Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
మంచి నిద్రను కలిగించే తేలికైన వ్యాయామాలు!

మంచి నిద్రకుగాను వ్యాయామాల సమయం ఎలా వుండాలి?
రాత్రి నిద్రించే ముందర లేదా నిద్రకు మూడు గంటల ముందుగా వ్యాయామాలు తీవ్రంగానే చేయాలి. చాలామంది వ్యాయామాలు అధికంగా రాత్రులలో చేస్తే అలసట వస్తుందనుకుంటారు. నిద్రకుముందు చేసే తీవ్ర వ్యాయామం మీ గుండె, బ్రెయిన్, కండరాలను ప్రభావితం చేస్తుంది. రాత్రివేళ నిద్ర హాయిగా పట్టేలా చేస్తుంది. వ్యాయామం ఒత్తిడి తగ్గించి మీకు తేలికైన భావన కలిగిస్తుంది. ఈ భావన మీకు మంచి నిద్రనిస్తుంది. మధ్యాహ్నం వేళ లేదా సాయంత్రాలు వ్యాయామం చేస్తే మీ శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. నిద్ర సమయానికి పెరిగిన ఉష్ణోగ్రత సాధారణ స్ధాయికి చేరి నిద్ర పట్టేలా చేస్తుంది. తగ్గిన ఉష్ణోగ్రత మీ శరీరానికి మంచి నిద్రను కలిగిస్తుంది.
నిద్ర కొరకు చేయాల్సిన వ్యాయామాలు - చేసే వ్యాయామం గుండె వేగంగా కొట్టుకునేదై వుండాలి. కండరాలను పటిష్టం చేయడానికి కనీసం 20 నిమిషాలు వ్యాయామం చేయండి. కండరాల బలానికి చేసే వ్యాయామాలు, యోగ, స్ట్రెచింగ్ వంటివి నిద్రకు బాగా సహకరిస్తాయి. గుండెవేగం పెంచే వ్యాయామాలకు మించినవి నిద్ర అవసరానికి లేవు.
జంపింగ్, జాగింగ్, నడక, డ్యాన్సింగ్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ వంటివి కూడా మీ వ్యాయామాల జాబితాలో చేర్చండి. ఇవి రక్తంలోని ఆక్సిజన్ అధికం చేస్తాయి. వీటిని కనీసం 20 నిమిషాలపాటు చేయండి. మంచి నిద్రకు వారానికి కనీసం నాలుగు సార్లు అయినా చేయాలి.
రోజులో చేసే శారీరక వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించి మంచి మూడ్ ఇస్తాయి. వ్యాయామానికి మన శరీరానికి మనసుకు సంబంధాలు అధికంగా వున్నాయని స్టడీలు చెపుతున్నాయి. యోగా కూడా మంచి నిద్రకొరకు ఆచరించవచ్చు. యోగ, శ్వాస సంబంధిత వ్యాయామాలు బ్రెయిన్ లో రక్తప్రసరణ అధికం చేస్తాయి. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications