Latest Updates
-
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా?
ఫ్యాషన్ వాస్తవాలు: క్రిస్టీన్ డియోర్ పెన్సిల్ స్కర్టు నీ, ఏ లైన్ స్కర్టునీ ఎలా రూపొందించారు
1950 ల ఫ్యాషన్ ప్రేరణతో ఏ లైన్ స్కర్టునీ, పెన్సిల్ స్కర్టునీ రూపొందించారు ప్రఖ్యాత ఫ్రెంచ్ డిజైనర్ క్రిస్టీన్ డియోర్.ప్రపంచాన్ని ఒక ఊపు ఊపిన పెన్సిల్ స్కర్టు ట్రెండ్ గురించి మొదట మాట్లాడుకుందాము. వంకర లేకుండా తిన్నగా ఉండి చివర్లు ఇరుకుగా ఉండేదే పెన్సిల్ స్కర్టు అంటే.సాధారణం గా పెన్సిల్ స్కర్టు యొక్క అంచు మోకాళ్ళ కి ఎగువన లేదా మోకాళ్ళకి కొంచం దిగువు గా ఉంటుంది.ఇది వేసుకున్న వారికి సరిగ్గా అతికినట్టు అమరేలా కుడతారు.పెన్సిల్ లాగ పొడుగ్గా సన్నగా ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది.
పెన్సిల్ స్కర్టు ని సూటు లో భాగం గా ధరించవచ్చు లేదా స్కర్టు ని విడిగా ధరించవచ్చు.పెన్సిల్ స్కర్టు యొక్క ఆకారం ఇరుకుగా ఉండటం వల్ల వేసుకున్నవారికి అటూ ఇటూ కదలడం ఇబ్బందే. అందుకని ఆ స్కర్టు కి వెనకాల ఒక చిన్న చీలిక(స్లిట్) ఉంటుంది.

చాలా కొన్ని పెన్సిల్ స్కర్ట్స్ కి మాత్రమే ఈ స్లిట్ పక్కన ఉంటుంది.ఈ స్లిట్ కి బదులు గా చిన్న మడత ఉండటం వల్ల పెన్సిల్ స్కర్టు వేసుకున్నప్పుడు ఎక్కువ శరీరం బయటకి కనపడదు పైగా కదలడానికి ఇబ్బంది కూడా ఉండదు.పంప్స్, హై హీల్స్,స్టాకింగ్స్ లేదా టైట్స్ పెన్సిల్ స్కర్టు కి నప్పే పాదరక్షలు.

1950 లలో పెన్సిల్ స్కర్ట్స్ బాగా ప్రసిద్ధి.పెన్సిల్ స్కర్ట్ వేసుకుంటే స్త్రీ శరీరం పెద్దగా బయటకి కనపడకుండానే ఒక రకమైన సెక్సీనెస్ వస్తుంది.
పెన్సిల్ స్కర్ట్ల మీద ఫ్లాట్స్ ధరించి క్యాజువల్ గా కనిపించవచ్చు లేదా 1960 ల నాటి యూత్ ఫుల్ లుక్ పొందచ్చు.పెన్సిల్ స్కర్టు తో లోఫర్స్(ఒక రకమైన పాదరక్షలు) ధరిచంచడం ఒక క్లాసిక్ ప్రెప్ స్టయిల్. నారో ఫిట్టింగ్ స్కర్టులు వెస్టర్న్ ఫ్యాషన్ చరిత్ర లో ఎప్పటినుండో ప్రారంభమయ్యాయి.

మొదటి ప్రపంచ యుద్ధానికి ముందున్న హాబుల్ స్కర్ట్ ప్రస్తుత పెన్సిల్ స్కర్టు కి ప్రేరణ.పొడుగ్గా ఇరుకుగా ఉండే ఈ హాబుల్ స్కర్టు ధరించి అటూ ఇటూ నడవడం ఇబ్బంది గా ఉండేది.1954 ఆటం వింటర్ కలెక్షన్ లో భాగం గా క్రిస్టీన్ డియోర్ ప్రస్తుతం ఉన్న పెన్సిల్ స్కర్టు ని ప్రవేశపెట్టారు.

ఆఫీస్ వేర్ గా పెన్సిల్ స్కర్టు అతి త్వరగా ప్రాచుర్యం పొందింది.రెండో ప్రపంచ యుద్ధ సమయం లో, కఠిన ఆర్ధిక పరిస్థితుల్లో వస్త్రం బాగా ఖరీదుగా ఉండేది. అలాంటప్పుడు కొత్త ఫ్యాషన్ ని ధరించాలన్న స్త్రీల కోరిక వల్ల పెన్సిల్ స్కర్టు ప్రాచుర్యం పొందింది.

