Latest Updates
-
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే.. -
ఫోన్ పక్కనపెట్టి ఇది ట్రై చేయండి.. హృతిక్ చెబుతున్న హెల్త్ టిప్స్! -
నార్త్ స్టైల్ చోలే మసాలా.. పూరీ, చపాతీలోకి వేళ్లు చప్పరిస్తూ లాగించేస్తారు.! -
చికెన్, మటన్ కంటే 50 రెట్లు బలం..ఏడాది పాటు నిల్వ ఉండే బోడకాకరకాయ పచ్చడి ఇలా చేయండి -
వయసు పైబడితేనే అల్జీమర్స్ వస్తుందా.. మతిమరుపునకు దారితీసే ప్రమాదకర కారకాలివే.!
నడుము లావు తగ్గటానికి.....?

నడుము భాగం అధింకంగా వుంటే చూపులకు అసహ్యంగా వుండటమే కాదు. అనారోగ్యం కూడాను. పురుషులకు 40 అంగుళాలపైనా, మహిళలకు 35 అంగుళాలపైనా నడుం కొలత వుంటే అది అధికబరువు సమస్య. జీవప్రక్రియ సరిలేనట్లే. ఈ సరిలేని జీవప్రక్రియ ఇన్సులిన్ పై అధిక ప్రభావం చూపి చివరకు డయాబెటీస్ లేదా గుండె సంబంధిత వ్యాధులకు దోవతీస్తుంది.
శరీరం పై భాగం సన్నగా వుండి, కిందిభాగంలో పొడుచుకువచ్చిన పొట్టతో నడుము భాగం కనుక అధికంగా వుంటే వీరికి అధిక రక్తపోటు వుండి గుండె పోటు వచ్చే అవకాశాలు, సాధారణ శరీరం కలవారికంటే కూడా మూడు రెట్లు అధికం అంటున్నారు నిపుణులు. కనుక మీ నడుము భాగాన్ని సరైన సైజులో వుంచుకోవటం ప్రధానం. అందుకుగాను - కార్బోహైడ్రేట్లు అధికంగా వుండే బంగాళదుంపలు, తీపి పదార్ధాలు, తెల్లటి పిండి తో చేసిన లేదా రిఫైన్ చేసిన బ్రెడ్, పస్తా, రైస్, గోధుమ పిండి వంటివి తినకండి. ఇన్సులిన్ ప్రభావాన్ని పెంచేందుకు వీలైనంతవరకు రైస్ వంటివి బాగా తగ్గించండి. పూర్తిగా మానకండి. కార్బోహైడ్రేట్లు ఆరోగ్యమైన బరువు వున్నంతవరకు మంచివే. కాని పొట్ట అధిక బరువు ఎక్కితే వీటిని గణనీయంగా తగ్గించాల్సిందే.
తాజా కూరగాయలు అధికంగా తినండి. కొద్దిపాటి పండ్లు, బెర్రీల వంటివి తినండి. వీటిలో వుండే కార్బో హైడ్రేట్లే మీకు సరిపోతాయి. ప్రొటీన్ల కొరకు గాను, గుడ్లు, పప్పులు, లీన్ మీట్, చేప, చికెన్ వంటివి తినండి. పాలఉత్పత్తులు తగ్గించి తినండి. ఆరోగ్యకరమైన కొవ్వులు అవసరం. ఆరోగ్యకరమైన ఆలివ్ నూనె తో వేయించిన కూరలు, చికెన్, ఫిష్ వంటివి తినండి. కొబ్బరి నూనె, ఒమేగా 3 వుండే చేప నూనె, మంచివి. పప్పులు కూడా ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు ఇస్తాయి. నడుము భాగం తగ్గాలంటే, ఒత్తిడి స్ధాయి కూడా తగ్గించుకోవడం ప్రధానం. సన్నగా వుండే మహిళలు ఒత్తిడికి గురైనపుడు పొట్టకు కొవ్వు పట్టించుకున్నట్లు స్టడీస్ చెపుతున్నాయి. ఒత్తిడి వుంటే హార్మోన్లు రిలీజ్ అయి శరీర కొవ్వు అధికంగా పెరిగేటందుకు దోహదం చేస్తాయని కూడా స్టడీలు చెపుతున్నాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications