Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
తక్కువ ఖర్చుతో ఆరోగ్యమైన తిండి!

1. బెర్రీ బదులు మిరియాలు - బెర్రీలు ఏవైనప్పటికి యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందించి మన శరీరంలోని మలినాలను కడిగేస్తాయి. అయితే వీటికి బదులుగా పచ్చిమిరప లేదా మిరియాలు వంటివాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుండి ప్రయోజనం చేకూరుస్తాయి.
2. యాపిల్ బదులు గా ఐరన్ అధికంగా వుండే జామ కాయ, ఆకు కూరలు - యాపిల్ ఖరీదైనదే. ప్రత్యేకించి సీజన్ కాకపోతే మరింత ఖరీదు. యాపిల్ లోని ఐరన్ బదులుగా జామకాయ తినండి. బచ్చలికూర, తోటకూర వంటి ఆకు కూరలు అధికంగా తిని తక్కువ వ్యయంతో ఐరన్ శరీరానికి అందించండి.
3. బీన్స్, బఠాణీ, కాయ ధాన్యాలు వంటివి తక్కువ వ్యయంతో పోషకాలను అందిస్తాయి.
4. ఓట్లు - ప్రతిరోజూ ఉదయం వేళ అల్పాహారం లేదా బ్రేక్ ఫాస్ట్ అంటూ ఎంతో వ్యయం చేస్తాం. ఇడ్లీ, పూరీ, దోశ మొదలగు వాటికి బదులు, ఓట్లు కొద్దిపాటి పాలు లేదా వేడి నీటిలో కలిపి తీసుకుంటే అవి ఆరోగ్యంగా వుంచి కొవ్వు అధికంకాకుండా కూడా చేస్తాయి.
5. అరటిపండు - దీనిలో కార్బో హైడ్రేట్లు అధికంగా వుండి ఎంతో శక్తినిస్తాయి. ప్రతిరోజు ఒక అరటిపండు ఎంతో ఆరోగ్యం ఇస్తుంది. కాయ ధాన్యాలు ఖరీదనుకుంటే, చవకైన అరటిపండు ప్రతిరోజూ ఉదయంవేళ ఆహారంగా తీసుకుంటే చురుకుగా వుంచుతుంది.
6. మంచి కొల్లెస్టరాల్ అధికంగా కావాలా? మాంసం చాలా ఖరీదు. దీనికి బదులుగా చేప ఆహారం తింటే వ్యయం తక్కువ. అంతే కాదు దానిలో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు వ్యయం తక్కువలో మీకు మంచి ఆరోగ్యం ఇస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
