Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
డైటింగ్ చేస్తున్నారా? చర్మం జాగ్రత్త!

అందం, లోపలినుండి వస్తుంది. ముఖం సహజ మెరుపు కాస్మెటిక్స్ లో లేదంటారు చర్మ నిపుణులు.శరీరంలోని ఇతర అవయవాలవలెనే చర్మంకూడా మీ డైట్, జీవన విధానాలపై ఆధారపడివుంటుంది. మీ శరీరాన్ని లోపలినుండి పోషిస్తే, మీ చర్మం సంరక్షణ, వయసు పైబడకుండా కనపడటమనేవి మీ చేతుల్లో వున్నాయి. డైటింగ్ చేసేవారు సాధారణంగా అత్యవసరమైన ఫ్యాటీ యాసిడ్స్ నిలిపేస్తారు. ఇవి శరీరానికి ఎంతో అవసరం. చర్మానికే కాదు, గుండె సంబంధిత, రోగ నిరోధకత, సంతానోత్పత్తి, నరాల వ్యవస్ధ అన్నిటిపై ఇవి ప్రభావం చూపుతాయి.
శరీరంలో కొత్త కణాలు పుట్టేలా చేస్తాయి. డ్యామేజీ అయిన కణాలు తిరిగి జీవంపోసుకునేలా చేస్తాయి. మలినాలను తొలగిస్తాయి. ఇటీవల చేసిన పరిశోధనలు ఎస్సెన్షియల్ ఫ్యాటీ యాసిడ్లు పొడి చర్మానికి మందుగానే కాదు బరువు తగ్గించేందుకు కూడా తోడ్పడతాయని తెలుపుతున్నాయి. కనుక మీరు తినే ఆహారంలో బరువు తగ్గాలంటూ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్ లను తొలగించకండి. ఇవి వుండే ఆహారాలు తప్పక తీసుకోండి అంటున్నారు చర్మ సంరక్షక నిపుణులు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
