Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆహారం పట్ల కొన్ని భ్రమలు!

1. వ్యాయామాలు చేసినంతకాలం మీరు ఏదైనా తినేయవచ్చు అనేది ఒక భ్రమ - మన శరీరం ఒక మెషీన్ లాంటిది. కనుక ఒక మెషీన్ తో పోలిస్తే, వాహనం ఎన్నాళ్ళు నడిపినా...ఏ ఇంధనమైనా పోయవచ్చు. కాని ఏది పోసినా వాహనం నడవదు. దానికవసరమైన నాణ్యతగల ఇంధనం కారును నడుపుతుంది. అదే విధంగా శరీరానికి తగిన నాణ్యతగల పదార్ధాలే తినాలి. అపుడే ఆరోగ్యం బాగుంటుంది.
2. డైటింట్ చేస్తూ వుంటే వ్యాయామం అవసరం లేదనేది మరో భ్రమ - డైటింగ్ చేసే వారు కూడా వ్యాయామం చేయాలి. వ్యాయామం లేకుంటే, బాడీ సరైన రూపం సంతరించుకోదు. కారణం. వ్యాయామం లేకుంటే శరీరంలోని కొవ్వు కరగదు.
3. తక్కువబరువుంటే సన్నం...ఎక్కువ బరువుంటే కొవ్వు చేరినట్లు. ఇది మరో భ్రమ. క్రీడాకారుల శరీరాలు పరిశీలిస్తే, వారు సన్నగా వున్నప్పటికి బరువు అధికంగానే వుంటారు. వీరిలో కండలు అధికంగా వుండి బరువు కలిగిస్తాయి. కొవ్వు అనేది కండ లేకుండా శరీరంలో లూజుగా కూడా వుంటుంది. వెయట్ తక్కువున్నప్పటికి మీరు లావుగా కనపడతారు.
4. స్లిమ్ గా వుంటే ఫిట్ గా వున్నట్లే - ఇది కూడా భ్రమే. శరీరంలో వున్న కొవ్వు శాతం మీరు ఎంత సన్నగా వున్నారనేది చెపుతుంది. పేరొందిన మోడల్స్ సన్నగా వుంటారు. ఎందుకంటే వీరు ఆహారం సరిగా తీసుకోరు కాని వాస్తవంలో వీరిలో అధిక కొవ్వు శాతం వుంటుంది. వీరు తమ వృత్తి మానేస్తే చాలు బరువెక్కిపోతారు.
5. కొవ్వు లేని ప్రత్యామ్నాయాలు బరువు తగ్గిస్తాయి. ఇది సరికాదు. కొవ్వుతక్కువగా వుండే షుగర్ లేని తిండ్లు, కొవ్వు తక్కువుండే పెరుగు వంటివి ఒక్కొక్కపుడు లావు చేయటమే కాదు, అనారోగ్యం కూడా కలిగిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications