Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
బరువు తగ్గేటందుకు ఆరు సూత్రాలు!

వెయిట్ లాస్ టిప్ 1 - ఎప్పుడూ ఒకే రీతిగా.....ఏ రకం వ్యాయామం చేసినప్పటికి దానిని మానకుండా కొనసాగిస్తూండండి. దీనికిగాను మీకు స్ధిర నిర్ణయం, మీ వద్ద వున్న వారి సహకారం మీకు కావాలి. వెయిట్ లాస్ కొరకు మీరు చేసే వ్యాయామాలు దీర్ఘకాలంలో తప్పక ఫలితాలనిస్తాయి. కొద్ది వారాలకో లేదా నెలలకో వ్యాయామాలు మార్చండి. విశ్రాంతి రోజులలో తప్ప వ్యాయామ తరగతులు మిస్ చేయకండి.
వెయిట్ లాస్ టిప్ 2 - సమయానికి తినండి...వెయిట్ లాస్ కొరకు ఏం తినాలనేది మీకు తెలిసే వుంటుంది. ఆ ఆహారాలను అవి మూడు సార్లయినా లేదా ఆరు సార్లయినా తింటూనే వుండండి. మానకండి. తిండి మానేయటం, సమయానికి తినకపోవటం ఎసిడిటీ వంటి సమస్యలు తెచ్చిపెడతాయి. అలాగే శరీరానికి నీరు బాగా అందించండి.
వెయిట్ లాస్ టిప్ 3 - చురుకుగా వుండండి - చురుకుగా వుండండి. అవకాశమున్నపుడల్లా, ఉద్యోగం కూర్చునేదయినప్పటికి లేచి కదులుతూ వుండండి. లేచి చిన్న నడక నడవండి. వీలైతే ప్రతి రెండు గంటలకు తాజా గాలి పొందండి. కొవ్వు పేరుకోకుండా వుంటుంది. కిరాణా స్టోర్స్ లేదా బస్ స్టాప్ మొదలగువాటికి నడవండి.
వెయిట్ లాస్ టిప్ 4 - బాగా నిద్రించండి. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. ప్రతి రాత్రి 7 నుండి 8 గంటలనిద్ర కావాలి. తక్కువ లేదా ఎక్కువ నిద్రలు కొవ్వు ఏర్పరుస్తాయి. కనుక చాలినంత విశ్రాంతి తీసుకోండి.
వెయిట్ లాస్ టిప్ 5 - సరైన రీతిలో శ్వాస తీసుకోండి. యోగా నిపుణుల మేరకు గాలి పీల్చితే లేదా వదిలితే మీ శరీరంలోని డయాఫ్రం సంకోచ వ్యాకోచాలు చేయాలి. ఇది మీకుగల ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
వెయిట్ లాస్ టిప్ 6 - సంయమనం పాటించండి. బరువు తగ్గాలంటే రాత్రికి రాత్రే అయ్యే పనికాదు. కొంత కాలం పడుతుంది. కనుక తక్షణ ఫలితాలకై మీ శరీరాన్ని ఇబ్బంది పెట్టి ఒకే రోజు అలసిపోయేలా చేయకండి. వ్యాయామాలలో అపుడపుడు బ్రేక్ ఇచ్చినప్పటికి అది మీ శరీరానికి మంచిదే. అపుడపుడూ ఒక చాక్లెట్ లేదా పిజ్జా వంటివి తిన్నా మీ ఆహార ప్రణాళికకు అడ్డంకి కాదు.
మీ శరీరాన్ని అవగాహన చేసుకొని దాని కోరికలు గౌరవిస్తే అదే మీకు వెయట్ లాస్ అందిస్తుంది. డైటింగ్ పేరుతో అవసరమైన ఆహారాలు వదులుకోవడం, గంటల తరబడి వ్యాయామాలు చేసి శరీర సౌష్టవం మరింత దిగజారేలా చేసుకోకండి. పై చిట్కాలు పాటించి కొత్త సంవత్సరంలో ఆరోగ్యంతో మంచి శారీరక సౌష్టవంతో ఆనందించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications