చర్మం మీద ఇబ్బంది కలిగించే స్ట్రెచ్ మార్క్స్ కు ఫుడ్స్ తో చెక్ ...

మన చర్మంలో మనకు తెలియకుండా అనేక మార్పులు జరుగుతుంటాయి. అలాంటి మార్పుల్లో స్ట్రెచ్ మార్క్ ఒకటి. ఈస్ట్రెచ్ మార్క్స్ శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. సాధారణంగా ఈ స్ట్రెచ్ మార్క్ చేతులు, నడుము, మోకాలు, మరియు పొట్ట , తొడల మీద ఏర్పడుతుంటాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ కు వివిద రకాల కారణాలుండవచ్చు . ఇది బరువు పెరగడం వల్ల, గర్భధారణ సమయంలో, సడెన్ గా బరువు తగ్గడం వల్ల, హెరిడిటీ వల్ల, స్ట్రెస్, మరియు శారీరకంగా మార్పులు వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.

సాధారణంగా చర్మం లోపల మూడు లేయర్లుగా ఉంటాయి అందులో ఒక ఎపిడెరమిస్, డెర్మిస్ మరియు హైపోడెర్మిస్. స్ట్రెచ్ మార్క్స్ స్కిన్ డెర్మిస్ లేయర్లో ఏర్పడుతుంటాయి. ఇది చర్మంలోపల మిడిల్ లేయర్ గా ఉంటుంది . కనెక్టివ్ టిష్యు ఫ్లెక్సిబిలిటీగా ఉన్నప్పుడు స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. స్కిన్ స్ట్రెచ్ అయినప్పుడు, చర్మం క్రిందిబాగంలో ఉన్న కొల్లాజెన్ డ్యామేజ్ అవుతుంది.

స్ట్రెచ్ మార్క్స్ నివారించుకోవడానికి వివిధ రకాల ప్రొడక్ట్స్ అందుబాటులో ఉన్నాయి . అయితే వీటికంటే నేచురల్ పదార్థాలు మరింత ఎఫెక్టివ్ గా పనిచేసి, స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తాయి. హెల్తీ అండ్ స్మూత్ స్కిన్ కోసం హెల్తీ డైట్ అవసరం అవుతుంది. అదే విధంగా, సరైన ఆహారం తీసుకోవడం వల్ల స్ట్రెచ్ మార్స్స్ క్రమంగా...ఫాస్ట్ గా తగ్గిపోతాయి. స్ట్రెచ్ మార్క్స్ ను నివారించ చర్మం కాంతివంతంగా..యంగర్ లుక్ ఇచ్చే ఆహారాలున్నాయి. ఇది ముడుతలను మరియు స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది.

మరి స్ట్రెచ్ మార్స్ ను నివారించే హెల్ఫ్ ఫుల్ ఫుడ్స్ ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

రుచికరమైన డార్క్ చాక్లెట్ హెల్తీ స్కిన్ అందివ్వడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఈ డార్క్ చాక్లెట్ లో జింక్, ఉన్నాయి. ఇవి స్కిన్ టిష్యులను బలోపేతం చేస్తుంది. మరియు చర్మాన్ని స్ట్రాంగ్ గా సాగకుండా ఉంచుతుంది . డార్క్ చాక్లెట్ లో ఉండే కోక కంటెంట్ చర్మం కాంతివంతంగా మరియు తేమగా మెరుస్తు ప్రకాశవంతంగా కనబడేలా చేస్తుంది. స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది.

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ :

స్ట్రాబెర్రీస్ లోని యాంటీఆక్సిడెంట్స్ చర్మంలోపల కొల్లాజన్ ఉత్పత్తికి సహాయపడుతుంది . దాంతో చర్మం కాంతివంతంగా మరియు స్మూత్ గా ఉంటుంది. స్ట్రాబెర్రీస్ లో ఉండే విటమిన్ సి చర్మంలో ఉండే లైన్స్ మరియు మార్క్స్ ను , స్ట్రెచ్ మార్క్స్ తో సహా నివారిస్తుంది. స్ట్రాబెర్రీలో ఉండే ఎలాచిక్ యాసిడ్ చర్మం సాగకుండా సహాయపడుతుంది.

బాదం:

బాదం:

బాదం చర్మానికి, హెయిర్ కు మరియు శరీరానికి అవసరం అయ్యే మినిరల్స్ ను పుష్కలంగా అందిస్తుంది . విటమిన్ ఇ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ చర్మపోషణకు చాలా అవసరం అవుతుంది. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.ముఖ్యంగా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవు.

ఓట్స్:

ఓట్స్:

ఓట్స్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మంలోని టాక్సిన్స్ తొలగించడానికి మరియు చర్మం అందంగా కనబడుటకు సహాయపడుతుంది. ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది, బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది. శరీరంలో ఆండ్రోజన్ హార్మోన్ లెవల్స్ ను కంట్రోల్ చేసి ముడుతలు ఏర్పడకుండి చర్మం సాగకుండా చేస్తుంది . చర్మంలో ఎలాసిటిని పెంచుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ చర్మానికి సరిపడా హైడ్రేషన్ ను అందిస్తుంది . చర్మం డ్రై కాకుండా నివారిస్తుంది. ఇది చర్మం హెల్తీగా ఉంచతుంది. మరియు స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ప్రతి రోజూ రెండు కప్పులు గ్రీన్ టీని త్రాగడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ ను నివారిస్తుంది.

గుమ్మడి విత్తనాలు:

గుమ్మడి విత్తనాలు:

జింక్ మరియు విటమిన్ ఇ చర్మంలో స్ట్రెచ్ మార్క్ ఏర్పడకుండా చేస్తుంది. కాబట్టి పప్కిన్ సీడ్స్ ను డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ నివారించుకోవచ్చు.

దానిమ్మ:

దానిమ్మ:

దానిమ్మలో ఉండే ఫాలీఫినాల్స్ స్కిన్ డ్యామేజ్ చేసే ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. మరియు చర్మంలో రోజీ కాంప్లెక్స్ ను అందిస్తుంది.

Story first published: Thursday, January 21, 2016, 8:12 [IST]
Desktop Bottom Promotion