Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
అధిక బరువును కలిగించే స్పోర్ట్స్ డ్రింకులు!

ఈ డ్రింకులలో షుగర్ స్ధాయి అధికంగా వుంటుంది. ప్రతి బాటిల్ లో షుమారుగా 270 కేలరీల శక్తి వుంటుంది. హాని కలిగించే కేఫైన్ వుంటుంది. ఈ కేఫైన్ కారణంగానే ఆ డ్రింకు అరగని సామాన్యులకు గుండె జబ్బులు, ప్రవర్తనా సమస్యలు, ఇతర వ్యాధులు సంక్రమిస్తాయి. ప్రతిరోజూ వ్యాయామాలు చేస్తూ, అధిక కేలరీలు ఖర్చు చేస్తూ, చురుకుగా తిరిగే వారికి మాత్రమే ఈ రకమైన ఎనర్జీ డ్రింకులు తయారు చేయబడ్డాయని ఇవి సామాన్య కదలికలు కల వ్యక్తులు వినియోగించడం వలన వారికి అధికబరువు చేకూరుస్తున్నాయని యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అధారిటీ వెల్లడించింది.
అయితే, ఇంగ్లాండ్ లో నిర్వహించిన ఒక సర్వేలో షుమారు 11 మిలియన్ల పైగా ప్రజలు, వీరిలో సుమారు పాతిక భాగం పైగా పురుషులు తమ కార్యాలయాలలో ఈ స్పోర్ట్స్ డ్రింకులు తాగుతున్నట్లు డెయిలీ ఎక్స్ ప్రెస్ వెల్లడించింది. మరో మూడు వంతుల జనాభా వ్యాయామాలు చేసేవారు అధిక ఎనర్జీ కావాలంటూ వీటిని తాగేస్తున్నారట. నేచురల్ హైడ్రేషన్ కౌన్సిల్ నిర్వహించిన సర్వేలో సుమారు 19 శాతం మంది అలసినపుడు వీటిని తాగుతున్నారని 18 శాతం మంది వారికి హేంగోవర్ వచ్చినపుడు తాగుతున్నారని తెలిపింది.
మొత్తంగా వీరంతా చేరి ప్రతి సంవత్సరం ఇంగ్లాండ్ దేశంలో షుమారు 160 మిలియన్ల లీటర్ల స్పోర్ట్స్ డ్రింకులు తాగేస్తున్నారట. సుమారు 80 శాతం మంది వారు వ్యాయామం చేసే ముందు కనీసం నీరు తాగటం కూడా మరచిపోతున్నారట. సుమారు 60 శాతం మంది వ్యాయామాల తర్వాత హైడ్రేషన్ కొరకు కూడా నీరు తాగటం లేదని 30 శాతం అసలు వాటర్ బాటిల్ కూడా వారి కిట్ లో తెచ్చుకోరని పత్రిక వెల్లడించింది.
ఒక మాదిరి వ్యాయామం చేసేవారు అంటే 45 నిమిషాలు వరకు చేసేవారికి శరీరంలో నీరు బాగానే అవిరి అయిపోతుంది. అయినప్పటికి వ్యాయామం చేసేవారు వారి దుస్తులు, వ్యాయామ శిక్షకులు వంటి వారికే ప్రాధాన్యతనిస్తున్నారు కాని శరీరానికవసరమైన నీటికి అసలు ప్రాధాన్యతనివ్వటం లేదు.
35 శాతం మంది వ్యాయామంలో అధిక శక్తి కొరకు ఈ స్పోర్ట్స్ డ్రింకులు తాగగా 21 శాతం శరీర హైడ్రేషన్ కొరకు 20 శాతం దాని రుచి బాగుంటుందని తాగేస్తున్నారట. ప్రజలు తాగుతున్న ఈ స్పోర్ట్స్ డ్రింకుల స్ధాయి చూస్తే ఆందోళన కలుగుతోందని లీడ్స్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ లోని ఎక్సర్ సైజ్ అండ్ ఒబేసిటీ ప్రొఫెసర్ డా. పౌల్ గేట్లీ వెల్లడించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications