Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.!
కొంతమంది మద్యం ముట్టకుండా ఉండలేరు.. మరికొందరు దాని వాసన చూడటానికి కూడా ఇష్టపడరు. కొందరు మద్యపానానికి అంతలా బానిసలవుతుంటే.. ఇంకొందరు మాత్రం దాని జోలికి కూడా వెళ్లకుండా ఎలా ఉండగలరు. ఒకరిని అట్రాక్ట్ చేసే ఈ ఆల్కహాల్, మరికొందరిని మాత్రం ఎందుకు ఆకర్షించలేకపోతుంది. ఇందుకు కారణాలేంటి.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ దీనిపై చేసిన ఒక కామెంట్ కూడా ఈ ప్రశ్నను లేవనెత్తుతుంది..

సన్నీ డియోల్ ఏం చెప్పారు..
మద్యపానం అనేది భయంకరమైన వ్యసనం అని తెలిసినా కూడా చాలా మంది దాని ఉచ్చులో పడిపోతారు. ఈ క్రమంలో బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్.. మద్యాన్ని తాను ఎప్పుడూ అలవాటుగా మార్చుకోలేదని తెలిపారు. దానికి ఎప్పుడూ బానిస కాలేదని.. కానీ తాను బయటకు వెళ్లినప్పుడు అందరితో కలిసిపోవడానికి మద్యం సేవించడం మొదలుపెట్టినట్లు చెప్పారు. సన్నీడియోల్ అనుభవం.. ఇప్పుడు చాలా మందిలో ఒక ప్రశ్నను లేవనెత్తింది. కొందరు మద్యానికి బానిసలవుతుండగా, మరికొందరు దూరంగా ఎలా ఉంటున్నారనే సందేహం మొదలైంది.
మెదడులో రివార్డ్ సిస్టమ్
వ్యసనం ఏదైనా దానికి మన శరీరం, మనస్సు వేర్వేరుగా స్పందిస్తాయని నిపుణులు అంటున్నారు. సైంటిస్టుల అధ్యయనం ప్రకారం మద్యం సేవించినప్పుడు, అది మెదడులోని "రివార్డ్ సిస్టమ్"ను నేరుగా ఉత్తేజపరచడంతో ఒక రకమైన అనుభూతిని కలిగిస్తుంది. ముఖ్యంగా మద్యం సేవించడం వల్ల మెదడులో విడుదలయ్యే రసాయనాలు తాత్కాలికంగా సంతోషాన్ని, ప్రశాంతతను, ఉల్లాసాన్ని కలిగించడంతో మరికొంచెం తీసుకోవాలని ఆరాటపడతారు.
ఇంకొంతమందికి మద్యం తాగే అలవాటు లేకపోయినా.. సొసైటీలో సేఫ్‌గా ఫీల్ అయ్యేందుకు, ధైర్యం తెచ్చుకునేందుకు, నలుగురిలో కలిసిపోయేందుకు ఆల్కహాల్ తీసుకోవడానికి ఇష్టపడతారు. దీంతో ఆ సమయంలో మీకు కలిగే మంచి అనుభూతి అనేది మీ మెదడును పదే పదే తాగడానికి ప్రేరేపిస్తుంది. ఇది ప్రతీ సందర్భంలోనూ రిపీట్ అవుతూ క్రమంగా దీనికి అలవాటు పడిపోతుంటారు. ఈ అలవాటు కాస్త వ్యసనంగా మారుతుంది.

కెమికల్ రియాక్షన్
అందుకే మద్యం మానేయలేకపోతున్నామని ఎవరైనా చెప్పినప్పుడు వారికి సంకల్ప బలం లేదని మీరు అనుకోవచ్చు. కానీ వారి మెదడులో జరిగే ఒక సంక్లిష్టమైన కెమికల్ రియాక్షన్ ఇది అని మీరు అర్థం చేసుకోవాలి. దీనిని అధిగమించడం అందరికీ అంత సులభం కాకపోయినా.. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ అలవాటు, వ్యసనం నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.
ఈ క్రమంలో అసలు మందు వాసన తెలియని వారు, దానిని ఇప్పటివరకూ టేస్ట్ చేయని వారు మద్యం ఎదురుగా ఉన్నా తమకు సంబంధం లేదన్నట్లుగా ఉంటారు. తమ పనిలో తాము ఉంటారు. నిగ్రహించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఈ వ్యసనం ఉన్న వారు మాత్రం తప్పనిసరిగా దాని నుంచి బయటపడటానికి ప్రయత్నించాలి.
నలుగురితో బయటకు వెళ్లినప్పుడు మద్యం బదులుగా సాఫ్ట్ డ్రింక్స్ లేదా ఏవైనా హెల్తీ పానీయాలు తీసుకోవడం చేయాలి. లేదా మద్యం సేవించకుండా స్టఫ్ మాత్రమే తీసుకుంటూ సంభాషించడం చేయాలి. నలుగురితో ఉన్నప్పుడు మద్యం తాగితేనే గౌరవంగా, ధైర్యంగా భావించకూడదు. మద్యం తాగాలని అనిపించినప్పుడు బిజీగా ఉండటం, నచ్చిన పనులు చేయడం వంటి ద్వారా మెల్లగా ఈ అలవాటు నుంచి బయటపడిపోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
