Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
అలసటను పోగొట్టే 5 ఆహారాలు!

1. లెమనేడ్ - ఇందులో వుండే షుగర్ నుండి గ్లూకోజ్ శరీరానికి వెంటనే అందుతుంది. శరీరంలో సాయంత్రానికి ఆవిరి అయిపోయిన ద్రవాలను, ఖనిజలవణాలను భర్తీ చేసేందుకు ఇందులో వుండే ఉప్పు కూడా తోడ్పడుతుంది. అన్నిటికంటే ప్రధానమైన విటమిన్ సి నిమ్మకాయ నుండి లభిస్తుంది.
2. అరటిపండు - అలసిన శరీరానికి గ్లూకోజ్ ను కార్బోహైడ్రేట్లను ఎంతో తేలికగాను వేగవంతంగాను ఈ పండు అందిస్తుంది. రక్తంలోని హేమోగ్లోబిన్ కవసరమైన ఐరన్ అందిస్తుంది. ఎంతో శక్తి కలిగి భావిస్తారు.
3. ఛీజ్ - సాధారణంగా బరువు తగ్గాలంటూ డైటింగ్ లోవుండి నీరసపడేవారు కొద్దిపాటిగా ఉత్తేజాన్నిచ్చేందుకుగాను తింటారు. ఇది సరి కానప్పటికి, ఛీజ్ ఎంతో శక్తినిచ్చేదని భావించవచ్చు. శక్తినిచ్చే హార్మోన్లను ఇది రిలీజ్ చేస్తుంది.
4. స్ట్రాబెర్రీలు - తక్షణ శక్తికి ఈ పండును మించింది లేదు. అధికమైన పీచు, అధిక ఎనర్జీ, అధిక విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ కలబోసిన ఈపండు తక్షణ శక్తినిస్తుంది.
5. గ్రీన్ టీ - నరాలను జివ్వును ఉత్తేజపరచాలంటే గ్రీన్ టీ ఎంతో మంచిది. సాధారణ కాఫీ, టీల కంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. లోపలి భాగాలను శుభ్రపరచి అధికమైన శక్తినివ్వటంలో గ్రీన్ టీ ని మించిన పానీయం లేదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
