Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
శరీర మలినాలను విసర్జించే 4 వేసవి ఆహారాలు!

వేసవి ప్రత్యేక ఆహారాలు
పుచ్చకాయ - వేసవిలో చల్లగా వుండటానికిగాను పుచ్చకాయ, కర్బూజ పండ్లు బాగుంటాయి. వీటిలో నీరు అధికం కనుక శరీరానికి కావలసినంత నీరు దొరుకుతుంది. మలబద్ధకం ఏర్పడదు. వీటిలో వుండే సహజ షుగర్ డైటింగ్ చేసేవారికి, డయాబెటీస్ రోగులకు కూడా మంచిదే. రసాలుండే ఈ పండ్లు ఎండవేడిమి రోజున మీ మూడ్ కూడా మార్చేస్తాయి.
మామిడిపండ్లు - మామిడిపండ్లలో వుండే పీచు పదార్ధం శరీర మలినాలను విసర్జిస్తుంది. ఈ కారణంగానే వేసవిలో మామిడి పండ్లను ప్రతివారూ పోషకాహారంలో చేరుస్తారు. ఎండకు కమిలిపోవటం, ఎండలకు మీ జుట్టు నష్టపోకుండా వుంటుంది. ఇందులో వుండే విటమిన్ ఎ చర్మానికి కాంతినిస్తుంది. విటమిన్ సి ఎండ దెబ్బలనుండి కాపాడుతుంది. అయితే, వీటిని అధికంగా తినకండి. ఎందుకంటే, వీటిలో కార్బోహైడ్రేట్లు అధికంగా వుంటాయి.
బీట్ రూట్ - ఈ జాబితాలో బీట్ రూట్ లు మంచి ఆరోగ్యకర ఆహారం. ఎర్రగా వుండే బీట్ రూట్ వేసవిలో తింటే శరీరం బాగా శుభ్రమవుతుంది. ఇందులో విటమిన్ సి, బి3, బి6, బేటా కెరోటిన్ లు మలినాలను విసర్జిస్తాయి. బీట్ రూట్ శరీరంలో రక్తం పెంచుతుంది కూడాను.
నిమ్మ - దాహం వేసిందంటే, చల్లని నిమ్మరసం లేదా నిమ్మ సోడా తాగేయటానికి చూస్తాం. నిమ్మలో విటమిన్ సి అధికం. శరీరానికి తగిన తేమనిస్తుంది. చెడు వ్యర్ధాలను బయటకు పంపుతుంది. కనుక దీనిని కూడా మీ వేసవి ఆహారంలో చేర్చండి. నిమ్మరసం ఉదయంవేళ తాగితే, పొట్ట శుభ్రం చేయటమే కాక రోజంతా మీలోని ఎసిడిటీ లెవెల్స్ సమతుల్యత కాపాడుతుంది.
ఈ ఆహారాలు తినటం ద్వారా వేసవిలో వేడిని అధిగమించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
