Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
లేట్ నైట్ పార్టీ ...ఒళ్ళంతా కొవ్వు?

పార్టీ లంటే తెగ ఇష్టపడేవారైతే కనీసం వారానికి 4 సార్లు అయినా పార్టీకి వెళ్ళేవారైతే, దీనిని తప్పక చదవండి. మీరు చిన్నవయసులో వున్నపుడు జీవితమంతా ఆటలు, పాటలుగానే వుంటుంది. కాని 30 సంవత్సరాల పైన బడ్డారో, మీరు ఆచరించే జీవన విధానం మీకు తెలియజెపుతుంది. మరి లేట్ నైట్ పార్టీలు మీలో కొవ్వు ఎలా పెంచుతాయో చూడండి.
కొవ్వు పెరిగే కారణాలు
1. నిద్ర సమస్యలు - నిద్రను మోసం చేస్తే మీ శరీరం బలహీనపడుతుంది. ఆలస్యమైన ప్రతి రాత్రి, వారాంతంలో నిద్రిద్దామని భావిస్తారు. కాని వారాంతాలు పార్టీలు అధికం. కనుక విశ్రాంతికి సమయం దొరకదు. ఈ రకంగా తగ్గే నిద్ర మీ జీవప్రక్రియ రేటును తగ్గించి మీ శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తుంది.
2. పార్టీలు పనిదినాలలో చేసుకోవడం - పార్టీలు పని దినాలలో చేసుకుంటే, రాత్రి నిద్ర లేక మరుసటిరోజు పని సమయంలో హేంగోవర్ తో నిద్ర మత్తు వదిలించుకోడానికి కాఫీలు, టీలు తాగి, జంక్ ఫుడ్ తిని మరింత సోమరి అయి, కొవ్వు పేరుకునేలా ప్రవర్తిస్తారు. కనుక పార్టీలు వారాంతంలో చేసుకోండి.
3. డ్రింకులో కేలరీలు అధికం - ఆల్కహాల్ తాగుతూంటే కొన్నాళ్ళకు కొవ్వు సహజంగా పేరుకుపోతుంది. మరి మీరు తాగే డ్రింకులు జాగ్రత్తగా ఎంపిక చేయకుంటే మీ ముఖం లావైపోవడం, పొట్ట కుండలా తయారవడం ఖాయం. కనుక తాగేటపుడు ఏ రకమైన ఆల్కహాల్ తాగాలనేది కూడా మీరు తెలుసుకోవాలి.
4. మంచింగ్ పిచ్చి...సైడ్ డిష్ లు. - ఆల్కహాల్ తో ఘన ఆహారం తింటే మంచిదే. కాని మీరు తినేదేమిటో కొంచెం ఆలోచించి తినండి. ఖాళీ పొట్టతో తాగకండి. తేలికగా అవుట్ అవుతారు. ఛీజ్ బాల్స్ లేదా బాగా వేయించిన చికెన్ వంటివి పొట్టను తేలికగా పెంచేస్తాయి. ఆరోగ్యకరమైన సలాడ్లు, గ్రిల్డ్ చికెన్ వంటివి తినండి.
5. వ్యాయామం చేసేందుకు అలసిపోయారా? శనివారం రాత్రి పార్టీలో అలసిపోయి, ఆదివారం ఉదయం అసలు వ్యాయామం చేయలేకపోతూంటారు. పైగా రాత్రి చేసిన డ్యాన్స్ లో కేలరీలు ఎన్నో ఖర్చు అయ్యాయని భావిస్తారు. మీరు తెలుసుకోవాల్సిందేమంటే, ఇటువంటి పార్టీలలో కేలరీలు ఖర్చు చేయటం కాదు. అధికంగా పొందుతారని తెలుసుకోండి. కనుక పార్టీలో ఎన్ని చిందులు వేసినా, ఉదయంవేళ మంచి వ్యాయామం చేయండి.
నియంత్రించలేని రీతిలో కొవ్వు ఒంటికి పట్టించుకుంటే అది తీవ్ర ఆరోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది. మీకుగల ఆరోగ్య సమస్యలకు పార్టీలు అసలు తగినవేనా అనేది కూడా నిర్ణయించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications