్మెంటేషన్ నివారిస్తుంది. మరియు బటర్ మిల్క్ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది, యాంటీబ్యాక్టీరియల్ నేచురల్ ను కలిగి ఉండటం వల్ల స్కిన్ కంప్లెక్షన్ క్లియర్ చేస్తుంది.
నిమ్మరసంలో అసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది. ఇది నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. దాంతో సన్ టాన్ తొలగించి స్కిన్ కంప్లెక్షన్ పెంచుతుంది . స్కిన్ బ్రైట్ చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి.
పైన సూచించన పదార్థాలు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
