Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
గడ్డం కింది కొవ్వు....గాయబ్!

గడ్డం కింద అదనపు గడ్డం ఏర్పడే కారణాలు -
1. వంశానుగత ముఖ సౌందర్యం - కొంతమందికి ఈ డబుల్ ఛిన్ అనేది కుటుంబంలోనే వుంటుంది. వీరు సన్నగా వున్నప్పటికి మెడకింద ఇది వుంటుంది. జీన్స్ ని బట్టి శరీరంలో ఈ సంచి ఏర్పడుతుంది. శరీరంలో కంటే కూడా ఈ సంచిలో అధిక కొవ్వు కణాలకు జీన్స్ సహకరిస్తాయి.
2. అధిక నీరు ఏర్పడటం - కొంతమంది మహిళలలో ప్రెగ్నెన్సీ సమయంలో ఈ అధిక గడ్డం వస్తుంది. దీనికి కారణం ఆమె శరీరంలో నీరు చేరటమే. శరీరం అంతా ఉబ్బినట్లు, గడ్డం కూడా ఉబ్బి రెండుగా కనపడుతుంది.
3. అధిక బరువు - ఊబకాయం ఉన్నవారికి ఈ గడ్డం కింద కొవ్వు ఏర్పడుతుంది. మీరు అధిక బరువు అయితే, అపుడు కొవ్వు శరీరమంతా వచ్చేస్తుంది. ఇక కొవ్వు కణాలకు శరీరంలో చోటు లేకుంటే, ముఖంపై పెరిగిపోతాయి. గడ్డం కింద సంచి లా వచ్చేస్తాయి.
4. వయసుతోబాటు - వయసు పైబడుతున్న కొద్ది, చర్మం ముడుతలు పడి, గడ్డం కింద కూడా ముడుతలు పడి వేలాడుతుంది. వయసులో వుండగానే గడ్డం కింద కొవ్వు వుంటే, పెద్దవారైన తర్వాత మరింత అధికం అవుతుంది. ఈ అధిక కొవ్వు మీ ముఖం అందాలను పాడుచేస్తుంది.దానిని వదిలించుకోవాలంటే, మీరు వ్యాయామాలు చేయాలి. ఆహార ప్రణాళికలు ఆచరించాలి. ఈ కొవ్వు సంచి గడ్డం కింద నుండి పోవాలంటే, కింది ఆహారాలు ప్రయత్నించండి.
1. అసలు డబుల్ ఛిన్ ఎందుకు వచ్చిందనేది తెలుసుకోండి. మీకు తగిన ఆహారం నిర్ణయించుకోండి. మీ అదనపు గడ్డం నీటి సంబంధం అయితే, కార్బోహైడ్రేట్లు తగ్గించాల్సిన పనిలేదు.
2. గడ్డం కింది కొవ్వు వున్నవారు. ఆహార పరంగా జాగ్రత్త పడాలి. జంక్ ఫుడ్ తినరాదు. వంశానుగతంగా కనుక మీకు వుంటే, చిన్న వయసునుండే జాగ్రత్త పడండి.
3. ఊబకాయం కూడా గడ్డం కింది కొవ్వుకు కారణం అవుతుంది. కనుక, శరీరం అంతా కొవ్వు తగ్గేలా చూడండి. మీ అదనపు గడ్డం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది.
4. చికెన్, టర్కీ, వంటివి తినేటపుడు తక్కువగా తినండి. రెడ్ మీట్ అరుదుగా తింటే కొవ్వు తగ్గుతుంది.
5. మీ అదనపు గడ్డం కనుక నీటి వలన ఉబ్బిపోతుంటే, సోడియం, పొటాషియం మీ ఆహారాలలో తగ్గించండి. అంటే, ఉప్పు తగ్గించాలి. ఉప్పు అధికంగా వుండే స్నాక్స్ తినకండి.
6. పైన తెలిపిన ఆహార జాగ్రత్తలు తీసుకుంటూ, మీరు తినే ఆహారాన్ని బాగా నమలండి.ఆహారం మింగే ముందు మీ గడ్డం, నోరు, ముఖంలోని ఇతర భాగాలు బాగా కదిలేలా నమలండి. మాంసం ముక్కలు లేదా చెరకుగడ వంటివి తింటూ వుంటే, ముఖానికి తగినంత వ్యాయామం ఏర్పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
