Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆకర్షణీయ మెడకు తేలికైన వ్యాయామాలు!

1. తిన్నగా నిలబడండి. తల కొద్దిగా పైకెత్తి సీలింగ్ చూడండి. పెదాలను సాగదీస్తూ గాలిలోకి పైకి ముద్దాడండి. అయిదు నుండి పది సెకండ్లు. అయిదు సార్లు చేయండి. ముఖం లోని ఇతర కండరాలను బిగపట్టకండి.
2. మెడను అటునుండి ఇటుకు ఇటునుండి అటుకుఛాతీ పైభాగాన్ని టచ్ చేస్తూ తిప్పండి. దీనిని నించుని లేదా కూర్చుని కూడా చేయవచ్చు. మెడను పూర్తిగా కూడా రొటేట్ చేయవచ్చు. పూర్తిగా కష్టమైతే సగం సర్కిల్ మాత్రమే చేయండి. ప్రతి భుజం వైపు మెల్లగా అయిదు లేదా ఆరు సార్లు చేయండి.
3. వజ్రాసనంలో కూర్చోండి. కుడిచేయి తలపై పెట్టండి తలను కుడి భుజంవైపు సాగేటంతవరకు వంచండి. అయిదు వరకు లెక్కించి రిలాక్స్ అవండి. దీనిని ఎడమవైపు కూడా చేయండి. ప్రతి సైడు ఎనిమిది నుండి 10 సార్లు చేయండి.
4. కూర్చుని లేదా నిలబడి సీలింగ్ వైపుగా చూస్తూ ఉఫ్ మంటూ గాలి వదలండి. పెదాలను లోపలికి బిగపడుతూ కూడా చేయవచ్చు. దీనిని 10 నుండి 15 సార్లు చేయండి.
5. చేతులు లేని ఛైర్ పై కూర్చోండి. తలను మెల్లగా వెనక్కు తీసుకు వెళ్ళండి. నోరు మూయటం తెరవగలిగినంత తెరవటం చేయండి.
6. గడ్డాన్ని పైకి ఎత్తండి ఏదో నములుతూ వున్నట్లుగా నమలండి. దవడలు బాగా కదలాలి.
అతి సామాన్యమైన ఈ గడ్డం వ్యాయామాలు ప్రతిరోజూ చేసి మీ గడ్డం కింద మెడ భాగాన వున్న కొవ్వును కరిగించేయండి. ఆకర్షణీయమైన మెడను సొంతం చేసుకోండి. రోజువారీ అన్నిరకాల వ్యాయామాలు చేయకపోయినప్పటికి మెడ, ముఖం వంటి ప్రధాన భాగాలకు వ్యాయామాలు చేస్తే బయటివరకు కనపడే శరీర భాగాలు ఆకర్షణీయంగా వుంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications