Latest Updates
-
అద్దిరిపోయే రుచితో కీమా చికెన్ సల్నా.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు! -
మిగిలిపోయిన అన్నంతో అద్భుతమైన టమాటా వెల్లుల్లి రైస్..బ్యాచిలర్స్ కు పండగే పండగ -
ముల్లంగి ఆకులతో ఇలా పకోడీ చేసి చూడండి..లొట్టలేసుకుంటూ తింటారు! -
భారతదేశంలో తొలి సూర్యోదయం ఎక్కడ కనిపిస్తుందో తెలుసా? -
ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచి..హిమాచల్ ప్రదేశ్ స్పెషల్ మటర్ పనీర్ మీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
పొట్ట ఉబ్బరం, గ్యాస్ట్రిక్ నొప్పి ఉన్నప్పుడు.. ఇవి తీసుకుంటే చిటికెలో రిలీఫ్ -
రెస్టారెంట్ స్టైల్ చికెన్ వెల్లుల్లి రైస్.. తక్కువ సమయంలోనే అద్భుతమైన రుచి -
టిక్కెట్ లేకుండా ప్రయాణం..చెకింగ్ కి భయపడి డోర్ లాక్..కదులుతున్న రైలు బయట వేలాడిన టీటీఈ! -
20 నిమిషాల్లో చక్కెర, ప్రిజర్వేటివ్స్ లేని పీనట్ బటర్..ప్రోటీన్, పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన అల్పాహారం -
ఐరన్ లోపం, జుట్టు, చర్మ సమస్యలకు మేలు చేసే మునగ సూప్.. ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా!
క్యాన్సర్ ముప్పును 80 శాతం తగ్గించే ఒకే ఒక్క పండు ఇదే
క్యాన్సర్ అనే పేరు వింటినే చాలామందిలో తెలియని భయం మొదలవుతుంది. అయితే ఇప్పుడు డ్వాన్డ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉండి క్యాన్సర్ ను నయం చేయగలుగుతున్నా కూడా దీని బారిన పడొద్దు దేవుడా అని కోరుకుంటారు అందరూ.ఎందుకంటే దీని ట్రీట్మెంట్ కూడా ఒకరకమైన నరకం లాంటిదే. ప్రస్తుతం చిన్న వయస్సు పిల్లలు కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్ లో చాలా రకాలు ఉంటాయి. అయితే క్యాన్సర్ కు ముందు దశ కణాలను 80% వెనక్కి తగ్గించిన ఒకే ఒక్క పండు కిఫీ హాస్పిటల్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియోలో డాక్టర్ కరుటూరి సుబ్రమణ్యం వివరించారు. ఆయన ఏం చెప్పారో ఇక్కడ చూడండి.
మన శరీరంలో నిరంతరం ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది. ఎండ,ఒత్తిడి, మనం పీల్చే గాలి వల్ల మన డీఎన్ఏ ప్రతిక్షణం దెబ్బతింటూనే ఉంటుంది. మన శరీరం దాన్ని రిపేర్ చేసుకుంటుంది. కానీ ఒక చిన్న పొరపాటు జరిగి కణాలను అదుపు తప్పి పెరగడం మొదలయితే క్యాన్సర్ అనే మాట వినడానికి కొన్నేళ్ల ముందే లోపల ప్రమాదం మొదలవుతుంది. మనం రోజూ తినే పండ్లు మనిషి శరీర కణజాలంలో ఉన్న ఈ ప్రమాదాన్ని నిజంగా ఆపగలవా అని సైంటిస్టులు రీసెర్చ్ చేశారు. అయితే ఆ ఫలితాలు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

మొదటిది టమాటో
టమాటోను పచ్చిగా తింటే అసలైన లాభం మిస్ అవుతారు. టమాటోను ఉడికించినప్పుడు అందులో ఉండే లైకోపీన్ అనే శక్తివంతమైన రసాయనం విడుదలవుతుంది. కేవలం మూడు వారాల పాటు ఉడికించిన టమాటో గుజ్జు తిన్నవాళ్లల్లో క్యాన్సర్ కణాలు 3 రెట్లు వేగంగా వేగంగా నశించాయట.. డీఎన్ఏ డ్యామేజ్ 28 శాతం తగ్గిందట. కాబట్టి టమాటోను ఉడికించి కొద్దిగా మంచి నూనెతో కలిపి తినాలని డాక్టర్ కరటూరి సుబ్రమణ్యం తెలిపారు.
రెండోది స్ట్రాబెర్రీస్
గొంతులో క్యాన్సర్ కు ముందు దశ మార్పులు ఉన్నవారిపై 6 నెలల పాటు ఒక ప్రయోగం చేశారు సైంటిస్టులు. రోజుకి 4 కప్పుల స్ట్రాబెర్రీస్ కు సమానమైన పౌడర్ తిన్నవారిలో 80 శాతం మందికి ఆ కణాల పెరుగుదల ఆగిపోయింది. సగానికి పైగా మంది మళ్లీ రిపోర్ట్ లు పూర్తిగా నార్మల్ అయిపోయాయి.
మూడోది బ్లూబెర్రీస్
ఇవి తిన్న కేవలం ఒక్క గంటలోనే మన రక్తకణాలపై జరిగే డీఎన్ఏ దాడి 18 శాతం తగ్గిందని పరిశోధనలో తేలింది.
ఎర్ర ద్రాక్ష
పెద్ద పేగు క్యాన్సర్ లో కణాలు విపరీతంగా పెంచే ఒక స్విచ్ ఎప్పుడూ ఆన్ అయ్యే ఉంటది. కేవలం 2 వారాల పాటు రోజుకి 2 కప్పుల ఎర్ర ద్రాక్ష తిన్న 50 ఏళ్లు పైబడినవారిలో ఆ ప్రమాదకరమైన సిగ్నల్స్ తగ్గిపోయి మళ్లీ పాతికేళ్ల యువకుల స్థాయికి చేరుకున్నాయి.
గోల్డెన్ కివీ
ఇది డీఎన్ఏ పాడవకుండా కాపాడమే కాదు ఇప్పటికే దెబ్బతిన్న డీఎన్ఏను తిరిగి కుట్టి రిపేర్ చేసే ఎంజైమ్ లను కూడా వేగవంతం చేస్తుంది. రోజుకి ఒక్క కివీ పండు తింటే చాలు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఏంటంటే..ఇద్దరు వ్యక్తులు ఒకే రకమైన పండు తిన్నా ఒక్కరికే ఆ రక్షణ దొరుకుతుంది. ఎందుకంటే పండులోని పోషకాలను క్యన్సర్ కణాలను చంపే యూరోలిథిన్ ఏ లాంటి శక్తివంతమైన మందుగా మార్చాలంటే మన పొట్టలో మంచి బ్యాక్టీరియా ఉండాలి. కేవలం 40 శాతం మందిలో మాత్రం ఈ బ్యాక్టీరియా ఉంటది. మనం తినే ఆహారం అమృతంలాంటి కానీ దాన్ని ఒంటికి పట్టించే తాళం చెవి మన పొట్ట ఆరోగ్యంలో ఉంది. అందుకే ఉల్లిపాయలు, వెల్లుల్లి, అరటిపండు, వాల్ నట్స్ వంటివి రోజూ తింటూ పొట్టలోని మంచి బ్యాక్టీరియాను పెంచుకోండని డాక్టర్ సుబ్రమణ్యం సూచించారు
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
