Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వక్షోజాలు ఫిట్ గా...అందంగా....!

బ్రెస్ట్ బిగువుగా వుండాలంటే బ్రాండెడ్ బ్రా లు చాలవు. టీనేజ్ పిల్లలకు ఏ దుస్తులు వేసినా బిగువే. కాని వయసు పైబడిందంటే, పిల్లలకు పాలిస్తే, గర్భవతులుగా శారీరక మార్పులొచ్చేస్తే...తేడా వచ్చేస్తుంది. షేపు మారుతుంది. కొద్దిపాటి వింత సంతరించుకుంటుంది. వ్యాయామాలు చేస్తే మహిళకు షేప్ రావటమే కాదు బిగువైన దుస్తులతో ఎంతో సౌకర్యంగా శ్వాస ఆడుతుంది.
1. పెక్ ఫ్లై మెషీన్ వాడకం - పెక్ ఫ్లై మెషీన్లకు మరింత బరువు పెట్టడం మరి కొద్ది సేపు అంటే 10 నుండి 15 సెకండ్లు అదనంగా వ్యాయామం చేయటం మంచి ఫలితాన్నిస్తుంది. స్తనాల బిగువుకు పెక్ ఫ్లై మెషీన్లు బాగా పని చేస్తాయి. ఎంత వేగంగా చేస్తే అంత బాగా శరీరం మంచి రూపాన్ని సంతరించుకుంటుంది.
2. స్టాబిలిటీ బాల్ - శరీరాన్ని స్టాబిలిటీ బాల్ పై పడుకోబెట్టండి. కాళ్ళు మాత్రం నేలపై విస్తారంగా వుంచండి. శరీరాన్ని రిలాక్స్ చేయండి. మరల ఇదే వ్యాయామాన్ని రిపీట్ చేయండి. శరీర పై భాగం బిగువుగా తయారవ్వాలంటే స్టాబిలిటీ బాల్ బాగా పనిచేస్తుంది.
3. డంబ్ బెల్ వ్యాయామం - డంబ్ బెల్స్ రెండు చేతులతో పట్టుకోండి. వాటిని ఛాతీ వైపు వంచుతూండండి. ఛాతీ భాగంలో వున్న అదనపు కొవ్వు కరిగిపోతుంది.
4. పుష్ అప్ వ్యాయామాలు- ఛాతీ సంబంధిత వ్యాయామాలైన పుష్ అప్ లు శరీర పై భాగ బిగువుకు బాగా పని చేస్తాయి. గోడలపైనా లేదా నేలపైనా ఈ పుష్ అప్ వ్యాయామాలు చేయవచ్చు.
5. ఛాతీ కి ఒత్తిడి కలిగించండి- డంబ్ బెల్స్ వంటివి ఉపయోగించి ఛాతీపై ఒత్తిడి చేయవచ్చు. కండరాలు బలపడతాయి. వీపు నేలకానించి చేతులతో డంబ్ బెల్స్ ను పైకి కిందకు ఎత్తుతుంటే, చేతులు, భుజాలు, మోచేతులు, వక్షోజాలలో వున్న కొవ్వు కరిగి శరీరం మంచి ఆకారం సంతరించుకుంటుంది.
ఈ స్తన సౌందర్య వ్యాయామాలు చాలా సులభం. పెక్ ప్లై మెషీన్ వాడకం మాత్రమే వ్యయంతో కూడుకున్నది. వ్యాయామాల ద్వారా స్తనాలలో వచ్చే బిగువు మహిళలకు ఏ దుస్తులు వాడినా సరే ఆకర్షణీయంగాను, సౌకర్యవంతంగాను వుంటుంది. వక్షాలు బిగువుగాను, ధృఢంగాను వుంటే....మరోమారు వయస్సు చిన్నదైనట్లే!
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications