Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
బరువు తగ్గించే ఆరోగ్యకర చిరుతిండ్లు !

నట్స్ - ప్రతిరోజూ గుప్పెడు బాదం పప్పులు తింటే చెడు కొల్ల్లెస్టరాల్ 4.5 శాతం తగ్గుతుంది. ఇవి అధిక పీచు కలిగి తక్కువ కార్బోహైడ్రేట్లతో వుంటాయి. కడుపు కూడా నింపుతాయి. విటమిన్లు, ప్రొటీన్లు, తక్కువ కొవ్వు కలిగి వుంటాయి. జీడిపప్పు, అప్రికాట్, వాల్ నట్స్ వంటివి కూడా ఆరోగ్యమే. ఉదయం లేదా సాయంత్రం స్నాక్స్ గా తినవచ్చు.
వెజిటబుల్ సూప్ - నేటి చలికాలంలో చల్లదనాన్నుండి తట్టుకోడానికి బరువు తగ్గించుకోడానికి అద్భుతమైన ఆహారం వెజిటబుల్ సూప్. సూప్ లో ఉడికించిన కూరగాయలు ప్రొటీన్లు, ఇతర పోషకాలను అందిస్తాయి. కేరట్ లేదా టమాటా వంటివి వేస్తే మరింత కడుపు నింపుతాయి.
సలాడ్లు - తాజాగా కోసిన కూరలు లేదా పండ్లు చక్కగా కడుపు నింపటమే కాదు, బరువు తగ్గించే ఆరోగ్యకర ఆహారం. పండ్లను కడుపు నింపేందుకు ఇష్టమైన ఆహారంగా తినవచ్చు. దీనికి తక్కువ కొవ్వున్న వెన్న లేదా పెరుగు లేదా ఛీజ్ వంటివి చేరిస్తే సలాడ్ మరింత రుచిగా వుంటుంది.
కేరట్ - కేరట్లు ముక్కలుగా చేసి వాటికి వెన్న లేదా పెరుగు వంటివి చేర్చి తింటే కడుపు నిండి హాయిగా వుంటుంది. బరువు తగ్గటమే కాదు కేరట్లు మీకు మంచి చర్మపు రంగు, నిగనిగలాడే జుట్టు కూడా ఏర్పరుస్తాయి.
తక్కువ కొవ్వుండే పెరుగు - పెరుగు నేరుగా తినేయవచ్చు లేదా కొద్దిపాటి ఉప్పు లేదా పండ్లు లేదా కూరగాయలవంటివి కలిపి తినవచ్చు. బెర్రీలు మరింత రుచిగా వుంటాయి.
బరువు తేలికగా తగ్గాలంటే ఈ సహజ పదార్ధాలను స్నాక్స్ గా తీసుకుంటూ ఆరోగ్యంగా కూడా వుండవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications