Latest Updates
-
మెంతులు ఆరోగ్యానికి మంచిదే కాదు... ఈ వ్యాధులు ఉన్నవారికి ముప్పూ తేవచ్చు! -
నానమ్మల కాలం నాటి నల్చిన కారం..చికెన్, మటన్ కూడా పోటికి రావు..రోలు, మిక్సీ కూడా అక్కర్లేదు చేత్తోనే.. -
బాబా వంగా అంచనా..అక్టోబర్ 5వ తేదీ నుంచి ఆ 5 రాశుల వారికి రాజయోగం పక్కా! -
తిండి ఆలస్యమైందని దండన.. జొమాటో డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి.. వైరల్ వీడియో.! -
ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఉలవల కారం పొడి..ఒక్కసారి చేస్తే నెల రోజులు నిల్వ..ఇడ్లీ, వేడి అన్నంలోకి బెస్ట్ -
కోడిగుడ్లతో రొటీన్ కూరలు బోర్.. ఈ 'ఎగ్ బటర్ మసాలా' తప్పక ట్రై చేయండి! -
చంద్ర, కేతు సంయోగంతో సింహ రాశిలో గ్రహణం.. చిక్కుల్లో పడబోయే రాశులు ఇవే.! -
ఫ్రిజ్‌లో ఏ కూరగాయ ఎంత కాలం నిల్వ ఉంటుంది?.. సరైన స్టోరేజ్ పద్ధతులు ఇవే! -
ఒంట్లో రక్తం పెంచి, బలాన్ని అందించే సూపర్ ఫుడ్ 'జొన్న మెంతి పరాటా’.. ఈజీగా ఇలా చేసేయండి.! -
దానిమ్మ తింటే నిజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుతుందా.. పురుషులు తెలుసుకోవాల్సిన లాజిక్ ఇదే.!
Cannes 2023: రెడ్ కార్పెట్‌పై హొయలొలికించిన సన్నీ లియోన్.. హై స్లిట్ గౌనులో గ్లామర్ ట్రీట్
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అంగరంగ వైభవంగా సాగుతోంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సారి కూడా నటీమణులు అద్భుతమైన ఔట్‌ఫిట్లతో ఫ్యాషన్ ప్రియులను అలరిస్తున్నారు. అదిరిపోయే డ్రెస్సులో మెస్మరైజ్ చేస్తున్నారు. భారత్ నుండి ఇప్పటికే ఈషా గుప్తా, మానుషీ చిల్లర్, సారా అలీ ఖాన్, ఊర్వశి రౌటేలా, ఐశ్వర్యరాయ్ సహా చాలా మంది ప్రముఖ నటీమణులు తమ అందాలు ప్రదర్శించారు.

అదిరిపోయే లెహంగాలు, గౌనుల్లో ఎగిసిపడే అందాలను ఆరబోసి మత్తెక్కించారు. శృంగార తార సన్నీ లియోన్ కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అదరగొట్టింది.(Image: Instagram)

అందమైన మెరూన్ వెల్వెట్ గౌనులో అద్భుతంగా కేన్స్ లో అరంగేట్రం చేసిన సన్నీ లియోన్.. ఇప్పుడు అదిరిపోయే డ్రెస్సులో కనిపించి కవ్వించింది.(Image: Instagram)

హై స్లిట్ పాస్టెల్ గౌనులో అందాలు ఒలకబోసింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ పై సన్నీ పరువాల ప్రదర్శన హీటెక్కించింది.(Image: Instagram)

సన్నీ లియోన్, రాహుల్ భట్, అభిలాష్ థప్లియాల్ ప్రధాన పాత్రల్లో అనురాగ్ కశ్యప్ రూపొందించిన కెన్నెడీ చిత్రం తాజాగా ప్రీమియర్ అయింది. మిడ్ నైట్ స్క్రీనింగ్స్ విభాగంలో కెన్నెడీ చిత్రాన్ని ప్రదర్శించారు. నిందితుడు చనిపోయాడని భావించి పశ్చాత్తాపం కోరుకునే మాజీ పోలీసు అధికారి కథతో ఈ సినిమా తెరకెక్కింది.(Image: Instagram)

ఈ మూవీ కోసమే సన్నీ లియోన్, అనురాగ్ కశ్యప్, రాహుల్ భట్ రెడ్ కార్పెట్ పై నడిచారు. ఈ సందర్భంగానే సన్నీ లియోన్ హై స్లిట్ పాస్టెల్ గౌను ధరించి కనిపించింది.(Image: Instagram)
కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్.. ఫ్రాన్స్ లోని కేన్స్‌లో సంవత్సరానికి ఒకసారి జరిగే ఫిల్మ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రకాల కొత్త చిత్రాలను ఇక్కడ ప్రివ్యూ చేస్తారు.
ఈ ప్రీమియర్ షోలకు వచ్చే సెలబ్రిటీలు అద్భుతమైన ఔట్‌ఫిట్‌లతో రెడ్ కార్పెట్ పై హొయలు పోతారు. అలా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కాస్త ఫ్యాషన్ ఈవెంట్‌లా పేరు సంపాదించుకుంది. ఈ ఏడాది మే 16వ తేదీ నుండి మే 27 వరకు ఈ ఫెస్టివల్ జరుగుతుంది.



Click it and Unblock the Notifications