లూజు స్కర్టుల కంటే భిన్నం గా ఉండే పెన్సిల్ స్కర్టు తో కదలడం ఇబ్బంది.పెన్సిల్ స్కర్టు వేసుకుంటే చిన్న చిన్న అంగలేస్తూ నడవాలి.పెన్సిల్ స్కర్టు ధరించి కారు లోకి హుందాగా ఎక్కడం లేదా దిగడం రావాలంటే చాలా ప్రాక్టీసు అవసరం.కూర్చున్నప్పుడు కాళ్ళు దగ్గరగా ఉంచుకోవాలి.ఈ స్కర్టు ధరించి నిచ్చెనలెక్కడం లేదా సైకిలు తొక్కడం లాంటివి చాలా కష్టం.
ఒక్క మాటలో చెప్పాలంటే అణకువగా ఉండే స్త్రీలా అనిపిస్తారు. పెన్సిల్ స్కర్టు క్రింది భాగం ఇరుకుగా ఉండటం వల్ల గాలి చొరబడక వేసుకున్నప్పుడు వెచ్చగా ఉంటుంది. పైగా పెద్ద పెద్ద గాలులు వీచినప్పుడు ఇది పైకి లేవదు.పెన్సిల్ స్కర్టు కి చిన్న స్లిట్ లేదా మడత ఉండటం వల్ల పెన్సిల్ స్కర్టు లో ఉండే గ్రేస్ ని కాపాడుకుంటూనే మామూలుగా నడవడం కూడా కుదురుతుంది.

ఇక ఏ-లైను స్కర్టు కి వస్తే ఇది నడుము, పిరుదుల దగ్గరా పట్టి ఉండి క్రిందకొచ్చే కొద్దీ ఇంగ్లీషు అక్షరం "ఏ" లాగ వదులుగా మారుతుంది.ఇలాగే ఉండే కోట్లు, డ్రెస్సులని కూడా ఏ లైన్ డ్రెస్సులనే వ్యవహరిస్తారు.
పెన్సిల్ స్కర్టు పితామహుడు క్రిస్టీన్ డియోరే 1955 లో తన స్ప్రింగ్ కలెక్షన్ లో భాగం గా మొట్ట మొదటి సారి ఏ లైన్ స్కర్టు అనే పదాన్ని వాడారు.నడుము దగ్గర పట్టినట్లుండి కింద వదులుగా ఉండే జాకెట్టు ని కుచ్చిళ్ళు లేదా మడతలు ఎక్కువ ఉన్న వదులు స్కర్టు మీద ధరించడం 1950 లో పారిస్ లో బహు ప్రాచుర్యం.

ఏ ఆకారం లో ఉన్నా కానీ అప్పటి ఏ లైన్ డ్రెస్సు ప్రస్తుతం ఏ లైన్ అనుకుంటున్నదీ ఒకేలాగ ఉండవు.డియోర్ తరువాత వచ్చిన యెవెస్ సెయింట్ లారెంట్ తన 1958 స్ప్రింగ్ కలెక్షన్ లో భాగం గా తెచ్చిన "ట్రెపీజ్ లైన్" డ్రెస్సులు భుజాల దగ్గర పట్టి ఉండి క్రిందకొచ్చే కొద్దీ వదులుగా ఉండేటట్లు రూపొందించారు.
1960 లు 70 లలో ఏ లైన్ బట్టలు ప్రాచుర్యం లో ఉండి 1980 ల ప్రారంభానికి ఫ్యాషన్ ప్రపంచం నుండి అదృశ్యం అయిపోయాయి మరలా 1990 ల చివర్లో రెట్రో ట్రెండ్ లో భాగం గా పునరుద్ధరించబడ్దాయి.అప్పటి వరకూ పిరుదులూ,ఛాతీ, నడుము దగ్గరా వెడల్పుగా ఉన్న వాటినీ, కింద వెడల్పుగా మడతలతో ఉన్న వాటినీ ఏ లైన్ డ్రెస్సులనేవారు.2000 సంవత్సరం లో అసలైన డియోర్,లారెంట్ల ఏ లైన్ డ్రెస్సులు పునరుజ్జీవనం పొందాయి.



Click it and Unblock the Notifications











