Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పొట్టకు కొవ్వు పట్టిందా?

40 ఏళ్ళ పై వయసు గలవారు కండరాల బలాన్ని కోల్పోతారు. పొట్టకు కొవ్వు పెరగటానికి కారణాలలో ఇది ప్రధానమైంది. పోయిన ఈ కండ కొవ్వు పొరగా ఏర్పడుతుంది. నిద్ర సరిగా లేకపోవటం కూడా మధ్య వయసు వారిలో అధిక బరువు కలిగిస్తుంది. శరీరంలో ఈస్ట్రోజన్ పెరగటం పురుషులకు కారణమయితే, స్త్రీలకు మెనోపాజ్ కారణంగా అధిక బరువు ఏర్పడుతుంది. 40 సంవత్సరాల పై వయసు వారు ఆహారాన్ని తక్కువగా తీసుకున్నప్పటికి లావెక్కుతున్నారనేదానికి ఇవే కారణాలు.
పొట్ట, కొవ్వు నిల్వలను తగ్గించే మార్గాలు -
1. బ్రక్కోలి, కాలీఫ్లవర్, గోంగూర, బీట్ రూట్, సిట్రస్ పండ్లు తినటం శరీరంలో ఈస్త్రోజన్ ఉత్పత్తిని తగ్గించి పొట్ట తగ్గేందుకు సహకరిస్తుంది.
2. రేప్ సీడ్ లేదా ఆలివ్ ఆయిల్ కూరలు ఇతర పదార్ధాలలో వాడండి. అదే రకంగా, ముడి నువ్వులు లేదా అవిసె గింజలు సలాడ్లలో వాడితే అది శరీరంలోని ఈస్ట్రోజన్ స్ధాయిలను తగ్గిస్తుంది.
3. ప్రతిరోజూ ఆహారంలో ప్రొటీన్ అధికంగా వుండే ఒక ఆహారాన్ని తీసుకోండి. గుడ్లు, నాటు మాంసం, చేప, కాయధాన్యాలు, మొదలైనవి మంచి పోషకాలనిస్తాయి. కేలరీలు నియంత్రించవచ్చు.
4. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే పొట్ట కొవ్వు తగ్గించవచ్చు. రోజూ 30 నిమిషాలు కనీసం నడవటం, ఈత కొట్టడం, డ్యాన్స్ చేయడం, సైకిలింగ్ లేదా మీకు సరి అనుకున్న ఇతర వ్యాయామాలు చేసినా ఫలితం వుంటుంది.
5. ఆల్కహాలు వినియోగం బాగా తగ్గించాలి. లేదా పూర్తిగా మానేస్తే పొట్ట కొవ్వు అదుపులో వుంటుంది.
6. అధికమైన ఒత్తిడి కలిగి వుండటం కూడా శరీరంలో కొవ్వు నిల్వలు ఏర్పడతాయి. మంచి జీవన విధానంఆచరించి ఒత్తిడి తగ్గించుకోండి.
పై చర్యలు పాటించే వారికి పొట్టకొవ్వు వదిలించుకోవడం, అధిక కొవ్వు శరీరంలో లేకుండా చేసుకోవడం పెద్ద సమస్యేమీ కాదని గ్రహించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications