Latest Updates
-
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా..
సిక్స్ ప్యాక్ అంటే సిగరెట్ ప్యాకెట్ తీసుకున్నంత సులభం కాదు, మగధీర+బాహుబలి కలిస్తే ఇతనే ...
సిక్స్ ప్యాక్ అంటే ఆరు సిగరెట్ ప్యాకెట్లు తీసుకుని జోబులో పెట్టుకోవడం కాదు. సిక్స్ ప్యాక్ తో కనపడాలంటే దానికి వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. మగాళ్లు ఫిట్ గా, హ్యాండ్సమ్ గా ఉండాలంటే ప్రస్తుతం మగాళ్లు చేస్తున్న మొదటి పని రోజు వ్యాయామం చేసి సిక్స్ ప్యాక్ తో కనపడటం. ఎవరైతే సిక్స్ ప్యాక్ తో ఉంటారో వాళ్లు చాలా సెక్సీగా కనిపిస్తారని, అలాంటి మగాళ్లకు మహిళలు ఆకర్షితులవుతున్నారని కొందరు ఆడవాళ్లే బహిరంగంగా చెప్పారు.
అమ్మాయిలను ఆకర్షించడానికి చాలా మంది యువకులు సిక్స్ ప్యాక్ తో వాళ్లను ఆకట్టుకోవాలని యువత మనసులో నాటుకుపోయింది. దానికి ప్రధాన కారణం సినిమాలే. ఒక నటుడు సినిమాల్లో సిక్స్ ప్యాక్ తో కలిపించాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ హీరో షర్ట్ తీసేసి సిక్స్ ప్యాక్ చూపిస్తూ ఫైటింగ్ చేస్తూ విలన్లను చితకబాదుతుంటే ప్రేక్షకులు, ఫ్యాన్స్ వీలలు వేస్తూ కేకలు పెడుతూ థియేటర్ దద్దరిల్లేలా హంగామా చేస్తారు. తెలుగులో ఇప్పటికే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రబాస్ తదితరులు సిక్స్ ప్యాక్ తో వాళ్ల అభిమానులను ఆకట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు.

జీన్స్ ప్యాంట్ లో చేతులు పెట్టుకుని ఫోజోలు కొడితే సిక్స్ ప్యాక్ రాదు. దర్జాగా కుర్చీలో కుర్చుని ల్యాప్ ట్యాప్ ముందు పెట్టుకుంటే సిక్స్ ప్యాక్ వచ్చేయదు. సిక్స్ ప్యాక్ తో కనపడటం స్నాక్స్ తినంత తేలిక కాదు. సిక్స్ ప్యాక్ తో కనిపించాలంటే జిమ్‌లో చాలా వర్కవుట్ చేయాలి. జిమ్ చేసే సమయంలో డైట్‌పై శ్రద్ధ పెట్టాలి, కొన్ని నెలలు కష్టపడితేనే సిక్స్ ప్యాక్ తో కనపడటానికి అవకాశం ఉంటుంది. సిటీలల్లో, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యాయామ కేంద్రాల్లో చాలా మంది వ్యాయామం చేస్తుంటారు.
అయితే ఇక్కడ ఏ జిమ్‌కి వెళ్లకుండా, ప్రొటీన్ పౌడర్ తీసుకోకుండా సిక్స్ ప్యాక్‌తో ఓ వ్యక్తి స్టీల్ బాడీని తెచ్చుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. అతను సిక్స్ ప్యాక్ తో పాటు స్టీల్ బాడీని ఎలా పొందారో చూస్తే అందరికి ఆశ్చర్యం వేస్తోంది. సిక్స్ ప్యాక్ తో స్టీల్ బాడిని తయారు చేసుకోవడానికి అతను సహజమైన ఆహార పదార్థాలను తీసుకున్నాడు. ఏ జిమ్‌కు వెళ్లకుండా సహజసిద్ధమైన పదార్థాల తీసుకోవడం, సహజమైన ప్రకృతిలో చిక్కిన వస్తువులు, రాళ్లు, చెక్కలతో వ్యాయామం చేసి సూపర్ స్టీల్ బాడీని తయారు చేసుకున్న అతను ఇతరులకు స్ఫూర్తిగా నిలిచాడు.
జిమ్ సెంటర్ లకు వెళ్లి అత్యాధునిక పరికరాలతో వ్యాయామం చేసి సిక్స్ ప్యాక్ తో కనపడుతున్న వాళ్లకు చుక్కలు చూపించిన అతని పేరు మిస్టర్ వ్యాడ్. ఇప్పుడు మిస్టర్ వ్యాడ్ స్టైల్ ఆఫ్ ఆఫ్రికా అని అందరి దగ్గర పిలుచుకుంటాడు. ఎలాంటి జిమ్ పరికరాలు, ఎలాంటి ఖరీదైన సామగ్రిని ఉపయోగించకుండా సహజసిద్ధమైన పదార్థాలు తీసుకుని, ప్రకృతిలో చిక్కిన వస్తువులను ఉపయోగించి సిక్స్ ప్యాక్ పొందాడు ఈ ఆఫ్రికా జాతీయుడు మిస్టర్ వ్యాడ్.
మిస్టర్ వ్యాడ్ ప్రతిరోజూ కఠోర వ్యాయామం చేస్తాడు. దీని ద్వారా మిస్టర్ వ్యాడ్ అతని శరీరాన్ని బలంగా ఉక్కులాగా తయారు చేసుకున్నాడు. దాని కోసం మిస్టర్ వ్యాడ్ ఎటువంటి ప్రోటీన్ పౌడర్‌ను ఉపయోగించలేదని వెలుగు చూసింది. ఇప్పుడు బాడీ బిల్డింగ్ ప్రపంచం తనవైపు చూసేలా మిస్టర్ వ్యాడ్ చెయ్యడం ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అందుకే మిస్టర్ వ్యాడ్ స్టైల్ ఆఫ్ ఆఫ్రికా అయ్యాడు. యూట్యూబ్ లో చూస్తూ ప్రతిరోజు వ్యాయామం చేశాడు.
మిస్టర్ వ్యాడ్ ఘనత ప్రఖ్యాత బాడీబిల్డర్ పాల్ జీన్ గుయిలౌమ్‌ను పోలి ఉంటుంది. 1980 నుండి 1990 మధ్యకాలంలో ప్రసిద్ధ బాడీబిల్డర్ అయిన పాల్ జీన్ గయిలౌమ్ అప్పట్లో బాడీ బిల్డర్లకు రోల్ మాడల్ అయ్యాడు. చాలా మంది బాడీ బిల్డర్లు స్టెరాయిడ్స్ పొందేవారని అనేక సందర్బాల్లో వెలుగు చూసింది. ఎలాంటి స్టెరాయిడ్స్ తీసుకోకుండా బాడీబిల్డింగ్ సాధించిన వారు మాత్రమే చాలా తక్కువగా ఉంటారు. అలాంటి బాడీ బిల్డర్స్ మిస్టర్ వ్యాడ్ ఇప్పుడు ముందు వరుసలో ఉన్నాడు.
సిక్స్ ప్యాక్ చేసి బాడీ బిల్డర్స్ వెలుగొందుతున్న వారికి ఇప్పుడు మిస్టర్ వ్యాడ్ రియల్ హీరో అయ్యాడు. బాడీ బిల్డింగ్ చేయాలంటే జిమ్‌కి వెళ్లి ప్రొటీన్ పౌడర్ తీసుకోవాల్సిందేనని చాలా మంది అనుకుంటారు. సక్రమంగా వర్కవుట్ చేస్తే బాడీ బిల్డింగ్ కూడా చేయవచ్చని, అందుకు స్టెరాయిడ్స్ తీసుకోవాల్సిన అవసరం లేదని మిస్టర్ వ్యాడ్ ను చూస్తే అర్థం అవుతోందని చాలా మంది బాడీ బిల్డర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి బాడీ బిల్డింగ్ చేయాలనే కోరిక ఉంటుంది, కానీ వారు జిమ్ కు వెళ్లలేరు. అలాంటి వాళ్లు మిస్టర్ వ్యాడ్ ను ఆదర్శంగా తీసుకుని వ్యాయామం చేస్తే సరిపోతుందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications