Latest Updates
-
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.!
కళ్లపై స్క్రీన్ల ఎఫెక్ట్..ఒక్క పైసా ఖర్చు లేకుండా మీ కంటిచూపును కాపాడే సింపుల్ టిప్స్!
గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్లు, టీవీలు, స్మార్ట్ ఫోన్లలో సోషల్ మీడియా స్క్రోలింగ్.. ఇలా అడుగడుగునా స్క్రీన్లతో ముడిపడి ఉన్న ఈ డిజిటల్ యుగంలో మన కళ్లు విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నాయి. కళ్లు మనకు ప్రకృతి ప్రసాదించిన అత్యంత విలువైన బహుమతి. కానీ ఈ ఉరుకుల పరుగుల ప్రపంచంలో వాటిపై మనం పెడుతున్న భారం అంతా ఇంతా కాదు. పెద్దగా కష్టపడకుండా, ఖర్చు లేకుండా మన కంటి ఆరోగ్యాన్ని, చూపును మెరుగుపరిచే అద్భుతమైన చిట్కాలను ముంబైకి చెందిన ప్రముఖ డాక్టర్ మనీషా మిశ్రా గోస్వామి తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేశారు. అవేంటో ఇక్కడ చూడండి.

పామింగ్
కంప్యూటర్ ముందు కదలకుండా పనిచేయడం వల్ల కళ్లు బాగా అలసిపోతాయి. అప్పుడు మీ రెండు అరచేతులను బాగా రుద్ది, కొద్దిగా వేడెక్కాక ఆ వెచ్చని చేతులతో మూసుకున్న కళ్లను సున్నితంగా కప్పుకోండి. దీనినే పామింగ్ అంటారు. రోజుకి 2 సార్లు ఇలా చేయండి. చీకటి, అరచేతుల వెచ్చదనం కలయిక కంటి కండరాలను పూర్తిగా రిలాక్స్ చేస్తుంది. కంటి అలసట ఇట్టే తగ్గిపోయి, తిరిగి మీ పనిపై ఫోకస్ పెంచడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.
ఉదయపు సూర్య కిరణాలతో కంటి వ్యాయామం
ఉదయం నిద్రలేవగానే స్క్రీన్ చూడకుండా కాసేపు ప్రకృతిని ఆస్వాదించండి. ఉదయం పూట ఎర్రగా ఉదయించే లేత సూర్యుడిని 10 నుండి 20 సెకన్ల పాటు రెప్ప వేయకుండా చూడండి. దీనిని సూర్య త్రాటకం అంటారు. ఇది రోజంతా స్క్రీన్ చూడటం వల్ల వచ్చే అలసటను తగ్గిస్తుంది. కంటి నరాలు, కండరాల కదలికల సమన్వయాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. అయితే ఇక్కడ ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే..ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు, మిట్ట మధ్యాహ్నం వేళ ప్రకాశవంతమైన సూర్య కిరణాలను కంటితో అస్సలు చూడకూడదు. అది కళ్లకు హానికరం.
చల్లని వెన్నెలతో ఏకాగ్రత
ప్రతిరోజూ చంద్రుడిని 5-10 నిమిషాలు చూడండి. ఇలా చేయడం వల్ల కళ్లకు కూలింగ్ వస్తుంది. వెన్నెల కాంతి చాలా సున్నితంగా ఉండటం వల్ల అది మన కంటి రెటీనాను చల్లబరుస్తూ రక్షిస్తుంది.చంద్రుడిని తదేకంగా చూసే చంద్ర త్రాటకం వల్ల మనసులోని అలజడి తగ్గి ఏకాగ్రత అనూహ్యంగా పెరుగుతుంది. వెలుతురును చూస్తే భయపడే లేదా ఇబ్బంది పడే ఫోటోఫోబియా సమస్య తగ్గుముఖం పడుతుంది.
తరచుగా కనురెప్పలు ఆర్పడం
మనం స్క్రీన్లను తదేకంగా చూస్తున్నప్పుడు తెలియకుండానే కనురెప్పలు ఆర్పడం మర్చిపోతాము. దీనివల్ల కళ్లు పొడిబారి డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతిరోజూ తరచుగా కనురెప్పలు ఆర్పడం ఒక అలవాటుగా చేసుకోండి. ఇది కళ్లకు సహజసిద్ధమైన కందెన (లూబ్రికేషన్స్)లా పనిచేసి డ్రై ఐ నివారిస్తుంది. కంటి కండరాలను సడలించి వాటిని మరింత బలోపేతం చేస్తుంది.
చల్లటి నీటితో కళ్లను కడుక్కోవడం
కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందు కూర్చొని పనిచేసేవాళ్లు ప్రతి 2-3 గంటలకొకసారి కళ్లను చల్లని నీటితో సున్నితంగా కడుక్కోండి. దీంతో కంటి ఉష్ణోగ్రత క్రమబద్ధీకరించబడుతుంది. కంట్లోని వేడి, దుమ్ము తొలగిపోయి కంటిపై పడిన ఒత్తిడి మాయమవుతుంది. కళ్లు తక్షణమే రిఫ్రెష్ అవుతాయి.
నెయ్యి అప్లై చేయడం
రాత్రిపూట నిద్రపోయే ముందు కళ్లకు పెట్టుకునే కాటుక మాదిరిగా కళ్లకు దేశీ నెయ్యిని పూయడం మేలు చేస్తుందని డాక్టర్ మనీషా మిశ్రా చెబుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
