Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భరించలేని బహిష్టు నొప్పులా? పరిష్కరించండిలా!

1. బహిష్టు సమయంలో గర్భసంచి బలహీనంగా వుంటుంది కనుక చాలా తేలికగా వుండే వ్యాయామలు చేయాలి.
2. బహిష్టు నొప్పి తగ్గేటందుకు తాజా పండ్లు, కూరలు తీసుకోండి. విటమిన్ ఇ, జింక్, ఒమేగా 3, కాల్షియం, మెగ్నీషియం వున్నఆహార పదార్ధాలు బాగా పని చేస్తాయి.
3. వ్యాయామాలు ఎండార్ఫిన్ లను, సెరోటోనిన్ స్ధాయిలను పెంచి నొప్పితగ్గేటందుకు తోడ్పడతాయి. బహిష్టు సమయంలోనే కాక ఇతరంగా కూడా మహిళలు వ్యాయామం చేస్తే ఈ సమస్యలు రావు.
4. నడక అనేది బహిష్టు నొప్పులను తగ్గించేందుకు మంచి వ్యాయామం. ప్రతిరోజూ 30 నిమిషాలు నడిస్తే అది శరీరంలో ఎండార్ఫిన్లను పెంచి రిలీఫ్ ఇస్తుంది.
5. మెల్లగా పరుగుపెట్టడం కూడా నొప్పి తగ్గించేటందుకు సహకరిస్తుంది. వారంలో కనీసం మూడు సార్లు పరుగు పెట్టండి. క్రమేణా దాని ప్రభావం నొప్పులపై బాగా తగ్గేలా చేస్తుంది.
6. పొట్టను బాగా వంచే వ్యాయామాలు కూడా పని చేస్తాయి. నేలపై వెల్లకిలా పడుకొని కాళ్ళు కొద్దిగా పైకెత్తి మోకాళ్ళు వంచండి. ఇపుడు మోకాళ్ళు గడ్డం ఛాతీ వద్దకు తీసుకురండి. పది సెకండ్లు అలాగే వుండండి. రిలాక్స్ అవండి. దీనిని రోజూ అయిదు సార్లు చేయండి.
7. యోగాసనాల్లో భుజంగాసనం బహిష్టు నొప్పికి బాగా పని చేస్తుంది. బోర్లా పడుకొని చేతులు తలవెనుక పెట్టి శరీర పైభాగాన్ని పైకి లేవాలి. పది సెకండ్ల తర్వాత రిలాక్స్ అవండి.
వ్యాయామాలు చేసిన తర్వాత తగినంత నీరు తాగండి. బహిష్టు సమయంలో కూడా వ్యాయామం చేయటం నొప్పిని, అలసటను, మనో వేదనను బాగా తగ్గిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications